Home /News /andhra-pradesh /

AP POLITICS TELUGU DESAM CHIEF CHANDRABABU NAIDU CALL PARTY LEADERS READY FOR ELECTIONS TODAY ON WARDS NGS GNT

Chandrababu: టీడీపీలో రెట్టించిన ఉత్సాహం.. మహానాడు సూపర్ సక్సెస్.. దూకుడు పెంచాలన్న చంద్రబాబు

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

Chandrababu: తెలుగు దేశం పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. దానికి ప్రధాన కారణం మహానాడు సూపర్ సక్సెస్ అవ్వడమే.. ఇకపై విరామం లేకుండా ఇదే జోష్ లో.. రెట్టించిన ఉత్సాహంతో దూకుడుగా వెళ్లాలని కేడర్ కు చంద్రబాబు పిలుపు ఇచ్చారు.. వైసీపీ అరాచకాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు.

ఇంకా చదవండి ...
  Chandrababu On Mahanadu: సమయం లేదు మిత్రమా అంటున్నాయి ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh) లోని ప్రధాన రాజకీయ పక్షాలు. 2024లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. అప్పటి నుంచే ఎన్నికల హీట్ కనిపిస్తోంది. అందుకు ప్రధాన కారణం. ముందస్తు ఎన్నికలు ఖాయం అంటున్నాయి విపక్షాలు.. అధికార పార్టీ నేతలు మాత్రం ఎన్నికలు ఎప్పుడైనా ఉండొచ్చు మా ఇష్టం.. అంటూనే.. ముందస్తు ఎన్నికలు వస్తాయని చంద్రబాబు ఎలా చెబుతారని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ముందస్తు ఎన్నికలపై పూర్తి క్లారిటీ ఇవ్వకపోయినా.. ఇతర పార్టీల కంటే చాలా దూకుడుగా వెళ్తోంది. ఎన్నికల వ్యూహాలను అప్పుడే అమలు పరుస్తోంది. ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) అంటూ మంత్రులు, ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు జనంలోనే ఉంటున్నారు. మరోవైపు సామాజిక న్యాయ భేరి పేరుతో 17 మంది మంత్రులు బస్సు యాత్ర చేపట్టారు.. మళ్లీ త్వరలో ప్రజల మధ్యకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటు ప్రధాన ప్రతిపక్షం సైతం జనం బాట పడుతోంది. ఇప్పటికే అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu).. బాదుడే బాదుడు పేరుతో జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఇప్పడు మరో భారీ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఇకపై నుంచి సుమారు పది నెలల పాటు ఆయన పూర్తిగా జనంలోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)  సైతం పాదయాత్రకు సిద్ధమవుతున్నట్టు టాక్.. మేం ఏం తక్కువ కాదు అంటోంది జనసేన. ఇప్పటికే కౌలు రైతులకు సాయం పేరుతో పవన్ గ్రామాల బాట పట్టారు. జూన్ 1 నుంచి జనసేన (Janasena) కీలక నేత మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) ఉత్తారంధ్ర జిల్లాలో పర్యటించనున్నారు.

  ఇలా అన్ని పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలతో రెడీ అయ్యాయి. అయితే మొన్నటి వరకు పూర్తిగా ఢీలా పడ్డట్టు కనిపించిన తెలుగు దేశం పార్టీ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోంది. అందుకు ప్రధాన కారణం ఇటీవల నిర్వహించిన మహానాడు సూపర్ డూపర్ హిట్ అవ్వడమే.. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మహానాడు సక్సెస్ అయిందని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఒంగోలు మహానాడు ప్రజా విజయంగా ఆయన అభివర్ణించారు. జగన్ అరాచక, విధ్వంస పాలనపై తిరుగుబాటుకు మహానాడు వేదిక అయిందన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కు మహానాడుతో భరోసా వచ్చిందన్నారు.

  ఇదీ చదవండి : సర్వ రోగ నివారిణి పనస.. మరీ ఇంత చీపా..? ధర తెలిస్తే షాక్ అవుతారు..?

  మూడేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ రాజకీయాలకే అనర్హుడు అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇక టీడీపీ నాయకులు కానీ.. కార్యకర్తలు కానీ విరామం తీసుకోవద్దని.. సమయం లేదు మిత్రమా అంటూ దూసుకుపోండి అని సూచిస్తున్నారు. ఇప్పటి నుంచే ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని తమ్ముళ్లకు సూచించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో నెలకు రెండు జిల్లాలలో పర్యటనలు చేయాలన్నారు. కార్యకర్తలు, అభిమానులు, ప్రజల భాగస్వామ్యంతో ఈ స్థాయి విజయం సాధ్యమైందన్నారు చంద్రబాబు.

  ఇదీ చదవండి : చేదెక్కిన అరటి.. అమ్మకాలు లేక అన్నదాతకు అవస్థలు.. కారణం ఏంటంటే?

  ప్రజల్లోకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ పన్నుపోటు, ధరల భారంపై ప్రతి ఒక్కరికీ వివరించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే బాదుడే బాదుడు కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. క్విట్ జగన్- సేవ్ అంధ్రప్రదేశ్ నినాదాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలతో చెప్పారు చంద్రబాబు. మహానాడు విజయంలో భాగస్వాములు అయిన నేతలకు చంద్రబాబు అభినందనలు. ప్రకాశం జిల్లా నేతల పని తీరుకు ప్రత్యేక ప్రశంసలు తెలియజేశారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు