AP POLITICS TELANGANA MINSTER PUVVADA AJAY KUMAR SENSATIONAL COMMENTS ON CM JAGAN TDP LEADERS TROLLS HIS COMMENTS NGS
YCP Vs TRS: వైసీపీని టార్గెట్ చేస్తున్న టీఆర్ఎస్.. మంత్రి వ్యాఖ్యలను షేర్ చేస్తున్న టీటీపీ
సీఎం జగన్ -మంత్రి కేటీఆర్
YCP Vs TRS: దావోస్ లో ఏపీ సీఎం జగన్ తెలంగాణ మంత్రి కేటీఆర్ లు దోస్ మేరా దోస్త్ అంటుంటే.. టీఆర్ఎస్ నేతలు మాత్రం వైసీపీపై దాడి ఆపడం లేదు. మొదట మంత్రి కేటీఆర్, తరువాత మంత్రి హరీష్ రావు, ఇప్పుడు మంత్రి పువ్వాడ అజయ్ ఇలా ఒక్కొక్కరిగా వైసీపీపై మాటల దాడి చేస్తునే ఉన్నారు. వారి వ్యాఖ్యలు టీడీపీ నేతలకు ఆయుధంలా ఉపయోగపడుతున్నాయి.
YCP Vs TRS: తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నీళ్లు, నిధుల విషయంలో వివాదాలు ఉన్నా.. రాజకీయంగా మాత్రం రెండు పార్టీల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇటీవల రాజ్యసభకు వైసీపి నుంచి ఎంపిక చేసిన ఆర్.కృష్ణయ్య (R Krishnaiah) కు రాజ్యసభ పదవి రావడంపై సీఎం కేసీఆర్ (CM KCR) సిఫార్సు ఉందనే ప్రచారం కూడా ఉంది. ఇలా అవసరాలకు తగ్గట్టు రాజకీయంగా రెండు పార్టీలు ఒక అండర్ స్టాండ్ తోనే ఉంటాయి.. తాజాగా దావోస్ (Davos) పర్యటనలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy), తెలంగాణ మంత్రి కేటీఆర్ (Telangana Minster KTR) లు తమ రాష్ట్రాల కోసం పోటీ పడి మరి పెట్టుబడులను ఆహ్వానించారు. ఇద్దరూ తమ మధ్య సాన్నిహిత్యాన్ని గుర్తు చేస్తూ కలిసి ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు.. ఒకరిపై ఒకరు జోకులు వేసుకున్నారు కూడా.. సోదరుడితో మంచి సమావేశం జరిగింది అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెట్టి.. తమ మధ్య ఉన్న సఖ్యతను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు కూడా. ఇలా రెండు పార్టీల మధ్య.. ఇద్దరు నేతల మధ్య మంచి సంబంధాలే ఉన్నా..? వివాదాలు తప్పడం లేదు. ఆ మధ్య ఏపీలో మౌలిక వసతులపై మాట్లాడిన కేటీఆర్.. ఏపీలో సరైన రోడ్లు లేవు.. విద్యుత్ సదుపాయాలు లేవు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ గా వైసీపీ నేతలు సైతం టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ కౌంటర్లు వేశారు. ఆ తరువాత వన వ్యాఖ్యలపై కేటీఆర్ వెనక్కు తగ్గారు. ఇటీవల సీఎం జగన్ తో కలిసి ఫోటీలు దిగి తమ మధ్య గ్యాప్ లేదని చెప్పే ప్రయత్నం చేశారు..
కేటీఆర్ సీఎం జగన్ రెండు పార్టీల మధ్య స్నేహం కోరుకంటే.. తాజాగా టీఆర్ఎస్ మంత్రి మాత్రం జగన్ ని టార్గెట్ చేశారు. గతంలో జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పై షాకింగ్ వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది స్టేట్ అయిన తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మళ్లీ వైయస్ జగన్ దావోస్ పర్యటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ కు పొగడ్తలు కురిపిస్తూ... జగన్ పై సెటైర్లు వేశారు. మంత్రి కేటీఆర్ పెట్టుబడులు తెస్తున్న తీరును ప్రశంసిస్తూ, పక్క రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు ఈగలు తోలుకుంటున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారాయి.
విదేశాల్లో కూడా పరువు పోగుట్టుకున్న జగన్ రెడ్డి.
దావోస్ లో జగన్ రెడ్డి అండ్ కో ఈగలు తోలుకుంటున్నారు అంటున్న తెలంగాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. pic.twitter.com/A0Am47Csk7
కేటీఆర్ సహచర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ కోసం పెట్టుబడి వరద పాటిస్తుంటే, ఎవరూ రాక, ఎవరు పెట్టుబడులపై ఆసక్తి చూపించక పక్క రాష్ట్రాల సీఎంలు ఈగలు తోలుకుంటున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన కేవలం కేటీఆర్ ను పొగడడానికి ఈ వ్యాఖ్యలు చేశారో.. లేకా వేరే కారణం ఏమైనా ఉండొచ్చు కానీ.. ఇప్పుడు పువ్వాడ అజయ్ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి ఆయుధంగా మారాయి. ఆయన వీడియోను షేర్ చేసి పరువు తీస్తున్నారు టీడీపీ నేతలు.
తెలంగాణ మంత్రి ఏమన్నారంటే..? దావోస్ పర్యటనలో అడుగు పెట్టిన రోజే వెయ్యి కోట్ల పెట్టుబడులు తెచ్చారని వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈగ వాలిన దాఖలాలు కూడా లేవని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ అధికారం ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరువు తీస్తోంది. పక్క రాష్ట్రాల మంత్రులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి ఏం చెబుతున్నారో వినాలి అంటూ ఆ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా పరువు పోగొట్టుకున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. జగన్ రెడ్డి అండ్ కో ఈగలు తోలుకుంటున్నారు అని తెలంగాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెబుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు.
విదేశీ పెట్టుబడుల విషయంలో రోజు రోజుకూ దిగజారి బీహార్ తో పోటీపడుతున్న ఆంధ్రప్రదేశ్ అంటూ సోషల్ మీడియా వేదికగా టీడీపీ సెటైర్లు వేస్తోంది. గతంలో చంద్రబాబు హయాంలో పెట్టుబడుల విషయంలో టాప్ ఫైవ్ లో ఏపీ ఉండేదని తాజాగా కేంద్రం విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో 14వ స్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పడిపోయిందని.. జగన్మోహన్ రెడ్డి ఒక ఫెయిల్యూర్ సీఎం గా ఉన్నారని విమర్శలు చేస్తున్నారు. తెలంగాణా పెట్టుబడుల విషయంలో దూసుకుపోతుంటే..? ఏపీ విఫలం అవుతుందని మండిపడుతున్నారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.