AP POLITICS TELUGU DESAM CHIEF CHANDRABABU NAIDU FIRES ON GOVERNMENT AND CM JAGAN IN ANANTAPUR DISTRICT NGS
Chandrababu Slams CM Jagan: పాలన అంటే విధ్వంసమేనా..? నిర్మాణాలు ఎక్కడ.. దాళితులపై దాడులు దారణం
సీఎం జగన్,చంద్రబాబు (ఫైల్)
Chandrababu Naidu slams CM Jagan: వైసీపీ(ysrcp ) ప్రభుత్వానికి (government ) విధ్వంసం సృష్టించడం తప్ప, నిర్మించడం తెలయదని ప్రతిపక్షనేత, తెలుగుదేశం పార్టీ అధినేత( tdp chief) చంద్రబాబు (chandrababu ) ఆగ్రహం వ్యక్తంచేశారు. త్వరలోనే జగన్ విధ్వంసాలకు జనం తెర వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Chandrababu Naidu Slams CM Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఓ వైపు విపక్షాలు పొత్తులపై మాట్లాడుతున్నాయి. టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇద్దరూ.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే అభిప్రాయంతో ఉన్నారు. ఇక బీజేపీ (BJP) జనసేనతో కలిసి వెళ్లాలని.. టీడీపీకి దూరంగా ఉండాలని భావిస్తోంది. మరోవైపు అధికార వైసీపీ (YCP)సింగిల్ గానే ఎన్నికల బరిలో దిగేందుకు సై అంటోంది. అయితే ఇతర పార్టీలకు కూడా అదే ఛాలెంజ్ విసరుతోంది. దమ్ముంటే సింగిల్ గా పోటీకి రండి అంటూ.. ఇటు చంద్రబాబు నాయుడికి.. అటు పవన్ కళ్యాణ్ కు సవాల్ విసురుతున్నారు. ఓ వైపు పొత్తులపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారు. మరోవైపు ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ, జనసేన కేవలం ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంటే.. బీజేపీ మాత్రం టీడీపీపై , వైసీపీపై విమర్శలు చేస్తోంది. అటు వైసీపీ నేతలు ఎక్కువగా పవన్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ పొలిటికల్ మాటల మంటల్లో చంద్రబాబు మరోసారి సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రస్తుతం బాదుడే బాదుడు పేరుతో జిల్లాల పర్యటనలో ఉన్న చంద్రబాబు.. ప్రభుత్వ వ్యతిరక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై... మరోసారి మండిపడ్డారు. ప్రభుత్వానికి కూల్చడం తప్ప నిర్మించడం రాదనే అంశం నిత్యం నిరూపణ అవుతుందని విమర్శించారు. దళితుల ఇళ్లను కూడా కూల్చి రాక్షసానందం పొందుతున్నారంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అనంతపురం జిల్లా (Anantapuram) కుందుర్పి మండలం నిజవళ్లిలో హనుమంత రాయుడు అనే దళితుని ఇల్లు కూల్చిన ఘటనను చంద్రబాబు ఖండించారు.
ఒక సామాన్య దళిత వ్యక్తి ఇంటిని కూల్చి కుటుంబాన్ని రోడ్డున పడెయ్యడానికి ఎమ్మెల్యే, ఆర్డీవో, పోలీసులతో పాటు అధికారులంతా కలిసి యుద్దం చెయ్యడంపై చంద్రబాబు నాయుడు విస్మయం వ్యక్తం చేశారు. పేద కుటుంబం ఇల్లు కూల్చడమే లక్ష్యం అన్నట్లు పని చేసిన అధికారుల తీరును చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టారు. రాజకీయ కక్షలతో వేధించే విష సంస్కృతి వైసీపీ డీఎన్ఏలోనే ఉందన్న చంద్రబాబు.... ఇంత మంది ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేసి ఉంటే బాగుండేదన్నారు.
ఇల్లు కూల్చివేతపై ఆవేదనతో దళిత దంపతులు ఆత్మహత్యాయత్నం చేయడంపై ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ఎదిరించలేరని దళితులను అణగదొక్కే చర్యలను దళిత జాతి క్షమించదని చంద్రబాబు ధ్వజమెత్తారు. బాధిత కుటుంబానికి వెంటనే ఇంటిని మంజూరు చెయ్యడంతో పాటు, వారిని వేదనకు గురి చేసినందుకు పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.