Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తన సొంత నియోజకవర్గం కుప్పం (Kuppam) లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. మొత్తం ఫోకస్ అంతా కుప్పంపైనా పెట్టేరు. చంద్రబాబుకు కంచుకోట అని చెప్పుకునే.. కుప్పంలో వైసీపీ జెండా ఎగురవేయాలని జగన్ కంకణం కట్టుకున్నారు. ఆ బాధ్యతలను మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి (Minster Peddireddy Ramachadra Reddy) కి అప్పగించారు. ఇటీవల నియోజకవర్గ సమీక్షలను కూడా కుప్పంతోనే ఆయన మొదలెట్టారు. ఆ సందర్భంగా కుప్పం వైసీపీ కార్యకర్తలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడ్ని ఓడిస్తే భరత్ కు మంత్రి పదవి ఇస్తాను అంటూ తాయిలాలు ప్రకటించారు. ఇలా నేరుగా కుప్పాన్ని జగన్ టార్గెట్ చేస్తున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు అలర్ట్ అవ్వకతప్పలేదు. దీంతో పదే పదే కుప్పం పర్యటనకు వస్తున్నారు. తాజాగా ఇవాళ ఆయన మూడు రోజుల టూర్ ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు ఎయిర్ పోర్టుకు వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి కుప్పం చేరుకున్నారు. కుప్పంలో స్ధానికంగా పర్యటిస్తూ.. ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నారు. నియోజకవర్గానికి తాను ఏం చేశానో కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు కుప్పంలో సమస్యల్ని చంద్రబాబు దృష్టికి తెచ్చారు.
అక్కడి సమస్యలపై స్పందించిన చంద్రబాబు వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కుప్పంలో వైసీపీ నేతల రౌడీయిజంపై ఫైర్ అయ్యారు. ఇది పులివెందుల కాదని, కుప్పమని వారికి స్పష్టం చేశారు. ధర్మానికి ధర్మం, న్యాయానికి న్యాయం ఉంటుందని అదే పద్ధతిలో రౌడీయిజం చేస్తామంటే రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. పోలీసులు ఓ రాజకీయ పార్టీతో పెట్టుకుంటున్నారని, ఖబడ్డార్ అని చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు.
మీ పని మీరు చేయండి, వైసీపీకి పని చేస్తే మాత్రం టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతే మీరు తట్టుకోలేరన్నారు. పోలీసులకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా, మాట్లాడితే ఎఫ్ఐఆర్ అంటున్నారు. అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటో తెలుసా అని చంద్రబాబు ప్రశ్నించారు. తాను న్యాయానికి భయపడతా, చట్టానికి లోబడతా, రౌడీలకు భయపడేది లేదని వైసీపీ నేతలకు స్పష్టం చేశారు. తొమ్మిదేళ్లలో తాను వైసీపీ నేతల్ని టచ్ చేయలేదని, తమ వాళ్లను టచ్ చేస్తే ఊరుకునేది లేదని బాబు హెచ్చరించారు.
కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన
https://t.co/TMcuPMI2RZ
— Telugu Desam Party (@JaiTDP) August 24, 2022
ఇదీ చదవండి : మళ్లీ పులస వచ్చేసిందోచ్.. రెండు కేజీల పులస ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
వైసీపీ ప్రభుత్వం ఎక్సపెయిరీ డేట్ లో ఉందని వైసీపీ నేతలకు చంద్రబాబు తెలిపారు. అందుకే రౌడీయిజం చేయాలనుకుంటున్నారన్నారు. రౌడీయిజంచేస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. తాను గతంలో కుప్పంలో ఎప్పుడైతే డ్రిప్ ఇరిగేషన్ తెచ్చానో అప్పుడే ఇక్కడ అభివృద్ధి మొదలైందని చంద్రబాబు స్ధానికులకు గుర్తుచేశారు. రోడ్లు వేయించామని, సంక్షేమానికి మారుపేరుగా కార్యక్రమాలుచేశామన్నారు. పేదలు, పిల్లల సంక్షేమం కోసం ఎన్నో చేశామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Kuppam, TDP