Home /News /andhra-pradesh /

AP POLITICS TELUGU DESAM PARTY LEADERS SLAMS CM JAGAN AND YCP GOVERNMENT ON AYYANAPATRUDU ISSUE NGS VSP

TDP Warning to YCP: మీరు ఒక్క ఇంటిని కూల్చితే.. మేం పది ఇళ్లు కూలుస్తాం.. వైసీపీ నేతల్ని తరిమి కొడతాం..

టీడీపీ వర్సస్ వైసీపీ

టీడీపీ వర్సస్ వైసీపీ

TDP Warning to YCP: నర్శిపట్నంలో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో.. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయ్యన్న ఇళ్లు కూల్చడం అక్రమం అంటున్న తెలుగు దేశం నేతలు.. అదే స్థాయిలో వైసీపీకి వార్నింగ్ ఇస్తున్నారు. మీరు ఒకటి కూల్చితే మేం పది కూల్చుతాం.. సీఎం క్యాంప్ ఆఫీసును కూడా వదలమంటున్నారు.

ఇంకా చదవండి ...
  TDP Warning to YCP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార వైసీపీ (YCP), టీడీపీ (TDP) నేతల మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నర్సీపట్నం (Narsipatnam) లో హైటెన్షన్‌ నెలకొంది. మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు  (Ayyanna Patrurdu)ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అయ్యన్నను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే బుల్డోజర్ పెట్టి ఆయన ఇంటి ముందు భాగాన్ని కూల్చి వేశారు. దీనిపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) ఘాటుగా స్పందించారు. ఆదివారాన్ని విధ్వంస దినంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం (Jagan Mohan Reddy Government) మార్చిందని ఆయన మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను కూల్చడాన్ని ఆయన ఖండించారు. కేవలం ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న కారణంతో తమ పార్టీ నేత అయ్యన్నపాత్రుడిపై జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక విధ్వంసాలు, విద్వేషాలు, కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రాన్ని అస్తవ్యస్థంగా చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో గూండారాజుగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఆయన విమర్శించారు.

  పోలీసులు అధికారపక్షానికి ఇప్పుడు సపోర్టింగ్‌గా నిలిస్తే.. ఆ తరువాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. పోలీసులు, అధికారులు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని గుర్తుంచుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. జగన్ పాలనలో ఆగడాలు, అకృత్యాలు కోకొల్లలుగా జరుగుతూ పోలీసుల అతిప్రవర్తనకు అదుపు లేకుండా పోయింది. నేరస్థుడు రాజ్యం ఏలితే ఎన్ని అనర్ధాలు చోటు చేసుకొంటాయో, అరాచక శక్తులు ఏ విధంగా చెలరేగిపోతాయో, ఆర్ధిక వ్యవస్థ ఏ విధంగా నాశనమవుతుందో మూడేళ్లలో జగన్ రెడ్డి పాలనలో జరిగిన ఉదంతాలే నిదర్శనం అంటూ తీవ్ర విమర్శలకు దిగారు అచ్చెన్న.  

  మరోవైపు ఆ పార్టీ బుద్దా వెంకన్న సైతం ఘాటుగా స్పందించారు. అక్రమంగా మీరు ఒక్క ఇళ్లు పడగొడితే.. మేం పదిళ్లు పడగొడతాం గుర్తొంచుంకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. తాడేపల్లిలో ఉన్న సీఎం ఇంటిని కూడా వదలం అన్నారు. అలాగే ఏపీలో ఉన్న వైసీపీ నేతలందరినీ తరిమికొట్టే రోజు వస్తుందని గుర్తుంచుకోవాలి అంటూ బుద్దా వెంకన్న వార్నింగ్ ఇచ్చారు.

  ఇదీ చదవండి : గత ఎన్నికల్లో నెగ్గిన చోట కూడా టీడీపీ షాక్.. ఆ మహిళా నేత పోటీకి దూరం అవుతున్నారా..?

  మరోవైపు ప్రస్తుతం నర్సీపట్నం హైటెన్షన్ నెలకొంది. అయ్యన్న పాత్రుడు ఇంటికి బారీగా పోలీసులు చేరుకున్నారు. ఏ క్షణం లో అయినా అరెస్టు చేసే అవకాశం ఉంది అంటున్నారు. చోడవరం మిని మహానాడు లో అనుచిత వాక్యలు చేశారనేది ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Kinjarapu Atchannaidu, TDP, Vizag

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు