హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Chandrababu: కుప్పంపై చంద్రబాబు వ్యూహం మారిందా ?.. జగన్ ఆలోచనకు భిన్నంగా..?

Chandrababu: కుప్పంపై చంద్రబాబు వ్యూహం మారిందా ?.. జగన్ ఆలోచనకు భిన్నంగా..?

సీఎం జగన్,చంద్రబాబు (ఫైల్)

సీఎం జగన్,చంద్రబాబు (ఫైల్)

TDP: జగన్ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టిన చంద్రబాబు.. ఈ విషయంలో తనదైన శైలిలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఏపీ రాజకీయాల్లో తన ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబును టార్గెట్ చేసేందుకు సీఎం వైఎస్ జగన్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న సీఎం జగన్.. ఇందుకోసం భిన్నమైన ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. గతంలో మరెవరూ చేయని విధంగా చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలో టార్గెట్ చేస్తున్నారు వైఎస్ జగన్(YS Jagan).ఈ రకంగా చంద్రబాబు గతానికి భిన్నంగా కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేలా చేయడంలో వైఎస్ జగన్ చాలావరకు సక్సెస్ అయ్యారనే చర్చ జరుగుతోంది. ఇక కొద్ది రోజుల క్రితం ఆయన కుప్పంలో (Kuppam) జరిగిన బహిరంగ సభలో పాల్గొని.. చంద్రబాబు(Chandrababu)  టార్గెట్‌గా విమర్శలు చేశారు. కుప్పంలో తమ పార్టీని గెలిపిస్తే.. గెలిచే అభ్యర్థి భరత్‌ను మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. జగన్ కుప్పం విషయంలో ఇంత దూకుడుగా ముందుకు సాగుతుండటంతో.. చంద్రబాబు కూడా తన సొంత నియోజకవర్గంపై మరింతగా దృష్టి పెడతారని చాలామంది భావిస్తున్నారు.

  అయితే జగన్ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టిన చంద్రబాబు .. ఈ విషయంలో తనదైన శైలిలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి అనుకూలమైన వాతావరణం నెలకొంటే.. కుప్పం మరోసారి తన కంచుకోటగానే ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే కుప్పంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడానికి బదులుగా రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చే విధంగా అనుకూలమైన వాతావరణం కల్పించడం ఎలా అనే అంశంపైనే ఎక్కువగా ఫోకస్ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

  తాను ఈ రకంగా ఆలోచించకుండా డిఫెన్స్‌లో పడేసేందుకే సీఎం జగన్ కుప్పంను టార్గెట్ చేశారని చంద్రబాబు నిర్ణయానికి వచ్చారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే ఏపీ ప్రభుత్వం కుప్పంపై ఎంతగా ఫోకస్ చేసినా.. తాను మాత్రం రాష్ట్రంలో వైసీపీని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని చంద్రబాబు గట్టిగా డిసైడయ్యారని సమాచారం.

  Lakshmi Parvati: ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చడంలో తప్పులేదు.. ఎన్టీఆర్‌పై జగన్‌కు గౌరవం ఉందన్న లక్ష్మీపార్వతి

  Kodali Nani: కొడాలి నాని మౌనానికి అర్థం ఏంటి..? విమర్శలపై ఎందుకు స్పందించడం లేదు?

  అయితే గతంతో పోల్చితే కుప్పంపై చంద్రబాబు ఎక్కువగానే దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని.. అయితే స్వయంగా ఆయన రంగంలోకి దిగకపోయినా.. బలమైన టీడీపీ నేతలు కొందరికి చంద్రబాబు ఈ రకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఒకవేళ జగన్ ఆశించినట్టు చంద్రబాబు కుప్పంపై మరింత ఫోకస్ పెడితే.. అప్పుడు ప్రభుత్వం కూడా కుప్పంలోనే ఆయనను దెబ్బకొట్టడంపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మొత్తానికి కుప్పం విషయంలో జగన్ ప్లాన్‌కు భిన్నంగా చంద్రబాబు వ్యూహం ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Kuppam, TDP

  ఉత్తమ కథలు