Home /News /andhra-pradesh /

AP POLITICS TELUGU DESAM CHIEF CHANDRABABU NAIDU TAKE KEY DECISION ON NEXT ELECTIONS THEY GIVE 40 PERCENTS SEATS NGS

Chandrababu Key Decision: 40వ ఆవిర్భావ దినోత్సవం రోజు కీలక నిర్ణయం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారికి 40 శాతం సీట్లు..

లోకేష్, చంద్రబాబు (ఫైల్)

లోకేష్, చంద్రబాబు (ఫైల్)

Chandrababu Key Decisoin: టార్గెట్ 2024గా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం తిరిగి అధికారం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం రోజునే.. కీలక ప్రకటన చేశారు. వారికి 40 శాతం సీట్లు ఇస్తానని ప్రకటించారు.

ఇంకా చదవండి ...
  Chandrababu Key Decisoin: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు వచ్చే ఎన్నికల్లో గెలుపు చాలా ముఖ్యంగా.. పార్టీ నిలదొక్కుకోవాలన్నా.. పార్టీని కాపాడుకోవాలి అన్నా.. వచ్చే ఎన్నికల్లో గెలుపు తప్ననిసరైంది. వరుసగా రెండో సారి ఓడితే ఇక పార్టీ నేతలేనే కాదు.. కేడర్ ను కాపాడుకోవడం కూడా కష్టమవుతోంది. తెలంగాణ (Telangana)లో ఇప్పటికే పార్టీ తలుపు మూసుకున్నాయి. ఇక ఏపీలో వరుసగా రెండోసారి ఓడితే అదే పరిస్థితి వస్తుంది. మరో పార్టీ ప్రత్యామ్నాయంగా పుట్టుకుచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వచ్చే ఎన్నికలకు ఆయన సర్వ శక్తులూ వడ్డుతున్నారు. దీనిలో భాగంగా తెలుగుదేశం  పార్టీ (Telugu Desam Party) 40వ ఆవిర్భావ దినోత్సవాన ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌కట‌న చేశారు. హైద‌రాబాద్‌ (Hyderabad) లోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ వేదికగా జ‌రుగుతున్న వేడుక‌ల్లో మాట్లాడిన చంద్ర‌బాబు.. యువ జపం చేశారు. వచ్చే ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున 40 శాతం సీట్ల‌ను యువ‌త‌కే కేటాయించ‌నున్న‌ట్లుగా చంద్ర‌బాబు కీల‌క ప్ర‌కట‌న చేశారు.

  యువ‌త‌ను ప్రోత్స‌హించాల‌ని పార్టీ నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. పార్టీ కోసం యువ‌త ముందుకు వ‌చ్చి పోరాడాల‌ని ఆయన పిలుపునిచ్చారు. శ‌క్తి సామ‌ర్థ్యాలు ఉన్న వారు రాజ‌కీయాల్లోకి రావాల‌ని పిలుపిచ్చారు. స‌మాజహితం కోరే వారు రాజ‌కీయాల్లోకి రావాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను నొక్కి చెప్పారు. సంప‌ద‌ను సృష్టించ‌డంలో టీడీపీ ముందుంద‌ని చెప్పిన చంద్ర‌బాబు.. రాష్ట్ర పున‌ర్నిర్మాణంలో ప్ర‌జ‌లు భాగ‌స్వామ్యం కావాల‌ని పిలుపునిచ్చారు.

  ఇదీ చదవండి : బుల్లెట్ బండిపై నుంచే వైసీపీకి వార్నింగ్.. సినిమా చూపిస్తానన్న నారా లోకేష్

  ప్రస్తుతం 40 సంవత్సరాలకు సరిపడ సమర్థవంతమైన నాయకత్వం ఏర్పాటు చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యత మీ భుజస్కంధాలపై ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఉండాల్సిన అవసరం చాలా ఉందన్నారు. వ్యవస్థలపైన దాడి జరుగుతోంది. సీబీఐ, ఎన్నికల కమిషన్, పార్టీ ఆఫీస్, ఇంటిపైనా దాడి చేశారని గుర్తు చేశారు. వైసీపీ తాటాకుల చప్పుళ్లకు ఎవరూ భయపడటం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం కాదు.. అంబేద్కర్ రాజ్యాంగం కావాలి అన్నారు. ఇక తెలంగాణలో సైతం సభ్యత్వ నమోదు చేస్తాం అని చంద్రబాబు అన్నారు.

  ఇదీ చదవండి : కొత్త కేబినెట్ ముహూర్తం ఇదే.. అదే రోజు విందు.. రాజీనామాలు..

  సభ్యత్వ నమోదు ద్వారా ఇన్సూరెన్స్ మాత్రమే కాదు హాస్పిటలిటీ, ఆర్థికంగా బలోపేతం చేస్తామని చంద్రబాబు అన్నారు. మెంబర్ షిప్ తో పాటు ఆన్ లైన్ డొనేషన్లు కూడా పెట్టామన్నారు. 20వేల మంది నుంచి 48 లక్షల డొనేషన్ వచ్చిందన్నారు. ఐటీ ఉద్యోగులు ఇచ్చే డొనేషన్ తో పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామన్నారు చంద్రబాబు. ఓ శుభ ముహూర్తాన పార్టీ పెట్టారని గుర్తు చేశారు. ఎన్నో కష్టాలు వచ్చినా నిలదొక్కుకున్నామని వెల్లడించారు. ఉనికి లేని జాతి కోసం ముందుకు వచ్చారు. ఆవేశంలో పుట్టిన పార్టీ టీడీపీ. క్యాలికులేషన్స్ తో పుట్టిన పార్టీ కాదు. తెలుగు వారి ఆత్మగౌరవం ప్రపంచ నలుమూలల చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు. దుర్మార్గుడు ఏపీలో మీటర్ పెట్టాలంటున్నాడు. మీటర్ పెడితే రైతు మెడకు ఉరి తాడే అవుతుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు