హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YCP vs TDP: ఆ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్ కే.. సీఎం జగన్ పై టీడీపీ సంచలన ఆరోపణలు.. మద్యం వివాదంలో మరో మలువు..

YCP vs TDP: ఆ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్ కే.. సీఎం జగన్ పై టీడీపీ సంచలన ఆరోపణలు.. మద్యం వివాదంలో మరో మలువు..

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో లిక్కర్ వార్ రోజుకో మలుపు తిరుగుతోంది. మద్యం అంశంలో వైసీపీ (YSRCP), టీడీపీ (TDP) మధ్య ఢీ అంటే ఢీ అనేలా మాటల యుద్ధం జరుగుతోంది. అసెంబ్లీలో మొదలైన రగడ.. పరస్పర ఆరోపణల వరకు వెళ్లింది.

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో లిక్కర్ వార్ రోజుకో మలుపు తిరుగుతోంది. మద్యం అంశంలో వైసీపీ (YSRCP), టీడీపీ (TDP) మధ్య ఢీ అంటే ఢీ అనేలా మాటల యుద్ధం జరుగుతోంది. అసెంబ్లీలో మొదలైన రగడ.. పరస్పర ఆరోపణల వరకు వెళ్లింది.

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో లిక్కర్ వార్ రోజుకో మలుపు తిరుగుతోంది. మద్యం అంశంలో వైసీపీ (YSRCP), టీడీపీ (TDP) మధ్య ఢీ అంటే ఢీ అనేలా మాటల యుద్ధం జరుగుతోంది. అసెంబ్లీలో మొదలైన రగడ.. పరస్పర ఆరోపణల వరకు వెళ్లింది.

  ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో లిక్కర్ వార్ రోజుకో మలుపు తిరుగుతోంది. మద్యం అంశంలో వైసీపీ (YSRCP), టీడీపీ (TDP) మధ్య ఢీ అంటే ఢీ అనేలా మాటల యుద్ధం జరుగుతోంది. అసెంబ్లీలో మొదలైన రగడ.. పరస్పర ఆరోపణల వరకు వెళ్లింది. మద్యం బ్రాండ్లంన్నింటికీ చంద్రబాబే అనుమతిచ్చారని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించగా.. ముఖ్యమంత్రి ప్రకటనకు కౌంటర్ గా టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. మద్యపాన నిషేధం పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు మద్యం విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రాణాలే ముఖ్యమనేది తెలుదేశం పార్టీ ఉద్దేశమని అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో మద్యపానాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చారు.. సీఎం అయిన తర్వాత ఢిల్లీలో కూడా మద్యంపై ఆదాయాన్ని తగ్గించుకుంటామని సీఎం చెప్పినట్లు గుర్తుచేశారు.

  సంపూర్ణమద్యపానం, కేవలం ఫైస్ స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం ఉంటుదంన్నారుకానీ అమలు కాలేదన్నారని అచ్చెన్న అన్నారు. మద్యం ఆదాయం తగ్గిస్తామన్న మాట కూడా నిలబెట్టుకోలేదన్నారు. 2014-15లో రాష్ట్రంలో 11,569 కోట్ల మద్యం అమ్మకాలు జరిగేవని.. అదే 2021-22లో 24,714 కోట్ల మద్య విక్రయాలు జరుగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందన్నారు. మద్యం ఆదాయాన్ని తగ్గిస్తామన్న సీఎం.. మద్యం అమ్మకాలను 11వేల కోట్ల నుంచి 24వేల కోట్లకు పెంచారన్నారు.

  ఇది చదవండి: ఏపీలో ఆర్ఆర్ఆర్ ఫీవర్.. థియేటర్లకు అధికారుల నోటీసులు.. సెక్యూరిటీ పెంపు..

  ఇక బడ్జెట్లో కూడా మద్యం నుంచి రూ.16,500వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆర్ధిక మంత్రి చెప్పారన్నారు. 16,500 కోట్ల ఆదాయం రావాలంటే రూ.30వేల కోట్ల విలువైన మద్యం అమ్మాల్సి ఉంటుందన్నారు. ఈ ఐదేళ్లలో 10వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి కకుండా.. తాడేపల్లి ప్యాలెస్ కు, సీఎం జగన్ రావాలని టార్గెట్ పెట్టుకున్నారని అచ్చెన్న ఆరోపించారు. అందుకోసమే మద్యం పాలసీని మార్చేశారన్నారు.

  ఇది చదవండి: చంద్రబాబుకు కొత్త నిక్ నేమ్.. జే బ్రాండ్ కు వైసీపీ ఇచ్చిన అర్ధం ఇదే..!

  మద్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తమను సభ నుంచి సస్పెండ్ చేశారని అచ్చెన్న అన్నారు. మద్యంపై అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పిన ప్రతిమాట అవాస్తవమని స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న మద్యం బ్రాండ్లకు చంద్రబాబు అనుమతులిచ్చారన్న ఆరోపణలను అచ్చెన్నాయుడు ఖండించారు. డిస్టలరీస్ కు చంద్రబాబు అనుమతి ఇచ్చి ఉంటే జగన్ ఎందుకు క్యాన్సిల్ చేయలేదని ప్రశ్నించారు. టీడీపీ తెచ్చిన పథకాలను రద్దు చేసిన సీఎం.. మద్యం అనుమతులను ఎందుకు రద్దు చేయలేదని నిలదీశారు. ఏపీలోని డిస్టలరీల యజమానులు వేరని.. నడిపేది వేరని అచ్చెన్న ఆరోపించారు. మద్యం విషయంలో ప్రజలకు ఎలాంటి ఛాయిస్ లేకుండా ఇచ్చిందే తాగాలి అనేలా విక్రయిస్తున్నారని విమర్శించారు.

  ఇది చదవండి: ఏపీలో ఎమ్మెల్యేలు, లీడర్లు, అధికారుల ఫోన్లు బిజీ.., కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

  సీఎం జగన్ ఆరోపించిన విధంగా సీ బ్రాండ్ అంటే.. ఏపీ అభివృద్ధికి బ్రాండ్ అన్నారు. హైదరాబాద్ లాంటి అభివృద్ధే సీ బ్రాండ్ అన్నారు. తెలుగుజాతి ఉన్నంత వరకు సీ బ్రాండ్ ఉంటుందన్నారు. మద్యంపై ఆదాయం రాలేదంటే అమ్మఒడి, పెన్షన్లు ఇవ్వలేనని సీఎం చెప్పడం మన దౌర్భాగ్యమన్నారు. మద్యంపై ఆదాయాన్ని తాకట్టుపెట్టి పథకాలిస్తామని సీఎం ఎందుకు చెప్పలేదని అచ్చెన్న నిలదీశారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు టీడీపీ చేస్తున్న ఉద్యమానికి మద్దతివ్వాలని పిలుపునిచ్చారు.

  -

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Kinjarapu Atchannaidu

  ఉత్తమ కథలు