Kesineni Nani: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party)లో ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) రూట్ ఏంటి..? సాధారణంగా ఏ పార్టీ వ్యక్తులు అయినా.. ప్రత్యర్థి పార్టీలపైనా.. ప్రత్యర్థులు అనుకున్న నేతలపై సెటైర్లు వేస్తారు.. విమర్శలు చేస్తారు..? కానీ ఎంపీ నాని అందుకు భిన్నం.. సొంత పార్టీపైనే ఆయన సెటైర్లు వేస్తున్నారు.. తనతో కలిసి పని చేసే నేతలనే విమర్శిస్తుంటారు.. అధిష్టానాన్ని సైతం ప్రశ్నిస్తుంటారు.. అయితే గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నట్టు అనిపించిన ఆయన.. మళ్లీ ఫాంలోకి వచ్చేశారు. దీంతో ఎంపీ కేశినేని నాని వ్యవహారం పార్టీ అధినాయకత్వానికి మింగుడు పడటం లేదు. టీడీపీ (TDP) సీనియర్ ఎంపీగా ఉన్న కేశినేని నాని తాజాగా సోషల్ మీడియా (Socila Media) వేదికగా చేసిన పోస్టు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పలు మార్లు ఎంపీ కేశినేని నానితో మంతనాలు జరిపారు. అయినా ఆయన తన రూటు మార్చుకోలేదు. ముఖ్యంగా కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ నగరంలోని కొందరు టీడీపీ నేతల తీరు పట్ల చాలా రోజులగా ఎంపీ కేశినేని ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఇలా అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ సోషల్ మీడియాకు పని చెబుతున్నారు.
కేశినేని నాని తాజా పోస్టింగ్ కలకలం రేపుతోంది. తిరువూరు సమీక్షకు సంబంధించి నెట్టెం రఘురాం ఈ కామెంట్స్ చేసారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే వారి పైన చర్యలు ఉంటాయని రఘురాం హెచ్చరించారు. దీనికి సంబంధించి వార్త ఒక దిన పత్రికలో ప్రచురితం అయింది. దీనిని జత చేస్తూ కేశినేని నాని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఛ నిజంగా..క్రమశిక్షణ ఉల్లంఘించిన వారి లిస్టు పంపిస్తాం.. రుజువులతో సహా చర్యలు తీసుకుంటారా మరి ..అంటూ కేశినేని ప్రశ్నించారు.
ఈ పోస్టింగ్ ఇప్పుడు పొలిటికల్ సెక్షన్స్ లో వైరల్ అవుతోంది. ఇలా సొంత పార్టీ వ్యవహారాల పైన సోషల్ మీడియాలో పోస్టింగ్ లు చేయటం.. వ్యాఖ్యలు చేయటంతో అసలు కేశినేని నాని ఎన్నికల నాటికి ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కర చర్చకు దారి తీస్తోంది. ఇప్పుడే కాదు.. కొద్ది రోజుల క్రితం.. పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వచ్చిన సమయంలోనూ స్వాగతం వేళ బొకే ఇచ్చే సమయంలోనూ అసహనం వ్యక్తి చేయటం పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఇదీ చదవండి : అమరావతి ఉద్యమంలో ఎన్టీఆర్.. మండిపడుతున్న తారక్ అభిమానులు.. మ్యాటర్ ఏంటంటే?
ఇక, కృష్ణా జిల్లా సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమా.. కొందరు నేతలు తొడ గొట్టి కొడాలి నానిని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామంటూ సవాల్ చేసారు. దీని పైనా కేశినేని నాని స్పందించారు. తొడలు కొట్టి..మీడియా లో మాట్లాడితే హీరోలు కాలేరని.. ప్రజల మధ్య రాజకీయం చేయాలని వ్యాఖ్యానించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటన సమయంలోనూ కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా తన సొంత మనుషులనే సొంత పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారనేది కేశినేని ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Kesineni Nani, TDP