Home /News /andhra-pradesh /

AP POLITICS TELUGU DESAM CHIEF NARA CHANDRABABU NAIDU ANNOUNCE DONE CANDIDATE FOR NEXT ELECTIONS NGS GNT

Chandrababu: చంద్రబాబు సంచలన ప్రకటన.. ఆ సీనియర్ నేతకు ఊహించని షాక్.. టీడీపీ తొలి అభ్యర్థి ఎవరంటే..?

చంద్రబాబు సంచలన ప్రకటన

చంద్రబాబు సంచలన ప్రకటన

Chandrababu Naidu: తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు.. పార్టీలో చాలా సీనియర్.. అది కూడా భారీగా రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న నేతకు.. ఊహించని షాక్ ఇచ్చారు.. ఇన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. అప్పుడే టీడీపీ తొలి అభ్యర్థిని ప్రకటించారు.

ఇంకా చదవండి ...
  Chandrababu Naidu: మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తన సహజన ధోరణికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీడీపీ నాయకులు, కేడర్ ను ఆశ్చర్యపరుస్తున్నారు..? అయితే ఇదే విషయం గత కొన్ని రోజుల నుంచి చంద్రబాబు పదే పదే చెబుతూ ఉన్నారు.. పని చేసిన వారికే పదవులు ఇస్తమాని.. సీనియర్లు.. గత రికార్డులు ఏవీ పని చేయవని.. జనంలో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని చెబుతున్నారు. అయితే ఆయన ఎప్పుడూ చెప్పే రొటీన్ డైలాగే అని.. అంతా లైట్ తీసుకున్నారు.. అలా అనుకున్నవారందరికీ ఊహించని షాక్ ఇచ్చారు.. తెలుగు దేశం (Telugu Desam) తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే తొలి అభ్యర్థిని ప్రకటించారు.. అదికూడా బహిరంగంగానే ప్రకటించి.. అందరూ అతడికి సహకరించాలని కార్యకర్తలకు కోరారు. అదే నియోజకవర్గంలో మరో వర్గం బలంగా ఉంది.. తమ నేతకే సీటు ఇవ్వాలని.. డిమాండ్లు.. ఒత్తిళ్లు ఉన్నా.. అన్ని పక్కన పెట్టి.. అక్కడి అభ్యర్థిని ప్రకటిస్తూ చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

  షెడ్యూల్ ప్రకారం అయితే 2024లో ఎన్నికలు జరగాలి.. కానీ ప్రస్తుతం అందుతున్న లీక్స్.. అధికార పార్టీ తీరు బట్టి.. ముందస్తుగానే ఎన్నికలు వస్తాయని చందబ్రాబు పదే పదే చెబుతున్నారు. అలా అయినా ఎన్నికలకు ఏడాదికిపైగా సమయం ఉంది. మరోవైపు పొత్తులు ఉంటాయని.. అవి ఎవరితో ఉంటాయన్నది క్లారిటీ లేదు. జనసేన (Janasena)-టీడీపీ (TDP) కలిసి పోటీ చేస్తాయా..? లేక బీజేపీ (BJP) ఈ రెండు పార్టీలతో కలిసి దిగుతుందా అన్నది క్లారిటీ లేదు. ఒకవేళ పొత్తులు ఉంటే.. సీట్ల లెక్కలు మారుతాయి.. అయినా చంద్రబాబు మాత్రం.. తమ పార్టీ తరపున తొలి అభ్యర్థిని బహిరంగంగానే ప్రకటించారు.

  ఇదీ చదవండి : సీఎం జగన్ ఇలాకాలో ఏం జరుగుతోంది? చంద్రబాబు టూర్ గ్రాండ్ సక్సెస్ కు రీజనేంటి..?

  కర్నూలు పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు.. డోన్ నుంచి టిడిపి తరఫున ధర్మవరం సుబ్బా రెడ్డి(Dharmavaram Subba Reddy) పోటీ చేస్తారని ప్రకటించారు. ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు చేసిన ప్రకటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో(Kurnool Distrcit) రాజకీయ సంచలనంగా మారింది. ఎందుకంటే అక్కడ వైసీపీ అభ్యర్థి అయిన.. మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి చాలా బలమైన అభ్యర్థి.. దానికి తోడు.. డోన్ నుంచి మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబీకులు పోటీ చేయాలని ఒత్తిళ్లు.. డిమాండ్లు ఉన్నాయి. అయినా అవేవి పట్టించుకోకుండా.. పార్టీ కోసం కష్టపడుతున్నారు.. ప్రజల్లో ఉంటున్నారనే అభిప్రాయంతో.. జలదుర్గం ‘బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు.. ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించారు.

  ఇదీ చదవండి : మంత్రుల బస్సు యాత్ర టార్గెట్ ఏంటి? శ్రీకాకుళం టు అనంతపురం పొలిటికల్ రూట్ మ్యాప్ ఇదే

  వాస్తవంగా 1985 నుంచి డోన్ నుంచి కేఈ కృష్ణమూర్తి కుటుంబీకులే పోటీ చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా డోన్ లో చంద్రబాబు పర్యటన లో కేఈ కుటుంబీకులు ఎవరు కూడా కనిపించలేదు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అంతకంటే ఆశ్చర్యకరమైన విధంగా డోన్ టిడిపి అభ్యర్థిగా సుబ్బారెడ్డిని ప్రకటించడం సంచలనంగా మారింది.

  ఇదీ చదవండి : బెల్లం కొనాలి అంటే ఆధార్ కార్డు ఉండాలా? విక్రయాలు సాగేదెలా అంటున్నవ్యాపారులు? ఆధార్ కార్డ్ ఎందుకో తెలుసా?

  మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కు డోన్ టిడిపి టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేయడం బహిరంగంగా సుబ్బారెడ్డి ని విమర్శించడం, విమర్శించిన వారికి టీడీపీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు ఏకంగా..? సుబ్బారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. అంతేకాదు సుబ్బారెడ్డి నాయకత్వంలోనే అందరూ పనిచేయాలని బహిరంగ సభలోనే చంద్రబాబు చెప్పడం రాజకీయాలను ఓ కుదుప కుదిపేసింది. చంద్రబాబు చేసిన ప్రకటనపై మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కుటుంబీకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Kurnool, TDP

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు