Home /News /andhra-pradesh /

AP POLITICS TELUGU DESAM CHIEF PRESIDENT NARA CHANDRABABU NAIDU CALLED PROTEST AGAINST CURRECT CHARGES HIKE NGS

Current Shock: మూడేళ్లలో ఏడు సార్లు బాదుడా.. విద్యుత్ ఛార్జీలపై టీడీపీ దశల వారీ పోరాటం

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

Current Shock: ఆంధ్రప్రదేశ్ లో సామన్యులపైమరో భారం పడింది. విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రభుత్వం మరో బాదుడు బాదింది. కేవలం మూడేళ్లలోనే ఏడు సార్లు బాదుడు ఏంటని విపక్షాలు నిలదీస్తున్నారు. దీనిపై దశల వారీ పోరాటానికి సిద్ధమైంది టీడీపీ.

    Current Shock in Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సామాన్యుపై మరో బాదుడు పడింది. ఇప్పటికే అన్ని ధరలు పెరగడంతో బతుకు భారంగా మారింది. పెరిగిన రేట్లతో ఎలా బతకాలి అని సామన్యులు అవస్థలు పడుతున్నారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం (AP Government) మరో షాక్ ఇచ్చింది.  విద్యుత్ ఛార్జీలను (Electricity Charges Hike) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా పెరిగిన రేట్లతో ఇంట్లో స్విచ్ ఆన్ చేయకుండానే..  కరెంట్ షాక్ తగిలినట్టు అయ్యింది.  30 యూనిట్ల వరకు 45 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.   31 నుంచి 75 యూనిట్ల వరకు.. 91 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే 76 యూనిట్ల నుంచి 125 వరకు వాడితే.. 1 రూపాయి 40 పైసలు పెరగనుంది. అలాగే 126 నుంచి 225 యూనిట్ల వరకు వాడితే.. 1.57 పైసలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది.  పెరిగిన విద్యుత్ టారిఫ్‌ను బుధవారం ఏపీఈఆర్సీ (APERC) చైర్మన్ విడుదల చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీల ఉత్తర్వులను ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకూర్ రామ్ సింగ్, రాజగోపాల్ రెడ్డితో కలిసి ప్రకటించారు.

    ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్‌ చార్జీలను పెంచుతూ ఏపీ ఈఆర్సీ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పార్టీ నాయకులు, శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ప్రభుత్వంపై దశలవారీ పోరాటానికి టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

    ఇదీ చదవండి : కొత్త జిల్లా ఫైనల్ డ్రాఫ్ట్ కు కేబినెట్ ఆమోదం.. చంద్రబాబుకు జగన్ గిఫ్ట్.. మరి బాలయ్య మాటేంటి?

    జగన్ రెడ్డి అధికారం చేపట్టిన మూడేళ్లల్లో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు.. ఏడు దశల్లో ప్రజలపై రూ.12వేల కోట్ల భారం మోపారని విమర్శించారు.. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ చేపట్టే పోరాటానికి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు చంద్రబాబు.

    ఇదీ చదవండి : దగ్గుబాటి రూటు మార్చుకున్నారా..? ఆయన మనసు మార్చుకోడానికి కారణం ఏంటి..?

    తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించి ఉండేవారిమని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సీఎం వైఎస్‌ జగన్‌ అసమర్థత, అవినీతి వల్లే విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైందని ఆరోపించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన 25 వేల కోట్లకు పైగా అప్పు ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వ్యవసాయ మోటార్ల మీటర్లు పెడుతూ రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు.. మరోవైపు విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ఫైర్‌ అయిన వామపక్ష పార్టీలు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి… పెంచిన విద్యుత్‌ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు వామపక్షాల నేతలు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu

    తదుపరి వార్తలు