హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: ఏపీలోనూ ఓ ఏక్ నాథ్ షిండే.. చంద్రబాబుకు గెలిచే శక్తి లేదు.. టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

AP Politics: ఏపీలోనూ ఓ ఏక్ నాథ్ షిండే.. చంద్రబాబుకు గెలిచే శక్తి లేదు.. టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు,లోకేశ్ (ఫైల్ ఫోటో)

చంద్రబాబు,లోకేశ్ (ఫైల్ ఫోటో)

AP Politics: ఆంధ్రప్రదేశ్ లో ఏక్ నాథ్ షిండే ఉన్నారా..? వచ్చే ఎన్నికల్లో 60 సీట్లు కన్నా ఎక్కువ నెగ్గలేదా..? మహారాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితే ఉంటుందా..? బీజేపీ పెద్దలు ఆపరేషన్ మొదలెట్టారా..? టీడీపీ ఎంపీ కేశినాని వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం అవుతున్నాయి.

ఇంకా చదవండి ...

AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా కీలక నేతలు సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేస్తుండడంతో పార్టీ పెద్దలకు షాక్ లు తప్పడం లేదు.. తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని నాని (TDP Kesineni Nani)  వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఆయన ఏమన్నారంటే..? మహారాష్ట్ర  (Maharastra) లో ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) లా.. టీడీపీకి సీఎం రమేష్ (CM Ramesh) ఉన్నారని అభిప్రాయపడ్డారు. అక్కడితోనే ఆయన ఆగలేదు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ (TDP) కి పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. ఒకవేళ మహా అయితే.. వచ్చే ఎన్నికల్లో 50-60 సీట్లు టీడీపీకి వచ్చే అవకాశం ఉందని.. అయినా.. అప్పుడు ఏక్‌నాథ్ షిండే లాగా సీఎం రమేష్‌ ఆపరేషన్ చేపడతారని.. టీడీపీలో ఎమ్మెల్యే లను బీజేపీ (BJP) లోకి లాక్కుంటారని జోస్యం చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యమే అని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే.. గెలిచే శక్తి, యుక్తి.. పార్టీ అధినేత చంద్రబాబుకు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే చంద్రబాబు ఎవరినీ నమ్మడం లేదన్నారు. కవలం బ్రోకర్లు, లోఫర్ల మాటలే ఆయన వింటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి చూస్తే తనకు రాజకీయాల్లో కొనసాగాలనే ఇంట్రస్ట్ పోయింది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ ది రికార్డుగా మాట్లాడిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. మరోవైపు ఆయన తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) తో భేటీ కావడం కూడా ఆసక్తికరంగా మారింది.

ఎంపీ కేశినేని వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఎందుకంటే బీజేపీ జాతీయ నేతలు.. కొందరు అంతర్గత సమావేశాల్లో.. 2024 ఎన్నికల తరువాత బీజేపీలో విలీనం అవుతుందని చెబుతున్నట్టు ప్రచారం ఉంది. ఇటీవల పవన్ కళ్యాణ్  కు ఇచ్చిన రూట్ మ్యాప్ లో సైతం.. 2024 ఎన్నికల గురించి ఆలోచించ వద్దని.. టీడీపీ, వైసీపీ ఎవరు గెలిచినా పరవాలేదని.. 2029 ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని చెప్పినట్టు టాక్. 2024 ఎన్నికల తరువాత ఎలాగూ టీడీపీ బీజేపీలో విలీనం అవుతుందని.. అందుకే చంద్రబాబుతో కలిసి ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని బీజేపీ పెద్దలు చెప్పినట్టు ఓ ప్రచారం ఉంది. తాజాగా కేశినేని వ్యాఖ్యలు చూస్తే.. నిజమే అనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి : బాబోయ్ బాహుబలికి బాబులా ఉంది..? ఇలాంటిది ఎప్పుడూ చూసి ఉండరు..?

టీడీపీ నేతలు మాత్రం కేశినేని వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. సోదరుడితో ఉన్న విబేధాల కారణంగానే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారి.. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, CM Ramesh, Kesineni Nani

ఉత్తమ కథలు