Current Shock in AP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యుత్ ఛార్జీల పెంపు (AP Electricity Charges) వ్యవహారంపై పొలిటికల్ మంటలు చెలరేగుతున్నాయి. విపక్షాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నాయి. ఉమ్మడి పోరాట కాకపోయినా.. పార్టీల పరంగా వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తున్నాయి. టీడీపీ దశలవారిగా ఉద్యామానికి సిద్ధమవుతంటే.. జనసేన అధినేత నేరుగా ఉద్యమంలో దిగాలని నిర్ణయించారు. మరోవైపు బీజేపీ -జనసేనతో కలిపి ఉద్యమాలకు సిద్ధమవుతోంది. అంతేకాదు ప్రతిపక్షంలో ఉండగా బాదుడే.. బాదుడు అంటూ ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) చేసిన విమర్శలు, కామెంట్స్ ను వైరల్ చేస్తన్నాయి. ప్రభుత్వం మాత్రం ప్రజల కోరిక మేరకు స్వల్పంగా విద్యుత్ ఛార్జీలు పెంచమంటోంది. ఈ రెట్టు పెరగడానికి గత సీఎం చంద్రబాబు కారణమంతూ వైసీపీ ఆరోపిస్తోంది.. ఇలా ఏపీ ప్రస్తుతం విద్యుత్ ఛార్జీల చుట్టే తిరుగుతున్నాయి..
ఈ విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లో్కేష్.. ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీలు, ప్రస్తుతం చేస్తున్న పనులను ఉదహరిస్తూ టీడీపీ నేత నారా లోకేష్ సెటైరికల్ వీడియోను ట్వీట్ చేశారు. వైసీపీ ప్రొడక్షన్స్ సమర్పించు అత్యద్భుతమైన సినిమా ‘జనం చెవిలో జగన్ పూలు’ ఏప్రిల్ 1న విడుదల అని లోకేష్ ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టారు.
వైసీపీ ప్రొడక్షన్స్ సమర్పించు అత్యద్భుతమైన సినిమా "జనం చెవిలో జగన్ పూలు".. ఏప్రిల్ 1 విడుదల.#BaadudeBaaduduByJagan pic.twitter.com/srXvFh3jtS
— Lokesh Nara (@naralokesh) April 1, 2022
ముఖ్యంగా జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే విషయంపై పోరాటం చేశారు. ఈ బాదుడేంటి అంటూ అప్పటి ప్రభుత్వంన్ని నిలదీశారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీల పెంపు అన్నదే ఉండదని స్పష్టమైన హామీ ఇచ్చారు.. కానీ ఇప్పుడు ఆ హామీని సీఎం జగన్ తుంగలోకి తొక్కారంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. అందుకే ఆయన అప్పట్లో చేసిన ఆరోపణలు సాక్ష్యాలుగా చూపిస్తతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో విద్యుత్ ఛార్జీల పెంపుపై భారీగా ట్రోల్స్ నడుస్తున్నాయి.
ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు, మద్యనిషేధం, ప్రత్యేక హోదా, సన్నబియ్యం పంపిణీపై ఇచ్చిన హామీలను ఇప్పుడు తుంగలో తొక్కారని.. ప్రజలను జగన్ ఏప్రిల్ పూల్ చేశారని నారా లోకేష్ విమర్శించారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలను పెంచి అడ్డగోలుగా ప్రజలను ప్రభుత్వం దోచుకుంటోందని నారా లోకేష్ విమర్శించారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీల పేరుతో బాదుడే బాదుడు జరుగుతోందని.. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ అంధకారప్రదేశ్‌గా మారిపోయిందని నారా లోకేష్ విమర్శలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.