ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పరిస్థితిపై తెలంగాణ (Telangana) మంత్రి కేటీఆర్ (KTR) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక విధంగా ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ (AP CM YS Jagan) ను ఇరుకున పెట్టేలా కేటీఆర్ వ్యాఖ్యలున్నాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పరిస్థితిపై తెలంగాణ (Telangana) మంత్రి కేటీఆర్ (Minister KTR) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక విధంగా ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ (AP CM YS Jagan) ను ఇరుకున పెట్టేలా కేటీఆర్ వ్యాఖ్యలున్నాయి. ఇప్పటికే పలు అంశాల్లో ఏపీ ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో కేటీఆర్ ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. శుక్రవారం హైదరాబాద్ (Hyderabad) లో జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ పో ప్రారంభించిన ఆయన.. ఏపీలో పరిస్థితికి, తెలంగాణలో పరిస్థితికి ఉన్న తేడాను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. "తన మిత్రుడొకరు సంక్రాంతి సందర్భంగా ఆంధ్రాలోని సొంతూరికి వెళ్లారని అక్కడికి వెళ్లిన వెంటనే తనకు ఫోన్ చేసి.. ఇక్కడ కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమయ్యాయి. అంతా అన్యాయంగా అధ్వానంగా ఉంది.. తిరిగి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లుందంటూ.. కొంతమంది నాలుగు బస్సుల్లో ఏపీకి పంపితే తెలంగాణలో ఎంత చక్కగా ఉందో అర్థమవుతుంది" అంటూ ఆయన చెప్పినట్లు కేటీఆర్ వివరించారు.
పక్కరాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అభివృద్ధి అంత చక్కగా ఉందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నవారు నిజాలు తెలుసుకోని మాట్లాడాలని కేటీఆర్ హితవుపలికారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
కేటీఆర్ ప్రసంగాన్ని ప్రతిపక్ష టీడీపీ వైరల్ చేస్తోంది. ఇపటికే కేటీఆర్ కామెంట్స్ ను ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. "కేటీఆర్ నోట...జగన్ విధ్వంసపాలన మాట.. అట్టుంటది ఒక్క చాన్స్ తోని..!" అని లోకేష్ పేర్కొన్నారు.
కేటీఆర్ ప్రస్తావించిన అంశాల్లో ముఖ్యంగా పవర్ కట్స్, రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు రెండేళ్లుగా రోడ్లు గుంతలుపడి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇటీవల నాడునేడు పేరుతో రోడ్లు బాగుచేశామని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా.. ఇంకా వేలాది రోడ్లు గుంతలు పడి అధ్వాన్నంగా ఉన్నాయి. ఇక వేసవి ప్రారంభమైన తర్వాత విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయి. చాలా ప్రాంతాల్లో ప్రతి రోజూ అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నా పవర్ కట్స్ కు పూర్తిస్థాయిలో బ్రేక్ పడలేదు. విద్యుత్ డిమాండ్ పీక్స్ కి చేరడం, ఉత్పత్తి సరిగా లేకపోవడంతో పాటు బహిరంగ మార్కెట్లో యూనిట్ ధర అధికంగా పలుకుతుండటం ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం.. పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించింది.
ఇదిలా ఉంటే కేటీఆర్ కామెంట్స్ కు ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో పలుసార్లు ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల తూటాలు పేలాయి. మరి కొత్త కేబినెట్లో కేటీఆర్ కామెంట్స్ కు ఎవరు కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.