Home /News /andhra-pradesh /

AP POLITICS TDP WILL PLAY NEW POLITICAL STRATEGY AS CHANDRABABU FOLLOWING NTR WORDS FULL DETAILS HERE PRN VSP

TDP: 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ మాట... ఇప్పుడు బాబు నోట.. మారిన టీడీపీ వ్యూహం.. ఇకపై వారికే పెద్దపీట

చంద్రబాబు,లోకేశ్ (ఫైల్ ఫోటో)

చంద్రబాబు,లోకేశ్ (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం సాహసోపేతమైన నిర్ణయాలకు కూడా ఆ పార్టీ వెనుకాడేది లేదని సంకేతాలిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India
    P Anand Mohan, News18, Visakhapatnam

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం సాహసోపేతమైన నిర్ణయాలకు కూడా ఆ పార్టీ వెనుకాడేది లేదని సంకేతాలిస్తోంది. 40 ఏళ్ల క్రితం 1982లో పార్టీ ప్రారంభించిన తొలినాళ్ల వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చెప్పిన మాటనే ఇప్పుడు చంద్రబాబు ఆచరణలో పెడుతున్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఎక్కువయ్యారని... దీని వల్ల అభివృద్ధి కూడా ఆగిపోయిందని నాడు ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి యువ నాయకత్వం కావాలని పిలుపునిచ్చారు. దీంతో నాడు ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎంతో మంది యువత రాజకీయాల్లోకి వచ్చారు. అయితే నాడు రాజకీయ ఆరంగేట్రం చేసిన వారిలో చాలా మంది తమ వారసులను తీసుకువచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఇప్పటికీ సీనియర్ల హవానే కొనసాగుతోంది.

    దీంతో తమకు ఎప్పటికీ అవకాశం రాదనే అనుమానంతో పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు కూడా. ఈ నేపథ్యంలో టీడీపీలో జూనియర్ల కంటే కూడా.. సీనియర్లే శాతమే ఎక్కువగా ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే... టీడీపీ కూడా రాబోయే రోజుల్లో మరో కాంగ్రెస్ పార్టీ అవుతుందనే అభిప్రాయం ఇప్పటికే వెల్లడవుతోంది. దీంతో పార్టీకి యువరక్తం ఎక్కించేందుకు అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారట.

    ఇది చదవండి: మరో ఉద్యమానికి అమరావతి రైతులు సిద్ధం.. ఈసారి ఉత్తరాంధ్రపై ఫోకస్


    ఇప్పటికే పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున చంద్రబాబు చేసిన ప్రకటన పార్టీలో సెంకడ్ గ్రేడ్ నాయకుల్లో కాస్త ఉత్సాహాన్ని నింపింది. రాబోయే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే అని చంద్రబాబు ప్రకటించారు. అయితే ఈ ప్రకటన కూడా కాస్త అయోమయానికి గురి చేస్తుంది. ప్రస్తుతం ఉన్న నేతల వారసులకే అవకాశం ఇస్తారేమో అనే అనుమానాలు ప్రస్తుతం యువనేతల్లో ఉన్నాయి. అయితే వీటన్నిటికీ బ్రేక వేసేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తాజాగా వ్యాఖ్యలు చేశారు.



    పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో అన్ని అంశాలతో పాటు పార్టీలో యువత భాగస్వామ్యంపై కూడా చర్చించారు టీడీపీలోకి యంగ్ బ్లడ్ రావాలంటూ లోకేశ్ పిలుపు నిచ్చారు. పార్టీలో యువతకు ప్రాతినిధ్యంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. కీలక సూచనలు కూడా చేశారు. దీంతో సమగ్ర అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. యువతకు ప్రాధాన్యం, యువత భాగస్వామ్యం పెరిగేలా పార్టీ తీసుకోవాల్సిన చర్యలపైన ప్రత్యేక కమిటీ నివేదిక ఇవ్వనుంది. వచ్చే పొలిట్ బ్యూరో సమావేశం నాటికి పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నారా లోకేష్ సూచించారు. పార్టీలో నూతనత్వం, యువ రక్తం ఎక్కించేందుకు వేగంగా కసరత్తు చేపట్టాలని... యువతకు కీలక భాగస్వామ్యం ఇవ్వాలని కూడా లోకేశ్ సూచించారు. దీంతో రాబోయే ఎన్నికల నాటికి పార్టీలో యంగ్ బ్లడ్ తీసుకువచ్చే దిశగా అధినేత పావులు కదుపుతున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, Chandrababu Naidu, TDP

    తదుపరి వార్తలు