P Anand Mohan, Visakhapatnam, News18.
AP Politics: ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మరోసారి కీలక వ్యాఖ్యలు చేయడంతో.. అదే అంశం ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణం అవుతోంది. విశాఖలో (Visakhapatnam) పర్యటించిన చంద్రబాబు.. విశాఖకు అభివృద్ధి కావాలా లేక రాజధాని కావాలా అని అన్నారు. అమరావతిని (Amaravati) రాజధాని చేసి విశాఖను అభివృద్ధి చేస్తానని చంద్రబాబు (Chandrababu Naidu) మరోసారి స్పష్టం చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలపై వైసీపీ (YCP) నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రతిపక్ష నేత ఆరోపణలకు కౌంటర్లిస్తున్నారు. విశాఖ(Visakha)కు రాజధాని కావాలా.. అభివృద్ధి కావాలా అంటూ వైజాగ్ వాసులకు చంద్రబాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మనిషి రక్తం రుచి మరిగిన పులికి, వేటాడటానికి మనుషులు దొరక్కపోతే ఏ రకంగా పిచ్చెక్కుతుందో... అధికారం పోయిన చంద్రబాబు పరిస్థితి అలాగే ఉందంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విశాఖ అభివృద్ధి కావాలా? రాజధాని కావాలా అని అడిగిన చంద్రబాబును... అమరావతి అభివృద్ధి కావాలా? లేక రాజధాని కావాలా అని మేం అడుగుతున్నామన్నారు. ఎవరి ఎన్ని కుట్రలు చేసినా మూడు రాజధానులు రావడం పక్కా అన్నారు.
ఇక మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సైతం అదే వ్యాఖ్యలు చేశారు. ఉత్తరంధ్ర ప్రజలకు చంద్రబాబు ఏం చేశారని మాజీ మంత్రి అవంతి (Ex Minster Avanti) నిలదీశారు.. వైజాగ్ (Vizag) రాజధాని అయితే మూడు జిల్లాల ప్రజలకు మేలు జరుగుతుందని.. కానీ రాజధాని రాకుండా చంద్రబాబే అడ్డుపడుతున్నారంటూ అవంతి విమర్శించారు.. దీంతో భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కూ, టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu)కూ మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ఇదీ చదవండి : మాజీ మంత్రి బొజ్జల మృతి.. పార్టీకి తీరని లోటన్న చంద్రబాబు.. కేసీఆర్ సంతాపం
భీమిలిలో తాజాగా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అవంతి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో అవంతి శ్రీనివాస్ కు సంబంధించి గతంలో బయటపడిన రొమాన్స్ ఆడియోను కూడా అందులో ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.
విశాఖ ని రాజధానిగా ప్రకటించిన తరువాత అవంతి గారి రాసలీలలు ఆడియో విడుదల తప్ప విశాఖ అభివృద్ధి అదనంగా ఒక్క రూపాయి అయినా వైసిపి ప్రభుత్వం విడుదల చేసిందా? పదవి పోయాకా పరువు కాపాడుకోవడానికి ఉత్తరాంధ్ర గుర్తొచ్చిందా? మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం ఒక్క రూపాయి కూడా ,(1/2)
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) May 6, 2022
విశాఖని రాజధానిగా ప్రకటించిన తరువాత అవంతి రాసలీలలు ఆడియో విడుదల తప్ప విశాఖ అభివృద్ధి అదనంగా ఒక్క రూపాయి అయినా వైసిపి ప్రభుత్వం విడుదల చేసిందా? పదవి పోయాకా పరువు కాపాడుకోవడానికి ఉత్తరాంధ్ర గుర్తొచ్చిందా? మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం ఒక్క రూపాయి కూడా ఎందుకు కేటాయించడం లేదని జగన్ ను నిలదీసే ధైర్యం లేని.. మీకు ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తొచ్చారా అవంతి అంటూ అయ్యన్నపాత్రుడు తన ట్వీట్ లో అవంతిని నిలదీశారు.
ఎందుకు కేటాయించడం లేదని జగన్ రెడ్డి గారిని నిలదీసే ధైర్యం లేని మీకు ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తొచ్చారా అవంతి గారు?. (2/2)
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) May 6, 2022
అన్ని పార్టీలు ఇప్పుడు ఎన్నికల మూడ్ లోకి వెళ్లడంతో.. వైజాగ్ రాజధాని అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అధికార పార్టీ వచ్చే ఎన్నికల నాటికి మూడు రాజధానులే ఎజెండగా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ఇక టీడీపీ మాత్రం.. అమరావతే రాజధాని అని చెప్పే ప్రయత్నం చేయొచ్చు.. దీంతో తరువాత ఎవరు గెలిచినా.. రాజధాని విషయంలో ఇబ్బంది ఉండదు.. అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Avanti srinivas, Ayyannapatrudu, Chandrababu Naidu, Vizag