హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

KTR on Amaravati: సీఎం జగన్ కు బిగ్ షాక్.. అమరావతిపై వాస్తవాలు బయటపెట్టిన మంత్రి కేటీఆర్

KTR on Amaravati: సీఎం జగన్ కు బిగ్ షాక్.. అమరావతిపై వాస్తవాలు బయటపెట్టిన మంత్రి కేటీఆర్

అమరావతిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

అమరావతిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR on Amaravati: అమరావతి అంటే ఏం లేదని.. కేవలం గ్రాఫిక్స్ అంటూ వైసీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఏపీకి ఏకైక రాజధానిగా ఉన్న అమరాతిని వైసీపీ సర్కార్ మార్పు చేసింది. అయితే తాజాగా సీఎం జగన్ కు షాక్ ఇస్తూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేవారు. అమరావతిపై వాస్తవాలు బయపెట్టారు. ఆయన ఏమన్నారంటే?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

KTR on Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని (Andhra Pradesh Capital) ఏది అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. విపక్షాలన్నీ ఏపీకి ఏకైక రాజధాని అమరావతి (Amaravati) అంటున్నాయి. న్యాయస్థానాలు, కేంద్రం కూడా అదే చెబుతున్నాయి. తాజాగా కేంద్రం సమర్పించిన అఫిడవిట్ లోనూ.. విభజన చట్టం ప్రకారమే అమరావతి రాజధాని అయ్యిందని స్పష్టం చేసింది. కానీ అధికార వైసీపీ మాత్రం అమరావతి ఏపీకి ఏకైక రాజధాని కాదు అంటోంది. మూడు రాజధానులే తమ విధానం అంటోంది. త్వరలోనే విశాఖ నుంచి పాలన మొదలడెతామని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) స్వయంగా  స్పష్టత ఇచ్చేశారు. అసలు అమరావతిలో ఏమీ లేదని.. అంతా గ్రాఫిక్స్ తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదన్నది సీఎం జగన్ నుంచి మంత్రులు వరకు అందరూ చెబుతున్న మాట ఇదే.. అయితే తెలంగాణ మంత్రి కేటీఆర్ (Telangana Minster Amaravati) అమరావతికి సంబంధించి బహిరంగానే మీటింగ్ పెట్టి విషయంప క్లారిటీ ఇచ్చారు. సీఎం జగన్ కు కేటీఆర్ కు మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం అమరావతిలో ఏమీ లేదని చెబుతుంటే.. కేటీఆర్ మాత్రం వరల్డ్ నెంబర్ వన్ అని కితాబు ఇచ్చారు. ఇంకా అమరావతిపై సంచలన విషయాలు బయట పెట్టారు.

హైదరాబాద్ లోని ఖాజాగూడ దగ్గర కార్పొరేట్ కంపెనీల యాజ‌మాన్యాల‌తో మాట్లాడుతూ అమ‌రావ‌తి మీద ప‌చ్చి నిజాల‌ను బ‌యట పెట్టారు. అమ‌రావ‌తి అభివృద్ధి ప్ర‌స్తుతం ఆగిపోయింది అన్నారు. అందుకే హైద‌రాబాద్ వ‌రల్డ్ నెంబ‌ర్ 1 అవుతోంది అన్నారు. గ‌తంలో మంత్రి హ‌రీశ్ రావు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అమరావతిని పట్టించుకోకపోవడంతోనే తెలంగాణ రియ‌ల్ ఎస్టేట్ పెర‌గ‌డానికి కార‌ణం అన్నారు.

ముఖ్యంగా అమ‌రావ‌తి ప్రాజెక్టు కుప్ప‌కూల‌డ‌మే.. హైదరాబాద్ కు కలసి వచ్చిందని పారిశ్రామిక‌వేత్త‌లకు చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..? అమ‌రావ‌తి అర్బ‌న్ డ‌వ‌లెప్మెంట్ అథారిటీ క్రియేట్ అయింది. దాన్ని కొన‌సాగించి ఉంటే ప్ర‌పంచం నెంబ‌ర్ 1 దిశ‌గా అమ‌రావ‌తి ఉండేది అంటూ మంత్రి అనడం ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్టే చెప్పాలి. అక్క‌డ ప్ర‌స్తుతం ప‌నులు జ‌ర‌గ‌డంలేదు కాబ‌ట్టి హైద‌రాబాద్ ప్ర‌పంచ నెంబ‌ర్ 1 దిశ‌గా వెళుతుంద‌ని కేటీఆర్ చెప్పడం.. తెలుగు దేశానికి కొత్త అస్త్రం దొరికినట్టే అయ్యింది. ఇప్పటికే మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఇదీ చదవండి : రేపు ఢిల్లీకి సీఎం జగన్.. రెండు వారాల వ్యవధిలో రెండోసారి హస్తిన బాట.. కారణం ఏంటంటే?

రాష్ట్రం విడిపోయిన తరువాత విజభన చట్టం ఆధారంగా అమరాతిని నూతన రాజధానిగా చేస్తూ అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ సైతం అప్పట్లో చంద్రబాబు నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ సీఎ కేసీఆర్ కూడా వచ్చారు. ఆ రోజున అమ‌రావ‌తి డిజైన్, భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను కేసీఆర్ విన్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఢిల్లీ నుంచి మ‌ట్టిని కూడా తీసుకొచ్చారు. సంఘీభావం ప్ర‌క‌టిస్తూ అమ‌రావ‌తి ప్రాజెక్టుకు మ‌ద్ధ‌తు ప‌లికారు. అదంతా ద‌గ్గ‌ర నుంచి గ‌మ‌నించిన కేసీఆర్ అమ‌రావ‌తి ప్రాజెక్టు పూర్త‌యితే ఏమ‌వుతుందో గ్ర‌హించి ఉంటారు. పైగా చంద్ర‌బాబు విజ‌న్ అని చెబుతుంటారు కాబట్టి అమరావతి అద్భుతంగా నిలుస్తుందని టీఆర్ఎస్ భావించి ఉండొచ్చు.. అయితే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో.. వైసీపీ అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే మూడు రాజధానులు పెడుతున్నామని.. అమరావతి ఏకైక రాజధాని కాదని.. కేవలం శాసన రాజధాని మాత్రమే అని చెప్పడంతో.. అమరావతిలో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

ఇదీ చదవండి : ఏపీ స్పీకర్ ఫేక్ లా సర్టిఫికేట్ వివాదం.. అల్లుడి ఫిర్యాదుతో చర్యలు తప్పవా..? తమ్మినేనిపై వేటు పడుతుందా?

తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలతో అమరావతి నిర్మాణం పూర్తి అయితే ఏపీ పరిస్థితి ఎలా ఉండేదో అర్థంఅవుతోంది. కానీ వైసీపీ నేతలు మాత్రం అమరావతిలో ఏముంది అంతూ బూడిద అంటూ కామెంట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సీఎం జగన్ సైతం అమరావతిలో ఏమీ లేదంటూ చాలాసార్లు వ్యాఖ్యానించారు. అందుకే తాజా కేటీఆర్ వ్యాఖ్యలు సీఎం జగన్ కు షాక్ ఇచ్చేవే అని చెప్పాలి.

First published:

Tags: Amaravati, Andhra Pradesh, AP News, KTR

ఉత్తమ కథలు