Home /News /andhra-pradesh /

AP POLITICS TELANGANA CM KCR MAY BE TARGETED BY YS JAGAN MOHAN REDDY AND CHANDRABABU NAIDU IF HE LANDS IN ANDHRA PRADESH AK

KCR: అదే జరిగితే.. చంద్రబాబు, జగన్‌తో కేసీఆర్‌కు ఇబ్బందులే..

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

KCR| Andhra Pradesh: సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో తన పార్టీని విస్తరించాలని అనుకుంటే.. ఆయన ముందుగా ముందడుగు వేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి.

    తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్దిరోజుల్లోనే జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి ఆయన కసరత్తు కూడా దాదాపుగా పూర్తి చేశారు. ఆయన పక్కా అజెండాతో ముందుకు రాబోతున్నట్టు ఇటీవల కేసీఆర్‌తో(KCR) సమావేశమైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. కేసీఆర్ దేశంలో బీజేపీని(BJP) ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారని చెప్పిన ఉండవల్లి.. ఇందుకోసం ఆయన ఏ విధమైన వ్యూహంతో ముందుకు సాగుతారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. అయితే కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తే.. ఏపీలో ఆయన ఏ విధంగా ముందుకు సాగుతారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. అయితే ఒకవేళ సీఎం కేసీఆర్ ఏపీలోనూ(Andhra Pradesh) తన పార్టీని విస్తరించాలని భావిస్తే మాత్రం.. ఆయనకు సరికొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

    సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో తన పార్టీని విస్తరించాలని అనుకుంటే.. ఆయన ముందుగా ముందడుగు వేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి. తోటి తెలుగు రాష్ట్రమైన ఏపీపై కేసీఆర్ ఫోకస్ చేయాల్సిన అవసరం కచ్చితంగా ఏర్పడుతుంది. అయితే ఆయన అలాంటి చర్యలకు పూనుకుంటే.. అక్కడి ప్రాంతీయ రాజకీయ పార్టీలైన టీడీపీ, వైసీపీలు ఏం చేస్తాయన్నది కూడా ఆసక్తికరమే. అయితే గులాబీ బాస్ కేసీఆర్ ఏపీపై ఫోకస్ చేస్తే... వైఎస్ జగన్, చంద్రబాబు తెలంగాణపై మళ్లీ ఫోకస్ పెంచి టీఆర్ఎస్‌ను ఇబ్బందిపెట్టే అవకాశం లేకపోలేదని పలువురు అంచనా వేస్తున్నారు.



    నిజానికి తెలంగాణలో టీడీపీ గతంలో బలమైన పార్టీ, వైసీపీ కూడా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తన బలాన్ని చాటుకుంది. అయితే కాలక్రమంలో ఈ రెండు పార్టీలు ఏపీపై ఎక్కువగా ఫోకస్ చేయడంతో.. తెలంగాణలో ఈ రెండు పార్టీలు ఉనికిని కోల్పోయాయి. మళ్లీ ఇక్కడ తమ పార్టీలను బలోపేతం చేయడంపై అటు జగన్, ఇటు చంద్రబాబు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఏపీలో మళ్లీ అధికారం దక్కించుకోవడంపైనే జగన్, చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు.

    KCR| YS Jagan: జగన్ ఇచ్చిన ఛాన్స్ కేసీఆర్ ఇచ్చే అవకాశం లేదా ?.. టీఆర్ఎస్‌లో చర్చ

    Vundavalli on KCR: కేసీఆర్‌ క్లారిటీతో ఉన్నారు.. నన్ను అలా చేయమన్నారు.. ఉండవల్లి వివరణ

    అయితే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీలో పార్టీని విస్తరించేందుకు ప్రయత్నిస్తే మాత్రం.. ఆయనకు తెలంగాణలో ఇబ్బందులు సృష్టించేందుకు ఈ రెండు పార్టీలు ఏ మాత్రం వెనుకాడబోవని.. తద్వారా కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టకుండా చేస్తాయని పలువురు అంచనా వేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారన్న దాని మీదే జగన్, చంద్రబాబు కేసీఆర్ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటారన్నది ఆధారపడి ఉంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu, CM KCR

    తదుపరి వార్తలు