ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చట్టంలో లేని అధికారాన్ని జగన్ తన చేతుల్లోకి తీసుకున్నారని మండిపడ్డారు. జగన్(YS Jagan) చేసే విధ్వంసాలను సరిదిద్దడం రాజ్యాంగ సంస్థలకు కూడా కష్టంగా మారిందని వ్యాఖ్యానించారు. చట్టానికి వ్యతిరేకంగా ఏపీ ముఖ్యమంత్రి పని చేస్తున్నారని విమర్శించారు. అమరావతి ఏర్పాటు రహస్యంగా చేసింది కాదని చంద్రబాబు(Chandrababu) గుర్తు చేశారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చర్చలు జరిపామని తెలిపారు. ప్రధాని మోదీ(PM Modi) వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారని.. అమరావతికి అండగా ఉంటానని ప్రధాని చెప్పారని గుర్తుచేశారు. అమరావతిపై జగన్ మాట మార్చారని ధ్వజమెత్తారు. నాడు అసెంబ్లీ సాక్షిగా జగన్ ఏం చెప్పారని ప్రశ్నించారు. ఇప్పుడు ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
విభజన చట్టం సెక్షన్ 5లో రాజధానిపై స్పష్టంగా ఉందని.. అయినా 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఏపీ రాజధానిపై నిన్న సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ వేసిందని చంద్రబాబు అన్నారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం సుప్రీంకోర్టులో ప్రస్తావించిందని చెప్పారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను రాష్ట్రానికి పంపామని తెలిపిందని అన్నారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందని కేంద్రం తెలిపిందని చెప్పారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము ఆమోదించామని కేంద్రం చెప్పిందని వెల్లడించారు. రాజధానిగా అమరావతిని మెజార్టీ ప్రజలు ఆమోదించారని అన్నారు.
ఏపీ ప్రభుత్వం తమను సంప్రదించకుండానే మూడు రాజధానుల చట్టం తెచ్చిందని.. కేంద్రం అఫిడవిట్‌లో స్పష్టంగా తెలిపిందని చంద్రబాబు తెలిపారు. ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగానే కేంద్రం ఈ విషయాలు చెప్పింది’’ అని చంద్రబాబు గుర్తుచేశారు. సీఎం జగన్‌ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని చంద్రబాబు విమర్శించారు చట్టాలు చేసే హక్కు శాసనసభకు లేదా అంటూ వక్రీకరించి మాట్లాడారని... కౌన్సిల్ రద్దు చేయడానికి అసెంబ్లీలో బిల్లు పెట్టారని గుర్తు చేశారు.
Ap: నారా లోకేష్ 'యువగళం' పాదయాత్రలో అపశృతి..గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
YS Jagan: త్వరలోనే వైసీపీ కీలక సమావేశం.. నెల్లూరు ఎపిసోడ్ తరువాత.. జగన్ ఏం చెప్పబోతున్నారు ?
రాజధానికి రైతులు స్వచ్ఛందంగా వేలాది ఎకరాల భూమి ఇచ్చారని... వెయ్యి రోజులకుపైగా అమరావతి రైతులు పోరాడుతున్నారని చంద్రబాబు అన్నారు. న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్రను ఇబ్బంది పెట్టారని... అమరావతిపై కులం పేరుతో విషం చిమ్మారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని దెబ్బతీసేందుకు ఏజెన్సీలతో సర్వే చేయించారని... రాజధాని పూర్తయి ఉంటే లక్షల కోట్ల ఆదాయం వచ్చేదని చంద్రబాబు అన్నారు. మీ పైరవీల కోసం ముగ్గురు ఎంపీలను వాడుకున్నారని... మొత్తం రాష్ట్రాన్నే నాశనం చేసే పరిస్థితికి వచ్చారని చంద్రబాబు విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu