Home /News /andhra-pradesh /

AP POLITICS TELUGU DESAM PARTY CHIEF CHANDRABABU NAIDU FOCUS ON DISTRICTS FOR NEXT ELECTIONS PLAN NGS

Chandrababu: సొంత జిల్లాపై చంద్రబాబు యాక్షన్ ప్లాన్.. మెయిన్ టార్గెట్ అదే

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

Chandrababu Naidu: మహానాడు తరువాత చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు.. మహనాడు సక్సెస్ తో ఫుల్ జోష్ ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదట తన సొంత జిల్లా చిత్తూరు పై ఫోకస్ చేశారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్ఠానాలు సాధించడమే లక్షంగా.. వ్యూహాలు రచిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    Chandrababu Naidu: తెలుదేశం పార్టీ (Telugu Desam Party)కి  ఇటీవల జరిగిన మహానాడు (Mahanadu) సక్సెస్ చాలా ప్లస్ అవుతోంది. మొన్నటి వరకు వైసీపీ (YSRCP) వైపు, బీజేపీ వైపు చూసిన చాలామంది నేతలు.. మళ్లీ టీడీపీవైపు చూపు మళ్లేలా చేస్తోంది. చేరికలు సంగతి ఎలా ఉన్నా.. మహానాడు సక్సెస్ అధినేత చంద్రబాబు సహా నాయకుల్లో ఉత్సాహాన్ని పెంచింది. ఇకపై నుంచి ఇదే జోరును కంటిన్యూ చేసే దిశగా అడుగులు వేయిస్తోంది. అందుకే ఎన్నికలు ఎప్పుడు జరిగినా వార్ వన్ సైడేనని టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పదే పదే చెబుతున్నారు. జగన్ పాలనతో వైసీపీ పనైపోయిందన్న ఆయన.. ఇంతటి ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదని చెప్పారు. ఇంతటి ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. మహానాడు సక్సెస్, సభ్యత్వ నమోదు, జిల్లాల టూర్లు, పార్టీ కమిటీల నియామకం వంటి అంశాలపై ఇక పూర్తి ఫోకస్ చేస్తున్నారు. అంతేకాదు అన్ని జిల్లాల్లో పార్టీ పటిష్టతపై ప్రత్యేక ప్లాన్స్ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి నుంచే జిల్లాల్లో నేతలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని.. అలా అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇక రంగంలోకి దూక వచ్చని చంద్రబాబు భావిస్తున్నారు.

    ముఖ్యంగా మహానాడు తర్వాత పార్టీ పటిష్టత పై సీరియస్ గా వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో గ్రూప్ రాజకీయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నజర్ అవుతున్నారు. ఆ వర్గ పోరుకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు అధినేత చంద్రబాబు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సొంత జిల్లా చిత్తూరు నుంచే చంద్రబాబు సమీక్షలు ప్రారంభించారు. ఈ మేరకు చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్త బీద రవిచంద్ర యాదవ్‌తో చర్చించారు.

    ఇదీ చదవండి : నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ముందస్తు పై క్లారిటీ..? షెడ్యూల్ ఇదే?

    చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ పరిధిలోని నేతల పని తీరుపై చంద్రబాబుకు బీదా రవిచంద్ర ఇప్పటికే నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా నెలలో 15 రోజుల పాటు నియోజకవర్గాల్లో పర్యటించాలని బీదాకు అధినేత చంద్రబాబు పలు సూచనలు చేశారు. క్షేత్ర స్థాయి పర్యటన తర్వాత నేతల పని తీరుపై డిటైల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని కోరారు.

    ఇదీ చదవండి : మ్యూజియంలలో ఈ మ్యూజియం వేరయా..? అక్కడికి వెళ్తే సరికొత్త అనుభూతి

    పార్టీని నష్ట పరిచే నేతల జాబితా సిద్ధం చేయాలని రవిచంద్రకు స్పష్టం చేశారు. నెల రోజుల్లోగా నేతల మధ్య విబేధాలు, గ్రూపు రాజకీయాలు లేకుండా చూడాలని చంద్రబాబు సూచించారు. నెల రోజుల తర్వాత కూడా మార్పు రాని నేతల విషయంలో కఠిన నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. త్వరలో మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాల సమన్యకర్తలతో ఆయన వరుస భేటీలు నిర్వహించనున్నారు. కాగా వచ్చే ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో భాగంగా ఇప్పటి నుంచే చంద్రబాబు కసరత్తు ప్రారంభించారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Chitoor, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు