హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Gudivada Mahanadu: గుడివాడ మహానాడు వాయిదాతో చంద్రబాబు కీలక నిర్ణయం.. అప్పటివరకు నో ప్రోగ్రామ్స్..

Gudivada Mahanadu: గుడివాడ మహానాడు వాయిదాతో చంద్రబాబు కీలక నిర్ణయం.. అప్పటివరకు నో ప్రోగ్రామ్స్..

కొడాలి నాని, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

కొడాలి నాని, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

టీడీపీ (TDP) కి కొరుకుడు పడని కొయ్యగా.. చంద్రబాబు (Chandrababu) ను నిత్యం తిడుతూ వార్తల్లో నిలిచే మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) ఇలాకాలో మహానాడు నిర్వహించేందుకు టీడీపీ ప్లాన్ చేసింది. ఐతే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎలాగైనా అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తున్న తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party).. ఏడాది పాటు ప్రతి నియోజకవర్గంలో మినీ మహానాడు కార్యక్రమాలను నిర్వహించాలని స్కెచ్ వేసింది. ఈ క్రమంలో ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో మహానాడు నిర్వహించింది. ఇందులో భాగంగా టీడీపీకి కొరుకుడు పడని కొయ్యగా.. చంద్రబాబును నిత్యం తిడుతూ వార్తల్లో నిలిచే మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇలాకాలో మహానాడు నిర్వహించేందుకు టీడీపీ ప్లాన్ చేసింది. ఐతే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఎడతెరిపి లేని వర్షం, వాతావరణం అనుకూలoగా లేనందున కార్యక్రమం వాయిదా వేయాలని చంద్రబాబు సూచించారు. గుడివాడలో బుధవారం మహానాడు ఉన్న నేపథ్యంలో పార్టీ నేతలతో చర్చించిన చంద్రబాబు.. వర్షం కారణంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

ఐతే గుడివాడలో మహానాడు పూర్తైన తర్వాతే మరో కార్యక్రమం చేయపడతామంటూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొడాలి నాని జోరుకు చెక్ పెట్టేందుకే టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది. మహానాడు ద్వారా కొడాలికి కామెంట్స్ కు కౌంటర్ ఇవ్వడంతో పాటు ఈ నియోజకవర్గంలో నాయకత్వంపై కీలక ప్రకటన చేసే అవకాశముందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. వర్షం కారణంగా కార్యక్రమం వాయిదా పడటం ఒకింత నిరుత్సాహపరిచినా రెట్టించిన ఉత్సాహంతో నిర్వహిస్తామంటున్నారు.

ఇది చదవండి: వైసీపీలో ఏం జరుగుతోంది..? సీనియర్ నేతల కామెంట్స్ దేనికి సంకేతం..?


ఇదిలా ఉంటే గుడివాడలో టీడీపీ మహానాడుకు ముందు... కొడాలి నాని ఆపార్టీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నన్ను ఓడించడం కాదు, వచ్చే ఎన్నికల్లో కుప్పంలో గెలుస్తాడో లేదో చూసుకోవాలి అని అన్నారు. అంతేకాదు, దమ్ముంటే గుడివాడలో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. జగన్ ప్రభంజనంలో చంద్రబాబు కొట్టుకుపోతాడని హెచ్చరించారు. కొడాలికి మరో మాజీ మంత్రి పేర్ని నాని మద్దతిచ్చారు. గుడివాడకు కొడాలి నాని ఓ బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన అన్నారు. గుడివాడలో కొడాలి నానిని ఓడించడం తర్వాత సంగతని.. ముందు పోటీకి అభ్యర్థిని చూసుకోవాలని సెటైర్ వేశారు.

అంతకుముదు టీడీపీ నేత బుద్ధా వెంకన్న.. కొడాలి నానిపై మండిపడ్డారు. గుడివాడ లో టిడిపి బహిరంగ సభ అంటేనే కొడాలి నానికి చెమటలు పడుతున్నాయని ఆయన అన్నారు. చంద్రబాబు అంటేనే కొడాలి నానికి భయమని.. 2004లో చంద్రబాబు చేత్తోనే కొడాలి నాని బీ ఫామ్ తీసుకోలేదా అని ప్రశ్నించారు. వెన్నుపోటుకు పేటెంట్ హక్కుదారుడు జగన్ అని.. తల్లిని, చెల్లిని పక్కన పెట్టిన వెన్నుపోటు దారుడని విమర్శించారు. వెన్నుపోటు దారుడు జగనా లేక చంద్రబాబా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

First published:

Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Gudivada, Kodali Nani

ఉత్తమ కథలు