Home /News /andhra-pradesh /

AP POLITICS TELUGU DESAM PARTY LEADERS NARA CHANDRABABU AND NARA LOKESH WILL GO PEOPLE DAILY THIS IS THE ROUTE MAP NGS

TDP: ఇకపై ప్రజా క్షేత్రంలోకి లోకేష్.. ముహూర్తం ఫిక్స్ చేశారా..? ప్లాన్ ఏంటి..?

వైసీపీ తిట్ల దండకానికి లోకేష్ కౌంటర్

వైసీపీ తిట్ల దండకానికి లోకేష్ కౌంటర్

TDP: మళ్లీ అధికారమే లక్ష్యంగా తెలుగు దేశం పార్టీ అడుగులు వేస్తోంది. ఏ అవకాశాన్ని వదలకుండా ముందుకు వెళ్లేందుకు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసినట్టు సమాచారం. ఇందలో భాగంగా ఇకపై కీలక నేతలంతా ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ రెడీ చేశారాని.. దానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు టాక్..

ఇంకా చదవండి ...
  Telugu Desam Party:  గత ఎన్నికల్లో ఓటమి తరువాత తెలుగు దేశానికి వరుస పరాజయాలు తప్పడం లేదు. ఉప ఎన్నికల అవ్వొచ్చు.. స్థానిక ఎన్నికలు అవ్వొచ్చు.. ఎన్నిక ఏదైనా టీడీపీ (TDP) పరాజయాలు తప్పలేదు.. ఒక్కటంటే ఒక్క గెలుపు కూడా రుచి చూడలేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు  (Chandrababu Naidu) సొంత నియోజకవర్గం కుప్పం (Kuppam) లోనూ ఓటమి తప్పలేదు. చంద్రబాబు నాయుడు కంచుకోటలో కూడా వైసీపీ జెండా ఎగిరింది. ఇక చాలామంది టీడీపీ నేతలు కూడా.. పార్టీకి దూరమయ్యారు. అసలు ప్రస్తుతం పార్టీతో ఎంతమంది ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. ఇక టీడీపీ నేతలపై కేసులు.. వేధింపులు చాలా కామన్ అయ్యాయి. అందుకే ఈ సారి అధికారంలోకి రావడం చాలా ముఖ్యంగా భావిస్తున్నారు టీడీపీ అధినేత.. ఈ సారి అధికారం రాకపోతే మరిన్ని కష్టాలు తప్పవు అని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే ఈ సారి అధికారంలోకి రావడం కూడా అంత ఈజీ కాదు.. దీని కోసం మరింత కష్ట పడక తప్పదు.. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్ని అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. అందుకు ఆయనే మొదటిగా పొత్తులపై నోరు విప్పారు కూడా.. అక్కడితోనే ఆయన ఆగిపోవడం లేదు.. ఇకపై కీలక నేతలంతా ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించారు..

  ఇకపై ప్రజాక్షేత్రంలో ఉండి.. ప్రభుత్వ తప్పుడు విధానాలు ఎండగడుతామని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ (Nara Lokesh) వెల్లడించారు. మార్చి 29వ తేదీన.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడుతామని ప్రకటించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ ముగిసిన తరువాత నుంచి.. ఇకపై నేరుగా ప్రజల్లో చట్టసభల్లో తమ గొంతు నొక్కినా.. ప్రభుత్వ తప్పిదాలను మాత్రం వదిలిపెట్టమని ఖరాఖండిగా చెప్పారు. ఏపీ రాష్ట్రంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శల బాణాలు విసురుకుంటున్నారు. ఈ క్రమంలో మద్యం, కల్తీ సారా ఇతరత్రా అంశాలపై ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీపీ సభ్యులు ప్రయత్నించారు. సభలో ఆందోళన చేయడంతో వారిని స్పీకర్ సస్పెండ్ చేస్తూ వచ్చారు. ప్రధానంగా మూడు రాజధానులపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం జగన్ మాట్లాడారు.

  ఇదీ చదవండి : రాజయోగం ఎవరికి.. అవమానం ఎవరికి..? ఆదివారం విందు ఆ వెంటనే రాజీనామాలు

  ముఖ్యంగా రాష్ట్రంలో కల్తీ మద్యం మరణాలు.. ప్రభుత్వం వ్యతిరేక విధానాలు.. అమరావతి రాజధాని విషయంలో రైతులను మోసం చేసిన తీరు.. కోర్టు తీర్పులపై ప్రభుత్వం ఎదురు దాడి చేయడం.. ప్రజల సమస్యలను గాలికి వదిలేయడం.. రాష్ట్రంలోపెరిగిపోయిన అప్పులు.. ఆర్థిక సమస్యలు అన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. కీలక నేతలంతా ఇకపై ప్రజల్లోనే ఉండి.. ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని నిర్ణయించారు.

  ఇదీ చదవండి : పొత్తులతో కాదు.. దమ్ముంటే సింగిల్ గా రండి అంటూ చంద్రబాబు, లోకేష్ కు రోజా సవాల్..?

  ఈ సందర్భంగా నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి న్యాయవ్యవస్థపై దాడికి దిగలేదని, 10వ తరగతి తప్పిన వ్యక్తి ఆలోచనతో న్యాయ వ్యవస్థపైనే దాడికి దిగిన వ్యక్తి సీఎం జగన్ అని తెలిపారు. అమరావతిలో నిర్మాణాలు పూర్తైన భవనాలకు సీఎం జగన్ కనీసం ప్రారంభం కూడా చేయలేదని తప్పుబట్టారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులకు గుంతలు పూడ్చలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారా అని ప్రశ్నించారు. ప్రిజనరికి విజనరికి ఉన్న తేడాను ప్రజలు గుర్తించాలని సూచించారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Nara Lokesh, TDP

  తదుపరి వార్తలు