హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Chandrababu Naidu: చంద్రబాబు కీలక నిర్ణయం ?.. ఆ వ్యూహకర్తను పక్కనపెట్టారా ?

Chandrababu Naidu: చంద్రబాబు కీలక నిర్ణయం ?.. ఆ వ్యూహకర్తను పక్కనపెట్టారా ?

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

AP Politics: ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం ప్రయత్నిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఓ ఎన్నికల వ్యూహకర్తను పక్కనపెట్టారనే చర్చ జరుగుతోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవలను వదులుకున్నారు. ఆయన సారథ్యంలోని ఐప్యాక్‌తో టీఆర్ఎస్ తెగతెంపులు చేసుకుంది. కొద్దిరోజుల క్రితమే ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. ఇందుకు కారణాలు ఏంటనే విషయం తెలియకపోయినా.. కేసీఆర్ మాత్రం ఐప్యాక్‌ను లైట్ తీసుకున్నట్టు అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం ప్రయత్నిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఓ ఎన్నికల వ్యూహకర్తను పక్కనపెట్టారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీ కోసం ఏపీలో రాబిన్ శర్మ(Robin Sharma) టీమ్‌తో పాటు సునీల్ కనుగోలు(Sunil Kanugolu) టీమ్ పని చేస్తోంది. అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్న సునీల్ కనుగోలు టీమ్‌ను చంద్రబాబు(Chandrababu Naidu) పక్కనపెట్టారనే చర్చ జరుగుతోంది. ఇందుకు కారణాలు ఏంటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  సునీల్ కనుగోలు టీమ్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కోసం పని చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న టీడీపీ .. ఇందుకోసం కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తకు దూరంగా కావడమే మంచిదనే భావనకు వచ్చిందని.. అందుకే చంద్రబాబు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే ఈ అంశంపై మరో వాదన కూడా రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. సునీల్ కనుగోలుతో పాటు రాబిన్ శర్మ టీమ్ కూడా టీడీపీ కోసం పని చేస్తోంది. ఒక రాజకీయ పార్టీ కోసం రెండు సంస్థలు పని చేయడం సరికాదనే ఉద్దేశ్యంతో సునీల్ కనుగోలు టీమ్.. టీడీపీకి దూరంగా ఉంటోందనే వాదన కూడా వినిపిస్తోంది.

  అయితే సునీల్ కనుగోలు టీమ్ టీడీపీకి దూరం కాలేదని.. కొద్దిరోజులు బ్రేక్ మాత్రమే తీసుకుందనే టాక్ కూడా వినిపిస్తోంది. కొంతకాలం తరువాత మళ్లీ టీడీపీ కోసం ఈ టీమ్ పని చేస్తుందనే చర్చ కూడా సాగుతోంది. మరోవైపు ఏపీలో ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవడంపై టీడీపీ ఫుల్లుగా ఫోకస్ చేస్తోంది. ఇప్పటి నుంచి కష్టపడితేనే ఎన్నికల నాటికి అధికార వైసీపీని బలంగా ఎదుర్కోగలగమని భావిస్తోంది.

  Vijayasai Reddy: ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  Breaking News: ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్.. 27 మందికి క్లాస్.. పేర్లు కూడా ప్రకటించిన జగన్

  అందుకే గతానికి భిన్నంగా ఎన్నికలకు కొన్ని నెలల ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల కోసం సిద్ధం చేయాలని చంద్రబాబు డిసైడయ్యారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులపై ఆయన ఓ నిర్ణయానికి వచ్చారని.. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా మార్చడానికి సిద్దపడిపోయారని టీడీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Chandrababu Naidu

  ఉత్తమ కథలు