AP POLITICS TDP SENIOR LEADER YANAMALA RAMAKRISHNUDU ALLEGATIONS ON GOVERNMENT OVER ANDHRA PRADESH FINANCIAL STATUS UMG
ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్.. మాజీ ఆర్థికశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు
వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని.. వాస్తవ ఆర్థిక పరిస్థితిని మరుగునపెట్టి తప్పుడు లెక్కలతో జగన్ (YS Jagan) తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మాజీ ఆర్థికశాఖ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని.. వాస్తవ ఆర్థిక పరిస్థితిని మరుగునపెట్టి తప్పుడు లెక్కలతో జగన్ (YS Jagan) తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మాజీ ఆర్థికశాఖ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులు చూసి పెట్టుబడులు పెట్టడానికి, అప్పులు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని.. ఈ విషయమై కేంద్రంతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను బహిర్గతం చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. తప్పుడు లెక్కలతో అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రజలను ఏపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందన్నారు.
రాష్ట్ర రెవెన్యూ ఆదాయాలతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా అధిక వడ్డీలకు అప్పులు తెస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు జగన్ పాల్పడుతున్నారంటూ యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఒక తప్పును సరిదిద్దడానికి తప్పు మీద తప్పు చేస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందంటూ ఆయన విమర్శించారు. అప్పులున్న వాడివెంట నడవొద్దని పెద్దలు చెబుతుంటారని.. రాష్ట్రంలోని పరిస్థితి చూస్తే అంతే అనిపిస్తుందని, అందుకే ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి, అప్పులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అర్హతకు మించి రుణాలు తీసుకోవడం, కేంద్రం ఇచ్చిన నిధులను ఇష్టానుసారంగా బదిలీ చేసి ప్రజా ప్రయోజనాలను దెబ్బదీస్తోందని యనమల విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించడంతో వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితులపై కూడా రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించడం నిజం కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత వ్యయం చేస్తోందంటూ సూటిగా అడిగారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఇచ్చే ప్రత్యేక నిధులను సైతం రాష్ట్ర వాటా జోడించి ఖర్చు చేయడంలో విఫలమవ్వడంతో ఆ నిధులు సైతం వెనక్కెళ్లాయన్నారు. 14, 15 ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన రూ.6 వేల కోట్లు ఏమయ్యాయని.. జలజీవన్ మిషన్ కింద రాష్ట్రానికి వచ్చిన రూ.7 వేల కోట్లు ఏం చేశారు.. ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలంటూ యనమల ప్రశ్నించారు.
అదేవిధంగా, ఇటీవల ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్లను వేలానికి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందంటూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు, జనసేన పార్టీ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ.. ఇప్పుడు ఏపీని మద్యపాన్ ప్రదేశ్‌గా మారుస్తోందంటూ నారా లోకేశ్ విమర్శించగా.. ఇది స్పిరిటెడ్ విజనరీ అంటూ జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సందించారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం కాదు.. కాదు, సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం పవన్ కల్యాణ్ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.