Home /News /andhra-pradesh /

AP POLITICS TELUGU DESAM PARTY LEADERS DIFFERENT PROTEST AGAINST CHEAP LIQUOR SALES IN CHITOOR AND VIJAYWADA NGS

Deputy CM: డిప్యూటీ సీఎంకు మద్యంతో అభిషేకం.. టీడీపీ నేతలు ఏమన్నారంటే..?

డిప్యూటీ సీఎంకు మద్యంతో అభిషేకం

డిప్యూటీ సీఎంకు మద్యంతో అభిషేకం

Deputy CM: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కల్తీ మద్యం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అటు అసెంబ్లీలోనూ.. ఇటు బయట నాటు సారాపై మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎంకు టీడీపీ నేతలు వినూత్నంగా మద్యంతో అభిషేకం చేశారు.. ఎందుకో తెలుసా..?

ఇంకా చదవండి ...
  TDP Protest Against Cheap Liqour: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మద్యం పై రాజకీయ దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య కల్తీ సారా వార్ కొనసాగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కల్తీ సారా, జే బ్రాండ్ మద్యం తాగి ప్రజలు చనిపోతున్నారని టీడీపీ(Tdp) గత కొన్ని రోజుల నుంచి ఆందోళనలు కొనసాగిస్తోంది. అంటు అసెంబ్లీలోనూ.. ఇటూ బయటా టీడీపీ నిరసనలు చేస్తోంది. ఈ నాటుసారా రచ్చ రాష్ట్రంలో డైలీ సీరియల్‌ లా తయారైంది. కల్తీసారాపై టీడీపీ ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ విజయవాడలలోని ఎక్సైజ్‌ ఆఫీసు ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ఎక్కడికక్కడ టీడీపీ ఎమ్మెల్యేలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఎక్సైజ్ ఆఫీసుకు ఎవరూ రాకుండా అడ్డుకున్నారు. అలాగే అసెంబ్లీ నుంచి సస్పెండయిన 11 మంది ఎమ్మెల్యేలతో కీలక నేతల ఇళ్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్సైజ్‌ ఆఫీసు దగ్గరకు రానీయకుండా చర్యలు తీసున్నారు. విజయవాడ (Vijayawada)లో దేవినేని ఉమ(Devineni Uma), బోండా ఉమా (Bonda Uma), గద్దె రామ్మోహన్ (Gadde Rammohan), అచ్చెన్నాయుడు (Atchannaidu), బొడే ప్రసాద్ (Bode Prasad), వర్ల రామయ్య (Varla Ramayya)లను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని సైతం హౌస్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు. టీడీపీ కార్యాలయానికి బయల్దేరిన అచ్చెన్నను ఇల్లు కదలకుండా బందోబస్తు మోహరించారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు.

  మరోవైపు కల్తీ సారాపై చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో టీడీపీ కార్యకర్తలు వినూత్నం నిరసన చేపట్టారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి (Deputy CM Narayana Swamy) తీరుపై టీపీపీ నాయకులు మండిపడ్డారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో మాజీ సీఎం చంద్రబాబుపై బూతును ప్రయోగించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. తన మంత్రి పదవి ఊడిపోతుందనే భయంతో.. మతి భ్రమించి నారాయణ స్వామి మాట్లాడుతున్నారని కార్యకర్తలు మండిపడ్డారు. ఆయన తీరుకు నిరసనగా.. పుత్తూరు జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేశారు.

  ఈ సందర్భంగా టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవ‌ల క‌ల్తీ సారా, జే బ్రాండ్ల కారణంగా మ‌ర‌ణాలు విప‌రీతంగా సంభ‌విస్తున్నాయి. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెంలోనే వారం రోజుల్లో 28 మందికి పైగా సారా తాగేవాళ్లు మృతి చెందారు. ఏలూరు ప్రభుత్వ ఆస్ప‌త్రిలోనూ జే బ్రాండ్ ప్ర‌మాద‌క‌ర మ‌ద్యం తాగిన వారు చికిత్స పొందుతున్నారుని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించి.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం దారుణమన్నారు.

  ఇదీ చదవండి : కేంద్రంపై వైసీపీ-టీడీపీ ఉమ్మడి పోరాటం.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మొండి వైఖరిపై నిరసన

  మ‌ద్య‌నిషేధం హామీతో అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌భుత్వ‌మే మ‌ద్యం వ్యాపారం ఆరంభించ‌డం, ఈ ఏడాది ఏకంగా సుమారు 4,000 వేల కోట్ల రూపాయ‌లు మ‌ద్యంపై ఆదాయం రాబ‌డుతోందని టీడీపీ ఆరోపించింది. పిచ్చిమ‌ద్యం అత్య‌ధిక ధ‌ర‌ల‌కి అమ్ముతుండ‌డంతో నిరుపేద‌లు సారాకి అల‌వాటు ప‌డి ప్రాణాలు తీసుకుంటున్నారని.., వేల కుటుంబాల‌లో చీక‌ట్లు నింపుతోన్న క‌ల్తీసారా, జే బ్రాండ్ ప్ర‌మాద‌క‌ర మ‌ద్యం మ‌ర‌ణాల‌పై చ‌ర్చ జ‌ర‌గాల‌ని తాము అసెంబ్లీలో పట్టుబడితే.. రోజూ సస్పెన్షన్ వేటు వేసి.. ప్రభుత్వం తప్పించుకుంటోందని ఆరోపించారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Liquor shops, TDP, Vijayawada, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు