Home /News /andhra-pradesh /

AP POLITICS TELUGU DESAM PARTY CHIEF CHANDRABABU NAIDU WILL CONTEST FROM VISAKHAPATNAM WHAT IS THE FACT NGS VSP

Chandrababu Naidu: వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి చంద్రబాబు నాయుడు పోటీ..? కారణం ఇదేనా..?

విశాఖ నుంచి చంద్రబాబు పోటీ

విశాఖ నుంచి చంద్రబాబు పోటీ

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అంటూ.. టీడీపీలో ఓ వర్గం అభిప్రాయ పడుతోంది.. మరి దీంట్లో వాస్తవం ఏంటి..? అసలు చంద్రబాబు నాయుడు విశాఖ నుంచి పోటీ చేయాలి అనుకోవడానికి కారణాలు ఏంటి..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  P. Anand Mohan, News18, Visakhapatnam.

  Chandrababu Naidu: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naiduy) అడ్డా కుప్పం నియోజకవర్గం.. అక్కడ ప్రచారానికి వెళ్లకపోయినా.. చంద్రబాబు గెలుపు పక్కా.. ఏళ్ళ తరబడి కుప్పం ప్రజలతో చంద్రబాబు కు ఎంతో అనుబంధం ఉంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన తన నియోజవక వర్గం ప్రజలకు దగ్గరగా ఉండాలని నిర్ణయించుకున్నారు.  కుప్పం-పలమనేరు జాతీయ రహదారిలోని రోడ్డు ప్రక్కనే భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిలో ఇంటిని నిర్మిస్తున్నారు కూడా.. ఇలా కుప్పం (Kuppam) నుంచి మరోసారి గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.  అలాంటి చంద్రబాబు విశాఖపట్నం (Visakhapatnam) నుంచి పోటీ చేయడం ఏంటి.. ఆయన కుప్పాన్ని ఎందుకు వదిలేస్తారని ప్రశ్నిస్తున్నారు.  కానీ టీడీపీలో ఓ వర్గం మాత్రం అధినేత  ఈ సారి విశాఖ నుంచి పోటీ చేయడం పక్కా అంటున్నారు.  అందుకు ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయంటున్నారు..

  గత ఎన్నికల్లో రాష్ట వ్యాప్తంగా వైసీపీ (YCP) గాలి వీచింది.. టీడీపీ (TDP) ఘోరంగా ఓడింది. అయినా విశాఖ నగరంలో మాత్రం టీడీపీ సత్తా చాటింది. సిటీలో ఉన్న నాలుగు సీట్లను సొంతం చేసుకుంది. కాబట్టి అలాంటి చోట.. వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నది టీడీపీ అంచనా.. మరోవైపు విశాఖ కు చంద్రబాబు వ్యతిరేకమని.. అందుకే రాజధానిని వ్యతిరేకిస్తున్నారని వైసీపీ జోరుగా ప్రచారం చేస్తోంది.  వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకోవాలంటే నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగడం బెటరని పొలిటికల్ వ్యూహకర్తులు సూచించారనే ప్రచారం ఉంది. దానికి తోడు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలి అంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్లు తప్పని సరిగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలా జరగాలి అంటే.. చంద్రబాబు విశాఖ లేదా శ్రీకాకుళం (Srikakulam) లాంటి నియోజకవర్గాల్లో పోటీ చేస్తే.. ఆ ప్రభావం మొత్తం ఉత్తరాంధ్రపై ఉంటుందని.. నేతలు, కేడర్ కూడా గట్టిగా శ్రమించే అవకాశాలు ఉంటాయని వారు లెక్కలు వేస్తున్నారు.

  ఇదీ చదవండి : అమ్మవారి గుడిలో ఎవరూ లేకున్నా గజ్జల చప్పుళ్లు, గాజుల మోతలు.. వింత చూసేందుకు ఎగబడ్డ జనం

  పవన్ కళ్యాణ్ తిరుపతి, భీమ వరం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అలాంటప్పుడు పొత్తు ఉన్నా.. చంద్రబాబు విశాఖ నుంచి పోటీ చేయాడానికి ఎలాంటి అడ్డంకి ఉండదని చెబుతున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కుప్పంతో పాటు.. విశాఖలో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే.. పార్టీకి మంచిదని.. ఆ పార్టీ వ్యూహకర్తలు సూచించినట్టు టాక్.. దానికి తోడు.. ప్రస్తుతం అధికార వైసీని ఒత్తిడిలోకి నెట్టినట్టు కూడా అవుతుందని చెబుతున్నారు.

  ఇదీ చదవండి: బ్రహోత్సవాల కోసం సర్వం సిద్ధం.. ఉప్పుతో గోవిందుడి బొమ్మ గీసిన భక్తుడు.. చూస్తే వావ్ అనాల్సిందే

  ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ అధినేత.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ప్రధాన ఫోకస్ కుప్పం పైనే ఉంది. చంద్రబాబును ఎలాగైనా ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల కుప్పం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని జగనే స్వయంగా చెప్పారు. చంద్రబాబును ఓడిస్తే.. భరత్ కు మంత్రి పదవి ఇస్తానంటూ హామీ కూడా ఇచ్చారు. ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సైతం అక్కడే ఉండి.. ఎప్పటికప్పుడు కుప్పంపై కొత్త కొత్త వ్యూహాలు రచిస్తున్నారు..

  ఇదీ చదవండి : పవన్ తో పొత్తు.. చంద్రబాబుతో టీ.. జగన్‌తో లంచ్.. ఏపీపై మోదీ గేమ్ ప్లాన్ ఇదేనా?

  ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు వేరే నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారంటే.. వారి వ్యూహాన్ని కొంత పక్కకు మార్చాల్సి ఉంటుందని.. అప్పుడు కుప్పంపై ఫోకస్ తగ్గుతుంది అంటున్నారు.. అయితే ఇక్కడ మరో విమర్శ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.. కుప్పంలో ఓడిపోతారని తెలిసే.. చంద్రబాబు నాయుడు.. మరో నియోజకవర్గానికి పారిపోతున్నారని వైసీపీ ప్రచారం చేసే అవకాశం ఉంది. అది కచ్చితంగా కుప్పం ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని.. టీడీపీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం.. మరీ ఈ లెక్కలు అన్నీ చూసుకుని చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, TDP, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు