Home /News /andhra-pradesh /

AP POLITICS TDP STATE PRESIDENT ATCHENNAIDU SLAMS AP CM YS JAGAN ON LIQUOR ISSUE IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

AP Politics: అలా చెప్తే రాజకీయాలు వదిలేస్తా.. సీఎంకు అచ్చెన్న సవాల్.. ముదిరిన లిక్కర్ వార్..

అచ్చెన్నాయుడు, వైఎస్ జగన్ (ఫైల్)

అచ్చెన్నాయుడు, వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార, ప్రతిపక్షాల మధ్య లిక్కర్ వార్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. రాష్ట్రంలో మద్యం పాలసీకి వ్యతిరేకంగా ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి వెళ్లిన టీడీపీ (TDP) ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార, ప్రతిపక్షాల మధ్య లిక్కర్ వార్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. రాష్ట్రంలో మద్యం పాలసీకి వ్యతిరేకంగా ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి వెళ్లిన టీడీపీ (TDP) ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలను గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఉంగుటూరు పీఎస్ కు వెళ్లి ఎమ్మెల్యేలను పరామర్శించారు. అనంతరం అక్కడే కూర్చొని నిరసన తెలిపారు. దీంతో ఉంగుటూరులో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది.

    ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాడుయు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏపీ శాసనసభను వైసీపీ కార్యాలయంగా మార్చేశారని ఆయన ఆరోపించారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి 27 మంది మరణిస్తే.., ఆవిషయాన్ని శాసనసభలో ప్రతిపక్ష పార్టీగా సభ దృష్టికి తీసుకెళ్తే అవి సహజ మరణాలు అనడం శోచనీయమన్నారు. సభలో టీడీపీ ఎమ్మెల్యేలకు మైకులు ఇవ్వడం లేదు కాబట్టే తాళాలతో నిరసన తెలిపామని.., నేడు కూడా సీఎం జగన్ అబద్దాలు మాట్లాడుతూ సహజ మరణాలు అనడం దారుణమని అచ్చెన్న అన్నారు. 2014 నుండి 2019 వరకు చంద్రబాబు తీసుకువచ్చిన సొంత బ్రాండ్లు ప్రస్తావన రాలేదని.., నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి సరైన బ్రాండ్లు లేవు కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని షాపుల్లోని కొన్ని బ్రాండ్లు తీసుకొచ్చి టెస్ట్ చేస్తే కల్తీ మద్యం విషయం బయటపడుతుందన్నారు.

    ఇది చదవండి: ఏపీలో ఎమ్మెల్యేలు, లీడర్లు, అధికారుల ఫోన్లు బిజీ.., కారణం తెలిస్తే షాక్ అవుతారు..!


    రాష్ట్రంలో ప్రతి మద్యం షాపులో కమిషన్ కోసం కల్తీ మద్యం అమ్మిస్తున్నారని.., శాసనసభలో దానిపై చర్చిస్తే మమ్మల్ని బయటకు పంపేస్తున్నారని అచ్చెన్న ఆరోపించారు. ఎమ్మెల్యేలు మాత్రమే సెబ్ కార్యాలయంలో వినతి పత్రం అందిస్తే తప్పు ఏముందని ప్రశ్నించారు. మద్యం అమ్మకం ద్వారా మహిళలకు సంక్షేమ పథకాలు ఇస్తానని సీఎం అనడం దారుణమన్నారు. టీడీపీ నాయకులు కల్తీ మద్యం తాగవద్దు అని చెప్పి ప్రచారం చేస్తే రాష్ట్రానికి ఆదాయం ఎలా అనడమేంటని ప్రశ్నించారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇవ్వలేదని జగన్ చెబితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాననిఅ అచ్చెన్న సవాల్ విసిరారు.

    ఇది చదవండి: పార్టీ ఏదైనా.. ప్లాన్ ఒక్కటే.. వారి కోసం వందల కోట్లు.. వ్యూహం గిట్టుబాటు అవుతుందా..?


    దశల వారీ మద్యపానాన్ని నిషేధించేందుకు షాపులు సంఖ్య తగ్గించామని ప్రభుత్వం చెబుతుంటే.. మద్యంపై వచ్చే ఆదాయం ఎలా పెరిగిందే సీఎం చెప్పాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జగన్ బ్రాండ్లు నిషేదించే వరకు టీడీపీ పోరాటాలు చేస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, TDP

    తదుపరి వార్తలు