వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు ఎవరనే దానిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రచారం సహా ఇతర అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుందని భావిస్తున్న చంద్రబాబు.. ఎన్నికల రావడానికి కొన్ని నెలల ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసుకోవడంపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే దాదాపు 90 శాతం సీట్లలో పోటీ చేయాల్సిన అభ్యర్థులను ఫిక్స్ చేయడం.. వారికి ముందుగానే సమాచారం ఇవ్వాలని చంద్రబాబు(Chandrababu Naidu) నిర్ణయించుకున్నారని.. ఈ మేరకు ఇప్పటికే కొందరు నేతలకు ఆయన ఈ విషయాన్ని చెప్పారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ(TDP) అధినేత అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలకు కూడా పోటీ చేసే అంశంపై క్లారిటీ ఇచ్చారని టీడీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అనంతపురం జిల్లాలో బలమైన నేతలకు గుర్తింపు తెచ్చుకున్న జేసీ దివాకర్ రెడ్డి,(JC Diwakar Reddy) జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy).. గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. తమకు బదులుగా తమ కుమారులను ఎన్నికల్లో పోటీ చేయించారు. తాడిపత్రి నుంచి ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి, అనంతపురం ఎంపీ స్థానం నుంచి దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఈ ఇద్దరూ వైసీపీ నేతల చేతిలో ఓటమి చవిచూశారు.
దీంతో వచ్చే ఎన్నికల్లో కుమారులకు బదులుగా జేసీ బ్రదర్స్‌ను బరిలోకి దిగాలని చంద్రబాబు వారికి సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. రాబోయే ఎన్నికలు హోరాహోరీగా సాగే అవకాశం ఉందని.. కాబట్టి బరిలో కుమారులు కాకుండా మీరే ఉండాలని జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డికి చంద్రబాబు తేల్చి చెప్పినట్టు ఊహాగానాలు మొదలయ్యాయి.
Cm Jagan: టార్గెట్ 175..సీఎం జగన్ సంచలన నిర్ణయం..5.20 లక్షల మంది గ్రామ సారథుల నియామకం
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార రథం 'వారాహి'.. ఈ పేరు వెనక కథ ఇదే
ఈ విషయంలో వారసులను ఒప్పించుకోవాల్సిన బాధ్యతను కూడా చంద్రబాబు జేసీ బ్రదర్స్‌కే అప్పగించారని తెలుస్తోంది. మరోవైపు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్ తలదూర్చకుండా ఉండాలని కూడా టీడీపీ అధినేత సూచించారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో అయినా తమ సత్తా చాటాలని అనుకుంటున్న జేసీ బ్రదర్స్ వారసులకు చంద్రబాబు ముందుగానే చెక్ చెప్పినట్టు కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu Naidu, JC Diwakar Reddy, Jc prabhakar reddy