Home /News /andhra-pradesh /

AP POLITICS TELUGU DESAM PARTY CHIEF CHANDRABABU NAIDU FOCUS ON EX MLAS AND OLD TDP LEADERS IN UTTARANDHRA VZM

Teludu Desam: 2024 కోసం టీడీపీ భారీ స్కెచ్.. మాజీ ఎమ్మెల్యేలే టార్గెట్.. పట్టు చిక్కినట్టేనా..?

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

Teludu Desam: ఆ మూడు జిల్లాల్లో తెలుగుదేశానికి ఒకప్పుడు మంచి పట్టు ఉండేది.. కానీ ఆ మూడు జిల్లాల్లో ఒక జిల్లాలో పరవు కాపాడుకున్నా.. ఓ జిల్లాల్లో ఘోర ఓటమి ఎదురైంది. మరో జిల్లా అయితే వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో మళ్లీ ఆ మూడు జిల్లాల్లో పూర్వవైభవం కోసం టీడీపీ ప్రయత్నాలు మొదలెట్టింది. పట్టు కోసం భారీ స్కెచ్ సిద్ధం చేస్తోంది.

ఇంకా చదవండి ...
  Teludu Desam: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) ఎన్నికల మూడ్ లో ఉంది. కచ్చితంగా ముందస్తు ఎన్నికలు తప్పవని అంచనా వేస్తోంది. అందుకు ఇప్పటి నుంచే ఆ దిశగా పావులు కదుపుతోంది. ఒకప్పుడు మంచి పట్టు ఉన్న ఉత్తరాంధ్రలో.. 2019 ఎన్నికలు షాక్ ఇచ్చాయి. అయితే అర్బన్ లో మాత్రం కాస్త పట్టు ఉంది. ముఖ్యంగా విశాఖ నగరంలో పూర్తి పట్టున్న టీడీపీ.. ఇకపై విశాఖ గ్రామీణం తో పాటు ఉత్తరాంధ్ర ను ప్రభావితం చేయగల మాజీ ఎమ్మెల్యేలపై దృష్టి సారించింది. దాదాపు గా అధికార పార్టీలో అసంతృప్తి గా ఉన్న నేతలపై ఫోకస్ చేసింది. వారిని తిరిగి తెచ్చుకోవడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయడమే కాకుండా నేతలంతా టీడీపీ (TDP) వైపు చూస్తున్నారన్న ఒక మెసేజ్ ని ప్రజల్లోకి పంపవచ్చనే ఆలోచనలో ఉంది టీడీపీ. గత ఎన్నికల్లో శ్రీకాకుళం (Srikakulam) లో అచ్చెన్నాయుడు (Atchannaidu), ఇచ్చాపురం నుంచి బి అశోక్, విశాఖపట్నం (Visakhapatnam)లో నాలుగు స్థానాలు తప్ప.. ఎక్కడా విజయం దక్కలేదు. విశాఖ రూరల్‌ స్థానంతో పాటు… విజయనగరాన్ని స్వీప్ చేసిన.. జగన్ సారథ్యంలోని వైసీపీ… శ్రీకాకుళం లో రెండు తప్ప అన్ని స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత జరిగిన పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో 90 శాతం స్థానాలు వైసీపీ దక్కించుకున్నప్పటికీ… చాలా చోట్ల టీడీపీ బలమైన పోటీనే ఇచ్చింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్‌ ఎన్నికల్లో… 98 డివిజన్లకు గాను, 33 స్థానాలు గెలిచి బలం చూపించుకుంది. అయితే, మునుపటి పట్టు సాధించడమెలా? అన్నదానిపై టీడీపీ అధిష్టానం పూర్తిగా దృష్టి పెట్టింది. ఇటీవల పార్టీ చేపట్టిన పోరాటాలకు మంచి స్పందన రావడం, బాదుడే బాదుడూ పేరుతో ఆ మధ్య చంద్రబాబు రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన కూడా హిట్ కావడంతో… కేడర్ లోనూ జోష్ పెరిగింది.

  ప్రస్తుతం ఉత్తరాంధ్రలో మళ్లీ ఉడుం పట్టు సాధించేందుకు… పెద్ద స్కెచ్చే వేసింది టీడీపీ. రకరకాల కారణాలతో పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యేలపై ముందు ఫోకస్ చేసింది. మాజీలైనా జనంలో తిరుగుతున్నవారినీ.. అంగ, అర్థ బలం కలిగి తిరిగి పోటీ చేయాలన్న లక్ష్యంతో ఉన్నవారినీ.. బలాబలగాలేవీ లేకపోయినా ప్రజల్లో మంచి పేరు, సాను భూతి కలిగిన నేతలను టార్గెట్ చేస్తోంది టీడీపీ అధిష్టానం. అలాంటి వారితో చర్చలు జరిపి పార్టీలోకి తీసుకొచ్చేలా చూడాలని.. స్థానిక నాయకత్వానికి సూచించింది టీడీపీ హైకమాండ్‌. ఇప్పుడు చేరినా భవిష్యత్తుల్లో పొత్తుల కారణంగా సీటు దక్కకపోయినా, రాజకీయంగా ఢోకా లేకుండా చసే అంశాలపైనా వారితో టీడీపీ నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం.  ముఖ్యంగా ఎన్నికల వ్యయాన్ని భరించగల మాజీ ఎమ్మెల్యేలకు బంపర్‌ ఆఫర్‌ ఇస్తోంది టీడీపీ. వారి సామాజిక వర్గ బలాన్నిపట్టి వారు కోరుకునే సీట్లు ఇవ్వడానికి కూడా సిద్దంగా ఉన్నట్టు సంకేతాలిస్తోంది. దీంతో మాజీ లు కూడా ఈ ఆఫరేదో బాగుందన్నట్టు స్పందిస్తున్నట్టు సమాచారం. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత, మరోవైపు టీడీపీ ఆఫర్ ఈ రెండూ బేరీజు వేసుకుంటూ.. కొన్నాళ్లాగి తమ నిర్ణయాన్ని చెబుతామంటున్నారట.

  ఇదీ చదవండి : సీఎం సొంత జిల్లాల్లో టీడీపీలో చేరికలకు ఎందుకంత డిమాండ్.. ఆ నియోజకవర్గంపై ముగ్గురు కర్ఛీఫ్..

  టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన పంచకర్ల రమేష్, అర్బన్‌ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన రెహ్మాన్, నగర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన తయినాల విజయకుమార్ .. వంటి నేతలు ఈ లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ మాజీలు ఇప్పటికిప్పుడు పాజిటివ్ రెస్పాన్స్‌ ఇవ్వకపోవడంతో… అక్కడ కాకపోతే ఇక్కడ అన్నట్టుగా ఆశ చూపుతోంది అధికార వైసీపీ. అయితే, ప్రస్తుత ప్రభుత్వంలో అలాంటి నేతలకు ఎలాంటి పదవులూ లేకపోవడంతోనే టీడీపీ వైపు చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP, Vizag

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు