Home /News /andhra-pradesh /

AP POLITICS TDP PRESIDENT CHANDRABABU NAIDU IGNORES ALLIANCE WITH JANASENA DUE TO HIS SON NARA LOKESH AK

AP Politics: చంద్రబాబు ప్లాన్‌కు లోకేశ్ చెక్ పెట్టారా ?.. ఇదే అసలు కారణమా ?

చంద్రబాబు,లోకేశ్ (ఫైల్ ఫోటో)

చంద్రబాబు,లోకేశ్ (ఫైల్ ఫోటో)

AP Politics: వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి ఆలోచించకుండా ముందుకు సాగాలనే ఆలోచనకు చంద్రబాబు రావడానికి ఆయన తనయుడు లోకేశ్ కూడా మరో కారణమనే వాదన వినిపిస్తోంది.

    ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుకు ఉన్నంత అనుభవం.. మరే ఇతర రాజకీయ నాయకుడికి లేదనే చెప్పాలి. అలాంటి చంద్రబాబును(Chandrababu Naidu) ఆయన ప్రత్యర్థులు మాత్రం అనేక విషయాల్లో తీవ్రంగా విమర్శిస్తుంటారు. అందులోనూ పొత్తులు లేకుండా చంద్రబాబు ఎప్పుడూ గెలవలేదనే విమర్శ ఆయన చాలాసార్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ రకమైన విమర్శలు వైసీపీ(YSRCP) నుంచి వస్తూనే ఉంటాయి. అయితే పొత్తుల కారణంగా గతంలో చంద్రబాబు అనేకసార్లు లాభపడ్డ ఘటనలు ఉన్నాయి. అందుకే పొత్తుల విషయంలో ఆయన కాస్త ఎక్కువ సానుకూలంగా ఉంటారనే టాక్ ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో పొత్తులు(Alliance) పెట్టుకునే విషయంలో మాత్రం చంద్రబాబు మనసు పూర్తిగా మారిపోయిందని.. అసలు పొత్తులకు సంబంధించిన అంశం మరోసారి తెరపైకి రాకుండా టీడీపీ జాగ్రత్త పడుతోందనే చర్చ సాగుతోంది.

    ముఖ్యంగా జనసేనతో(Janasena) పొత్తు కోసం టీడీపీ చేసిన ప్రయత్నాలు.. దానిపై వైసీపీ చేసిన ప్రచారం ఆ పార్టీ ఇమేజ్‌ను కొంతమేర డ్యామేజ్ చేసింది. పొత్తుల లేకుండా చంద్రబాబు సొంతంగా అధికారంలోకి రాలేరని వైసీపీ అప్పుడే విమర్శలు మొదలుపెట్టింది. దీంతో చంద్రబాబు పొత్తుల అంశాన్ని పక్కనపెట్టి.. వచ్చే ఎన్నికల్లో సొంతంగానే అధికారంలోకి వచ్చే దిశగా ఆలోచన చేస్తున్నారు. నిజానికి పొత్తుల అంశాన్ని చంద్రబాబు పక్కనపెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. జనసేనతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలో వస్తే.. అప్పుడు అధికారం కూడా ఆ పార్టీతో పంచుకోవాల్సి వస్తుందనే భావన చంద్రబాబులో ఉందని సమాచారం.



    అదే జరిగితే.. రాజకీయంగా అంతగా బలంగా లేని జనసేన బలాన్ని తామే పెంచినట్టు అవుతుందని.. ఒకవేళ అధికారం కారణంగా జనసేన బలపడితే అది టీడీపీకే పెద్ద దెబ్బ అవుతుందని చంద్రబాబు భావించినట్టు సమాచారం. అదే జరిగితే భవిష్యత్తులో వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ కేంద్రంగా జరిగే రాజకీయాల్లో టీడీపీ వెనుకబడిపోతుందని.. ఈ రేసులో తన కుమారుడు, టీడీపీ యువనేత నారా లోకేశ్ పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడం అంత ఈజీగా జరిగే పని కాదని చంద్రబాబు ఆలోచనగా ఉందని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

    Shock to YCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీ మారిన కీలక నేత.. టీడీపీలోకి వలసలు మొదలయ్యాయా?

    Divyavani: టీడీపీలో మహిళలు పర్సనల్ పనులు చేస్తేనే.. దివ్య వాణి ఆడియో కాల్ లీక్..!

    మరోవైపు వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి ఆలోచించకుండా ముందుకు సాగాలనే ఆలోచనకు చంద్రబాబు రావడానికి ఆయన తనయుడు లోకేశ్ కూడా మరో కారణమనే వాదన వినిపిస్తోంది. మరికొద్ది నెలల్లోనే నారా లోకేశ్ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వైఎస్ జగన్ తరహాలోనే పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి నాయకుడిగా ఎదగాలనే ఆలోచనలో లోకేశ్ ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు కూడా ఎన్నికల నాటికి లోకేశ్ ఏ మేరకు ప్రజల్లో ఆదరణ పొందుతాడనే విషయంపై ఓ స్పష్టతకు వచ్చి.. ఆ తరువాత పొత్తుల గురించి ఆలోచించాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఒకవేళ లోకేశ్‌ తన ఇమేజ్‌ను పెంచుకుంటే.. అప్పుడు పొత్తుల గురించి ఆలోచించే అవకాశం టీడీపీకి ఉండకపోవచ్చన్నది చంద్రబాబు భావన అని టీడీపీలోని కొందరు చర్చించుకుంటున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Janasena, Nara Lokesh, TDP

    తదుపరి వార్తలు