హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

MP Rammohan Naidu: ఇద్దరి దిగ్గజాలతో రామ్మోహన్ నాయుడు.. పార్లమెంట్ సమావేశాల్లో తొలి రోజు ఆసక్తికర ఘటనలు

MP Rammohan Naidu: ఇద్దరి దిగ్గజాలతో రామ్మోహన్ నాయుడు.. పార్లమెంట్ సమావేశాల్లో తొలి రోజు ఆసక్తికర ఘటనలు

మాజీ క్రికెటర్లతో ఎంపీ రామ్మోహన్

మాజీ క్రికెటర్లతో ఎంపీ రామ్మోహన్

MP Ram Mohan Naidu: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలిరోజు ఆసక్తికరంగా సాగాయి. క్రికెటర్ హర్భజన్ సింగ్, దర్శక ధీరుడు తండ్రి.. దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ లు ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు ఇద్దరు క్రికెటర్లతో కలిసి ఫోటో దిగిన ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...

    MP Ram Mohan Naidu: ఓ వైపు రాష్ట్ర పతి ఎన్నిక (President Elections).. మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలతో హస్తినలో రాజకీయ సందడి కనిపించింది. పార్లమెంట్ సమావేశాలు తొలిరోజే రాష్ట్రపతి ఎన్నికలు జరగడంతో పార్లమెంట్‌ హాలు నేతలతో కోలాహలంగా మారింది. ఈ నేపథ్యంలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇద్దరు మాజీ క్రికెటర్లతో టీడీపీ (TDP) ఎంపీ రామ్మోహన్‌నాయుడు (Rammohan Naidu) ఫోటో దిగారు. ఆ ఫోటోను ఆయనే సోషల్ మీడియా (Social Media) లో పోస్ట్ చేశారు. ఇటీవల రాజ్యసభ (Rajyasabha) కు పంజాబ్ కోటాలో ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajansingh) రాజ్యసభ సీటు దక్కించుకున్నారు. అటు ఇప్పటికే బీజేపీ తరఫున ఢిల్లీ ఎంపీగా గౌతమ్ గంభీర్ (Goutham Gambhir) కొనసాగుతున్నారు. వీళ్లిద్దరితో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఫోటో తీసుకున్నారు. ఇలా ముగ్గురు యువ ఎంపీలు ఫోటోలు దిగడం.. ముగ్గురికి ప్రత్యేక గుర్తింపు ఉండడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  తాజాగ రాజ్యసభ ఎంపీగా హర్భజన్ సింగ్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ఇద్దరు మాజీ క్రికెటర్ల మధ్య కూర్చుని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఫోటో దిగారు.

    ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన.. ఇద్దరు మాజీ క్రికెటర్ల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. గౌతం గంభీర్ ఇప్పటికే పొలిటిక‌ల్ కెరీర్ ప్రారంభించ‌గా.. హ‌ర్భజ‌న్ సింగ్ ఇప్పుడే రాజ‌కీయ జీవితం ప్రారంభించార‌ని రామ్మోహన్ నాయుడు చెప్పారు. పార్లమెంటు అనేది దేశ స‌మ్మిళిత స‌మూహానికి ప్రతీక అని.. ఇక్కడ అన్ని ప్రాంతాలు, మ‌తాలు, వర్గాలకు చెందిన వారు ఉంటార‌ని టీడీపీ ఎంపీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    మరోవైపు ఏపీ నుంచి వైసీపీ ఎంపీలు సైతం రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ తరఫున రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యేందుకు అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్ తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతికి ధన్యవాదాలు తెలుపుతూ విజయసాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. ఏపీ నుంచి మరోసారి తనను రాజ్యసభ సభ్యుడిని చేసిన గౌరవ సీఎం వైఎస్ జగన్ గారికి, శ్రీమతి వైఎస్ భారతమ్మకి ఈ సందర్భంగా తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

    ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ సినీ రచయిత వి.విజయేంద్ర ప్రసాద్ సైతం రాజ్యసభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎంపికయ్యారు. సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మీడియాతో మాట్లాడారు. తాను రాసిన కథలే తనను రాజ్యసభకు తీసుకొచ్చాయన్నారు. ఇది కథ కాదు.. నిజం అన్నారు. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు రావడం సంతోషంగా ఉందన్నారు.

    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Gautam Gambhir, Harbhajan singh, Rammohan naidu, TDP

    ఉత్తమ కథలు