Home /News /andhra-pradesh /

AP POLITICS TDP SENIOR LEADER VARLA RAMAIAH SENSATIONAL COMMENTS ON AP CM YS JAGAN MOHAN REDDY ON YS VIVEKA MURDER CASE AK

వైఎస్ వివేకా హత్య కేసు... టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

వైఎస్ వివేకానంద రెడ్డి (File)

వైఎస్ వివేకానంద రెడ్డి (File)

తన బాబాయిని హత్య చేసిన వారి పేరు బయటకు రాకుండా జగన్ దాస్తున్నారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు.

    టీడీపీ నేత వర్ల రామయ్య మరోసారి ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వారెవరో ఏపీ సీఎం జగన్‌కు తెలుసని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. తన బాబాయిని హత్య చేసిన వారి పేరు బయటకు రాకుండా జగన్ దాస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. కేసు విచారణ జరుగుతున్న తీరును కూడా వర్ల రామయ్య తప్పుబట్టారు. ఈ కేసుపై విచారణ జరుపుతున్న కడప ఎస్పీని ఎందుకు బదిలీ చేశారో ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసులో అసలు నిందితుడు ఎవరో ఎస్పీకి తెలుసని... అందుకే ఆయనను బదిలీ చేశారని వర్ల రామయ్య ఆరోపించారు.

    కేసును సీబీఐకు అప్పగించే విషయంలో జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని జగన్ డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వర్ల రామయ్య గుర్తు చేశారు. కేసులో నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, Tdp, Varla ramaiah, Ys viveka murder case, YS Vivekananda reddy, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు