Home /News /andhra-pradesh /

AP POLITICS TDP SENIOR LEADER YANAMALA RAMKRISHNUDU NEW PLAN ON TUNI FOR NEXT ELECTIONS NGS VSP

Yanamala Plan: యనమల మరో ప్రయోగానికి సిద్ధమయ్యారా? తమ్ముడిని పక్కన పెట్టి.. ఆమెకు ఓటేస్తారా?

యనమల నయా ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

యనమల నయా ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

Yanamala Rama Krishnudu: తెలుగు దేశం పార్టీలో ఆయన నెంబర్ టు.. నేరుగా చంద్రబాబుకు సలహాలు ఇవ్వగలిగేది ఆయన ఒక్కరే.. కానీ అలాంటి నేతకు సొంత నియోజకవర్గంలో కష్టాలు తప్పడం లేదు. వరుసగా మూడు సార్లు ఆయన ఫ్యామిలీకి ఓటమి ఎదురైంది. దీంతో ఈ సారి కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారా..? తమ్ముడిని పక్కన పెట్టి.. ఆమెను రంగంలోకి దింపాలి అనుకుంటున్నారా?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    P Anand Mohan, Visakhapatnam, News18

    Yanamala Rama Krishnudu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రధాన ప్రతిపక్షం.. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) లో  యనమల రామకృష్ణుడు (Yanamala Rama Krishnudu) నెంబర్ టు అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఐదు పదేళ్లు కాదు.. ఇరవై ఆరేళ్లు ఎమ్మెల్యేగా పని చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చినపుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఓ సారి ఓడిపోవటంతో.. ఇక అప్పటి నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని భీష్మించారు. ఆ వెంటనే తన స్థానంలో సోదరుడిని రంగంలోకి దింపారు.. కానీ ఫలితం లేకుండా పోయింది. గతంలో ఆయన తుని (Tuni) నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 నుంచి 2004 వరకు 26 ఏళ్లు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా, స్పీకర్‌గా పని చేశారు. 2009 ఎన్నికల్లో తొలిసారి ఓడిపోవడంతో ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన 2014, 2019 ఎన్నికల్లో తమ్ముడు కృష్ణుడు ను బరిలోకి దింపినా ఫలితం మాత్రం మారలేదు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరవాత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి.. పార్టీ ఆయన్ను మంత్రిని చేసింది. ప్రస్తుతం యనమల శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. పార్టీలో నెంబర్ 2గా ఉన్నప్పటికీ సొంత నియోజకవర్గంలో వరుస ఓటములతో పూర్తిగా ఇబ్బందుల్లో పడ్డారు.

    ముఖ్యంగా తమ్ముడు కృష్ణుడిని బరిలోకి దింపినా ప్రయోజనం లేకపోవడంతో కొత్త ఎత్తులు వేస్తున్నారని సమాచారం. ఎందుకంటే ఈసారి ఓడిపోతే నియోజకవర్గంలో కనీసం ఎవరు పట్టించుకోరని తెగ బాధ పడిపోతున్నారట ఆయన. రాజకీయంగా వారసుడు లేరు. ఆయనకు ఇద్దరు కూతుళ్లే. పెద్ద అమ్మాయి దివ్యకు రాజకీయాలంటే ఆసక్తి లేదని ప్రచారం ఉంద. అల్లుడు ఐఆర్ఎస్ అధికారి. అయినా వారిని ఒప్పించి.. వచ్చే ఎన్నికల్లో దివ్యను తుని నుంచి ఎన్నికల బరిలో దింపడానికి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారని తెలుస్తోంది.



    ఎందుకంటే సాధారణంగా మొదటి నుంచి నియోజకవర్గంలో క్యాడర్‌కు టచ్‌లో ఉండరే ప్రచారం ఉండేది. కేవలం పరిచయం ఉన్న.. నమ్మిన అతి కొద్ది మందితోనే తన ఆలోచనలను షేర్ చేసుకుంటారట. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది అంటున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులకు సైతం ఫోన్‌లు చేసి ఏంటి పరిస్థితి.. ప్రస్తుతం రాజకీయాలు ఎలా నడుస్తున్నాయంటూ ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేనిది పార్టీలో ఆ స్థాయిలో ఉన్న నాయకుడు తమను కాంటాక్ట్ చేయడం ఏంటని చర్చ మొదలైంది.

    ఇదీ చదవండి : ఏపీ ఉద్యోగులకు మరో శుభవార్త.. ఇతర రాష్ట్రాల్లోనూ ఆ సేవలకు గ్రీన్ సిగ్నల్

    ఈ సారి ఎన్నికల్లో ఏం చేద్దాం.. తునిలో మన బలం ఏంటో చూపించాలని పెద్దమ్మాయిని పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని.. ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తుని నుంచి వరుసగా రెండుసార్లు మంత్రి దాడిశెట్టి రాజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఆయనకు గట్టి అభ్యర్థి కావాలంటే కొత్త జనరేషన్‌కు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందంటూ ఆరా తీస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Yanamala Rama Krishnudu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు