Home /News /andhra-pradesh /

AP POLITICS TELUGU DESAM CHIEF CHANDRABABU NAIDU READY TO ALL DISTRICTS TOUR START NEXT WEEK NGS

Chandrababu Tour: వస్తున్నా మీకోసం.. ఎన్నికలకు సై అంటూ ఇక జనంలోనే చంద్రబాబు.. రూట్ మ్యాప్ ఇదే..

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

Chandrababu Tour: ఎన్నికల సమర శంఖం పూరించేందుకు సై అంటున్నారు చంద్రబాబు నాయుడు.. ఇకపై జనంలోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.. మహానాడుతో సక్సెస్ తరువాత కేడర్ లో జోష్ కనిపిస్తోంది. ఆ జోష్ ను రెట్టింపు చేస్తూ.. అందర్నీ ఎన్నికలకు సిద్ధం చేసేలా భారీ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు.. ప్రధాన అజెండా ఎంటంటే..?

ఇంకా చదవండి ...
  Chandrababu Tour: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అన్ని పార్టీలు ఇప్పటికే జనం బాట పట్టాయి. అధికార పార్టీ విషయానికి వస్తే ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా గడప గడపకు మన ప్రభుత్వం (Gadapa Gadapaku Government) అంటూ ప్రజల్లోనే ఉంటున్నారు. మరోవైపు సీఎం జగన్ సైతం నేతలుక టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు. ఎన్నికలకు రెండేళ్ల ముందే సీఎం జగన్ (AP CM YS Jagan) వైసీపీ (YSRCP) నేతలకు టార్గెట్లు పెట్టారు. అదికూడా భారీగానే 2024లో 175కు 175 సీట్లు గెలవాలని ఆయన స్పష్టం చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లి (Tadepalli) లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో వర్క్ షాప్ నిర్వహించారు. గడపగడపకూ అనేది నిరంతరాయంగా జరిగే కార్యక్రమమని.., దాదాపు 8 నెలలపాటు జరుగుతుందన్నారు.. మరోవైపు మంత్రుల సైతం ఇప్పటికే సామాజిక న్యాయ భేరి పేరుతో బస్సు యాత్ర చేపట్టారు (Bus Yatra).. అధికార పార్టీ ఇలా జనాల్లోనే ఉండడంతో.. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. అప్పుడు ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికల హీట్ స్టార్ట్ అయిపోయింది. మాటల యుద్ధం, పొత్తుల ఎత్తులు జోరుగా నడుస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)మరో అడుగు ముందుకేశారు. ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు.

  ఇప్పటికే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి జిల్లాలో మహానాడు నిర్వహణతో పాటు జిల్లాల పర్యటనల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై రోడ్ షోలు, బహిరంగ సభలకు సన్నాహాలు చేస్తున్నారు అధినేత చంద్రబాబు. కొత్త జిల్లాల వారిగా మొత్తం 26 జిల్లాల్లో ఏడాదన్నర పాటు విసృత్తంగా పర్యటించేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. తెలుగు దేశం కేడర్ లో జోష్ ను రెట్టింపు చేసేందుకు, అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లేందుకు అన్ని విధాలుగా చంద్రబాబు ప్రిపేర్ అవుతున్నారు.  వైసీపీని ఎదుర్కోవాలంటే ఎక్కువ కాలం ప్రజల్లో ఉండాలని పార్టీ నేతలు ఇచ్చిన సలహాలతో చంద్రబాబు జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఒక్కో టూర్ మూడు రోజుల చొప్పున నెలకు రెండు జిల్లాల్లో పర్యటించాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల మూడో వారం నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. మొదటి రోజు బహిరంగ సభ, రెండో రోజు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జులతో సమీక్షలు, క్యాడర్ తో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి.. అందర్నీ అప్రమత్తం చేస్తారు.

  ఇదీ చదవండి : ఘాజీ సినిమాలోని సబ్‌మెరైన్‌ను చూడాలని ఉందా..? ప్రత్యేకతలు ఇవే..

  ఇక మూడో రోజు వివిధ నియోజకవర్గాల్లో రోడ్ షోలలో పాల్గొంటూ.. అక్కడ నిర్వహించే బహిరంగ సభల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై మాట్లాడబోతున్నారు. కేవలం ఏడాదిలోనే మొత్తం 80 కి పైగా నియోజకవర్గాలను చుట్టేసి.. ఎక్కువమంది ప్రజలను నేరుగా కలిసేలా..? పర్యటన రూపొందించారు. అటు జిల్లాల పర్యటనలు, ఇటు పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వ్యవహారాలు సమాంతరంగా జరిగేలా షెడ్యూల్ తయారు చేశారు.

  ఇదీ చదవండి : సీఎం జగన్ కు బిగ్ షాక్.. నారా లోకేష్ ను కలిసిన వైసీపీ కీలక నేత

  టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర ముఖ్య నాయకులతో చర్చించిన తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు చంద్రబాబు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈ నెల 15న అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగే మినీ మహానాడులో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత 16న అనకాపల్లిలో నియోజకవర్గాల వారిగా సమీక్షల తరువాత 17వ తేదీన చీపురుపల్లిలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు