Home /News /andhra-pradesh /

AP POLITICS TELEUGU DESAM PARTY WILL READY TO OPERATION AKARSH FROME YCP THESE IS THE DATE NGS

TDP: త్వరలోనే టీడీపీ ఆకర్ష్.. వైసీపీ నుంచి చేరే కీలక నేతలు ఎవరంటే..? నవంబర్ లో క్లారిటీ..?

మహానాడులో చంద్రబాబు (ఫైల్)

మహానాడులో చంద్రబాబు (ఫైల్)

Telugu Desam Party: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఆపరేషన్ ఆకర్ష్ ఉంటుందా.. అధికార వైసీపీ నుంచి భారీగా వలసలు ఉండనున్నాయా..? నవంబర్ నెలను టార్గెట్ గా పెట్టుకున్నారా..? మరి అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి చేరేది ఎవరు..? కేవలం టీడీపీలోనే వైసీపీ నేతలు వెళ్తున్నారా..? పక్క చూపులు చూస్తున్నారా..?

ఇంకా చదవండి ...
  Telugu Desam Party: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అప్పుడే అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లో ఉన్నాయి. ఇప్పటికే పార్టీలన్నీ జనం బాట పడుతున్నాయి. అయితే ముఖ్యంగా గతంతో పోల్చుకుంటే తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. మహనాడు (Mahanadu) సక్సెస్ పార్టీలో కొత్త ఉత్సాహం తెప్పించింది. అందుకే మొన్నటి వరకు వైసీపీ (YCP) లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొందరు నేతలు.. జనసేన (Janasena) లేదా బీజేపీ (BJP) లోకి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నా.. తాజాగా వారు రూటు మార్చుకుని టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం (YCP Government) ప్రస్తుతం మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఆ లెక్క ప్రకారం చూస్తే మరో రెండేళ్ల తరువాత ఎన్నికలు జరగాలి.. అయితే ఆ లోపే.. విషమిస్తున్న పరిస్ధితుల నుంచి బయటపడేందుకు సీఎం జగన్ (CM Jagan) ముందస్తు ఎన్నికల్ని ఎంచుకుంటారన్న ప్రచారం సాగుతోంది. దీంతో ప్రధాన విపక్షం టీడీపీతో పాటు ఇతర పార్టీలు కూడా సన్నాహాలు చేసుకుంటున్నాయి. త్వరలోనే భారీ ఎత్తున చేరికల్ని ప్రోత్సహించేందుకు తెలుగు దేశం పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తోంది.

  అన్ని అనుకున్నట్టు జరిగితే మాజీ మంత్రులతో పాటు వైసీపీ కీలక నేతలు కొందరు పచ్చ కండువా కప్పుకుంటారనే ప్రచారం ఉంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్పప్పుడు కూడా.. అప్పటి ప్రతిపక్షం వైసీపీ నుంచి ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలతో పాటు పలువురు సీనియర్ నేతల్ని తమ పార్టీలో చేర్చుకుంది. అప్పట్లో దీనిపై వైసీపీ అధినేతగా జగన్ తీవ్ర విమర్శలు చేసేవారు. సంతలో పశువుల్ని కొన్నట్లు తమ ఎమ్మెల్యేల్ని కొనేస్తున్నారని ఆరోపించేవారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ని ఎంపీ కాకుండా అడ్డుకునేందుకు ప్రారంభించిన ఈ ఆపరేషన్ ఆకర్ష్ 23 ఎమ్మెల్యేల దగ్గర బ్రేక్ పడింది. దీంతో టీడీపీ ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఈ 23 మందిలో కేవలం ఒక్కరిని మాత్రమే తిరిగి గెలిపించారు. ఆయనే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి (Gottipati Ravi).

  ఇదీ చదవండి : అన్నయ్య మద్దతు మాకే.. చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ.. పొత్తులపైనా క్లారిటీ..

  అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా.. టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ కు జై కొట్టారు.. కాకపోతే ఎవరికీ అధికారికంగా వైసీపీ కండువాలు మాత్రం కప్పలేదు.. వైసీపీ పంచన చేరిన ఆ ఎమ్మెుల్యేలు వారి పదవులకు రాజీనామా చేయలేదు.. మరోవైపు తాజాగా తెలుగు దేశం పార్టీ ఆకర్ష్ కు రెడీ అయినట్టు టాక్. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత నానాటికీ పెరుగుతుండటం, మరోవైపు కేబినెట్ ప్రక్షాళనతో మంత్రి పదవులు పొగోట్టుకుని రగిలిపోతున్న మాజీ మంత్రులు, వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై ఇంకా అవకాశాలు దొరక్క అసంతృప్తిగా ఉన్న వారు.. ఇలాంటి నేతలను ఆకర్షించేందుకు టీడీపీ నేతలు అంతర్గతంగా పావులు కదుపుతున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే టీడీపీ అధిష్టానంతో టచ్ లోకి వచ్చారు అని తెలుస్తోంది. మరి కొందరు ఎన్నికల ముందు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

  ఇదీ చదవండి : ఉప్పలపాడుకు విదేశీ అతిథుల వలస.. ఎన్నో రకాల పక్షులను ఒకే దగ్గర చూసే ఛాన్స్..

  టీడీపీలోకి జంపయ్యేది వీరేనా?
  టీడీపీలోకి జంపయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న వారిలో బుట్టా రేణుక, పార్ధసారధి, మాజీ మంత్రి మేకపాటి సుచరిత, ఆనం రామనారాయణరెడ్డి, కిల్లి కృపారాణితో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు పలువురు మాజీ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు కూడా టీడీపీలో చేరికల కోసం ఎదురుచూస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరంతా ముందస్తు ఎన్నికలపై సంకేతాలు వెలువడగానే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధిష్టానంతో టచ్ లో ఉన్నవారైతే పార్టీలో చేరితే తమకు లభించే స్ధానాలు, టికెట్లు ఖరారు చేసుకునే పనిలో ఉన్నారు. వీరంతా నిజంగా చేరితే మాత్రం ఎన్నికలకు ముందు టీడీపీకి భారీ ఊపు వచ్చే అవకాశం ఉంటుంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు