Paritala sriram: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార, విపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది. కేవలం రాజకీయ శత్రుత్వమే కాదు... ఇరు పార్టీల నేతలు శాశ్వత శత్రువుల్లా మారుతున్నారు. మీరు ఒకటంటే..? మేం రెండు అంటామనే రేంజ్ లో కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా అనంపురతం (Andhra Pradesh)లో పరిస్థితి మరింత ఉధ్రిక్తంగా మారుతోంది. టీడీపీ (TDP) వర్సెస్ వైసీపీ (YCP) నేతల మధ్య మాటల యుద్ధం పీక్ కు చేరింది. తాడిపత్రి (Tadipatri)లో రెండురోజుల క్రితం మంత్రి ఉష శ్రీ చరణ్ (Usha Sri Charan), తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabakhar Reddy) మధ్య మాటల యుద్ధంసాగింది. ఆ వేడి చల్లారకముందే ధర్మవరం టీడీపీ నేత పరిటాల శ్రీరాం (Paritala Sriram) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, అధికారులు చేస్తున్న తప్పుని తప్పని ప్రశ్నిస్తే కేసులు పెడతారా, ఎంతమంది మీద కేసులు పెడతారో పెట్టండి అంటూ శ్రీరామ్ సవాల్ విసిరారు. అక్రమ కేసులు పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ చేశారు. తాను కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడతానని.. తనమీద ఎన్ని కేసులు పెడతారో, లేక పోలీసులతో కొట్టిస్తారో చూద్దామంటూ వైసీపీ నేతలను ఛాలెంజ్ చేశారు.
ప్రజలతో ఓట్లు వేయించుకున్నప్పుడు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రతి నేతపైనా ఉంటుంది అన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి తీరుపై ఆయన మండిపడ్డారు. టీడీపీ నాయకులను గెలుక్కున్నవని.. తానను వదిలిపెట్టేది లేదంటై ఫైర్ అయ్యారు. కేతిరెడ్డి ఒక్కటి గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు. కేతిరెడ్డి చేసే పనులు అంతాఇంతా కాదని.., వాటన్నింటిని బయటపెడతమన్నారు. బెదిరించి లాక్కున్న భూములున్నాయి, మీ తమ్ముడు చేసే రియల్ ఎస్టే ట్ ఉందని.. మీ తమ్ముడు చేసే పనికిమాలిన దందాలను బయటపడతాం, ప్రతి ఒక్కటి బయటపెడతా, ఏవీ వదిలేది లేదు అంటూ హెచ్చరించారు.
ఇదీ చదవండి : టీడీపీలోకి భారీగా వలసలు..! పక్కా సమాచారంతోనే ఆ మాజీ మంత్రి కామెంట్ చేశారా..?
టీడీపీ నాయకులను గెలుక్కుంటూ వెళ్తే ఎవరూ ఊరుకోరని వార్నింగ్ ఇచ్చారు. ప్రతిఒక్కరు ఎమ్మెల్యేని ప్రశ్నిస్తారని, ఎంతమందిపై కేసులు పెడతావో, ఎంతమందిని జైల్లోకి వేస్తావో చూస్తాను అంటూ పరిటాల శ్రీరామ్ తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు. పోలీసులపై రాజకీయ నాయకుల ఒత్తిడి రోజురోజుకు ఎక్కువవుతుందని, ఇది మంచి పద్దతి కాదని పరిటాల శ్రీరామ్ హితవుపలికారు. పరిటాల శ్రీరాం వ్యాఖ్యలు స్థానికంగా హాట్ టాపిక్ గా మారాయి. గత కొంతకాలంగా ధర్మవరంలో పరిస్థితి ఉద్రిక్తంగానే కనిపిస్తోంది. ఇటే అధికార పార్టీ ఎమ్మెల్యే.. అటు ప్రతిపక్ష పార్టీ నేత ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. ధర్మవరం బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పరిరటాల శ్రీరామ్ మరింత దూకుడు పెంచారు. వైసీపీ నేతలకు ఓ రేంజ్ లో వరుస వార్నింగ్ లు ఇస్తున్నారు. తాజాగా ఆయన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎలాంటి కౌంటర్ ఇస్తారన్నేది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Paritala sriram, TDP