హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan-Somesh Kumar: సీఎం జగన్‌తో సోమేశ్ కుమార్ భేటీ.. ఏం చేయబోతున్నారంటే..?

CM Jagan-Somesh Kumar: సీఎం జగన్‌తో సోమేశ్ కుమార్ భేటీ.. ఏం చేయబోతున్నారంటే..?

సీఎం జగన్ తో సోమేశ్ కుమార్ భేటీ

సీఎం జగన్ తో సోమేశ్ కుమార్ భేటీ

CM Jagan-Somesh Kumar: ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా వైదొలగిన.. సోమేష్ కుమార్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. అయితే ఈ సందర్భంగా ఆయనతో జగన్ ఏం చెప్పారు.. సోమేష్ కుమార్ మనసులో ఏముంది అంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Tadepalle, India

CM Jagan-Somesh Kumar: మొన్నటి వరకు తెలంగాణ (Telangana) లో రాజకీయాల్లో ఆయన నిర్ణయాలు చాలా కీలకంగా ఉన్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) కు ఆయనపై భరోసా ఎక్కువ.. అందుకే ఉన్నత పదవి కట్టబెట్టారు.. అంతేకాదు చాలా విషయాల్లో సలహాలు సూచనలు తీసుకున్నారు కూడా.. ఇలా తెలంగాణ రాజకీయాలతో ప్రత్యేక అనుబంధం ఉన్న సోమేష్ కుమార్ (Somesh Kumar) ఇవాళ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు వచ్చారు. తెలంగాణ ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శిగా వైదొలగిన సోమేశ్‌ కుమార్‌.. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ (CM Jagan) ను కలిశారు. సోమేశ్ కుమార్ తో పాటు ఏపీ సీఎస్ జవహర్ కూడా ఉన్నారు. ముందుగా జవహర్‌ రెడ్డిని కలిసిన సోమేశ్ కుమార్ అనంతరం తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. జగన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ ఆయన సేవలను కొనియాడినట్టు తెలుస్తోంది. తెలంగాణ కోసం కష్టపడి చేశారని.. ఆంధ్రప్రదేశ్ లోనూ సముచి స్థానం ఇచ్చి గౌరవిస్తామని హామీ ఇచ్చారని.. కలిసి పని చేద్దామని కోరినట్టు తెలుస్తోంది. అయితే సోమేశ్ కుమార్ మాత్రం.. స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే ఏపీ ప్రభుత్వం దాన్ని ఆమోదించే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం జాయినింగ్‌ రిపోర్టు అందించిన తర్వాత సోమేశ్ కుమార్ వీఆర్‌ఎస్‌ తీసుకోవడానికి అవకాశం ఉంది.

ఎందుకంటే సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఏపీ సర్కారుకి సోమేశ్ కుమార్ ఈ విషయంపై రిపోర్టు చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. ఆయన మనసులో ఏమున్నా.. ఏపీలో పని చేసేందుకు సుముఖంగానే ఉన్నానని మీడియాతో ఉన్నారు.. సీఎం జగన్ ఏ పదవి ఇస్తే ఆ బాధ్యతలు నిర్వహిస్తానని.. ఉద్యోగిగా తన బాధ్యతలు నెరవేర్చవాల్సిన అవసరం తనపై ఉంది అన్నారు.

ఇదీ చదవండి : కోడి పందాలతో మంత్రి రోజా సందడి.. ముందుగానే మొదలైన సంక్రాంతి సంబరాలు

సర్వీసుకి ఏపీకి వెళ్లేందుకు సోమేశ్ కుమార్ కు ఆసక్తి లేదని తెలుస్తోంది. కాగా, తెలంగాణ సీఎస్‌ గా శాంతి కుమారిని నియమిస్తూ నిన్న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సీనియార్టీ, సర్వీసు ఆధారంగా ఆమె నియామకం జరిగింది. తెలంగాణ కేడర్‌ లో సోమేశ్‌ కుమార్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు వెలువరించడంతో ఆయన ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సి ఉంది. అందుకు నేడు చివరి రోజు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Cs somesh kumar