హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Breaking News: టీడీపీ ఎంపీల రాజీనామా..! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా..! కారణం ఇదే?

Breaking News: టీడీపీ ఎంపీల రాజీనామా..! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా..! కారణం ఇదే?

టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తున్నారా..?

టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తున్నారా..?

Breaking News: తెలుగు దేశం పార్టీ ఎంపీలు రాజీనామాకు సిద్ధమయ్యారా..? వారితో పాటు రెబల్ ఎంపీ రఘురామ సైతం రాజీనామా చేయాలని ఫిక్స్ అయ్యారు.. చంద్రబాబు నాయుడితో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారా..? అసలు కారణం ఏంటి..?

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

Breaking News: ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh) ఎన్నికల్లో సంచలనం చోటు చేసుకోనుందా..? త్వరలోనే కీలక పరిణామం జరగనుందా.. ఢిల్లీ (Delhi) లో ప్రస్తుతం అదే చర్చ జోరుగా సాగుతోంది. త్వరలోనే తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party MPs) ఎంపీలు రాజీనామాకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వారితో పాటు వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామ (Raghu Rama Krishnamraju) సైతం తన పదవికి రాజీనామా చేయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. మరి అదే జరిగితే వైసీపీ (YCP) కాస్త ఢిపెన్స్ లో పడే అవకాశం ఉంటుంది. మరి వైసీపీ ప్రతి వ్యూహం ఎలా ఉంటుంది అన్నది కూడా ఆసక్తి పెంచుతుంది. అయితే ప్రస్తుతం బీజేపీ (BJP) తో పొత్తు కోరుకుంటున్న.. చంద్రబాబు నాయుడు.. పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించాలి అని నిజంగానే అనుకుంటారా.. అయితే  ఎంపీల రాజీనామా అస్త్రం దేనికోసం.. అసలు చంద్రబాబు మనసులో ఉ్న స్ట్రాటజీ ఏంటి..?

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు .. పార్టీ ఎంపీలతో సమావేశం అయ్యారు. అయితే ఈ భేటీ తరువాత.. ఎంపీల రాజీనామాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. వైసీపీపై ఒత్తిడి తేవాలి అన్నా.. ప్రస్తుతం ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకతను క్యాస్ చేసుకోవాలన్నా.. రాజీనామాలాంటి సంచలన నిర్ణయమే మేలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై బీజేపీ రియాక్షన్ ఎలా ఉంటుంది. చేస్తే ప్లస్ ఏంటి.. మైనస్ ఏంటి..? అన్ని చర్చించిన తారువాత ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

తెలుగు దేశం పార్టీలతో మీటింగ్ కు ముందు.. ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా చంద్రబాబుతో రఘురామ తెలిపినట్టు సమాచారం. వీరి భేటీలో పలు అంశాలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీ తరువాత రఘురామ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలతో పాటు రాజీనామాకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

ఇదీ చదవండి : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో చంద్రబాబు పాత్ర.. వారికి తెలియకుండా స్కాం జరగదన్న సజ్జల

ఢిల్లీలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఏపీకి ఇవ్వాల్సిన విభజనహామీలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల విషయంలో చంద్రబాబు ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు. పార్లమెంట్ శీతాకాలం సమావేశాల్లో ఎంపీలు ఏ విధంగా వ్యవహరించాలి? ఏఏ అంశాలపై మాట్లాడాలి? ఎంపీలుగా ఉన్న మీరు రాష్ట్రానాకి న్యాయం జరిగేలా ఎలా వ్యవహరించాలి? అనే పలు కీలక అంశాలపై చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు.

ఇదీ చదవండి : శ్రీవారి సన్నిధిలో భారత రాష్ట్రపతి.. ద్రౌపది ముర్ముకి శ్రీవారి ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించిన అర్చకులు

ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు రాజీనామా చేయిస్తారా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఎలా వ్యవహరించిందో ఎన్డీయే ప్రభుత్వంతో భాగస్వామిగా ఉన్న టీడీపీపై ఎలా ఒత్తడి తెచ్చిందో అదే వ్యూహాన్ని టీడీపీ కూడా అనుసరిస్తుందా? అనే ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశం ఉద్ధేశం కూడా అదే అని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈక్రమంలో తాను కూడా రాజీనామా చేయటానికి సిద్ధంగానే ఉన్నానంటూ చంద్రబాబుని కలిసి వైసీపీ ఎంపీ రఘురామ చెప్పటం విశేషం.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Jayadev Galla, MP raghurama krishnam raju, Rammohan naidu

ఉత్తమ కథలు