Chandrabau Security: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు భారీగా భద్రత పెంచారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కుప్పం (Kuppam) నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తన రెండో రోజు పర్యటనలో భాగంగా అక్కడ చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వం భద్రత పెంచారు. అయితే గతంలో 8 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు ఉండగా.. నేటి నుంచి అదనంగా మరో 20 మందిని నియమించారు. గతంలో డీఎస్పీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో భద్రత సిబ్బంది విధులు నిర్వహించేవారు. కానీ ఇకపై డీఐజీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో పనిచేస్తారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం.. కుప్పంలో టీడీపీ (TDP) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ (Anna Canteen) ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.. చంద్రబాబును సైతం అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొందరు టీడీపీ నేతలపై దాడి చేశారు.
జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబుకు 12+12 కమాండోలతో భధ్రత పెంచింది కేంద్రం ప్రభుత్వం.. ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు తక్షణం భధ్రత పెంచుతూ NSG DG ఉత్తర్వులు చేయగా, నిన్ననే అమరావతిలోని చంద్రబాబు ఇంటిని, టిడిపి కేంద్ర కార్యాలయాన్ని ఎన్.ఎస్.జీ డిజీ స్వయంగా పరిశీలించారు.. అంతే కాకుండా టీడీపీ కార్యాలయంలోని నాయకులతో మాట్లాడి స్ధానిక పోలీసు అధికారుల భద్రత ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు.
చంద్రబాబు నాయుడు సైతం తన భద్రతపై పలు సార్లు ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి. వైసీపీ నేతలు తనపై దాడికి దిగే అవకాశాలు ఉన్నాయని పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇక గురువారం కుప్పంలో జరిగిన ఘటన తరువాత.. టీడీపీ నేతలు చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు.
ఇదీ చదవండి : పన్నుకట్టకపోతే ఇంత దారుణమా..? ఏం చేశారో వీడియో చూడండి
మరోవైపు తీవ్ర ఉద్రిక్తతల మధ్య చంద్రబాబు నాయుడు మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. నిన్న, మొన్న జరిగిన ఘర్షణల నేపథ్యంలో.. పోలీసులు ఇవాళ మరింత అలర్ట్ అయ్యారు. పోలీసులు ఎంత అలర్ట్ గా ఉన్నా.. గత రెండు రోజుల పరిస్థితులు చూస్తే.. మరోసారి ఉద్రిక్తతలు తప్పవనే వాదన వినిపిస్తోంది. గురువారం కుప్పం ప్రధాన సెంటర్లో ఎన్టీఆర్, వైఎస్ఆర్ విగ్రహాలు ఉన్న ప్రాంతం రణరంగంగా మారింది. తమ పార్టీ ఫ్లెక్సీల చించివేతకు నిరసనగా వైసీపీ ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్‌తోపాటు నేతలు వైఎస్ఆర్ విగ్రహం దగ్గరకు వచ్చారు. చంద్రబాబు కూడా అదే సమయానికి రావాల్సి ఉండటంతో పోలీసులు వైసీపీ నేతల్ని అడ్డుకున్నారు. దాంతో రోడ్డుపైనే బైటాయించారు ఎంపీ, ఎమ్మెల్సీ. ఈలోపు వైసీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహం పక్కనే ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ఫ్లెక్సీలను చించేశారు. ఇది మరింత ఉద్రిక్తతకు దారితీసింది.
ఇదీ చదవండి: కోడలితో వివేహాతర సంబంధం.. చివరికి అత్తను ఏం చేశాడంటే..?
ఓ వైపు అలా ఉద్రిక్తత కొనసాగుతున్న సమయంలోనే.. చంద్రబాబు నాయుడు ర్యాలీగా అటు వైపు వచ్చారు. ఆయనతోపాటు వచ్చిన కార్యకర్తలు వైసీపీ ఫ్లెక్సీలను, జెండాలను పీకేశారు. ఇది మరింత టెన్షన్ క్రియేట్ చేసింది. మరోవైపు వైసీపీ తీరును నిరసిస్తూ కొద్దిసేపు రోడ్డుపైనే కూర్చున్నారు చంద్రబాబు. ఆ తర్వాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి మూడో రోజు పరిస్థితి ఎలా ఉంటుందో అనే భయం అందరిలోనూ నెలకొంది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Kuppam, TDP