5 State Assembly Elections Results Effect: ఊహించని స్థాయిలో దేశంలో మళ్లీ కమలం కసించింది. తమకు ఎదురులేదని మరోసారి నిరూపించింది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. ఐదు రాష్ట్రాల్లో నాలుగింట ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand)లో స్పష్టమైన మెజారిటీ కనబరించింది. మ్యాజిక్ మార్క్ చేరుకోకున్నా.. ఇతరుల సాయంతో గోవా, మణిపూర్లోనూ మళ్లీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో వరుసగా రెండోసారి భారీ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ ఎన్నికల్లో విజయంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ చరిత్ర సృష్టించబోతున్నారు. సీఎంగా యోగి రెండో సారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఐతే 37 ఏళ్ల తర్వాత అధికారం నిలబెట్టుకున్న సీఎంగా చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్కు చెందిన ఎన్డీ తివారి 1985 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత ఎవరూ వరుసగా రెండోసారి సీఎంగా పనిచేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు యోగి ఆ ఘనత సాధించారు.
అయితే ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలు ఏపీ పైనా ప్రభావం చూపిస్తున్నాయా..? ఎందుకంటే..? అంటూ ఈ ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీపీ సమావేశం జరిగింది.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ రామ్మోహన్ నాయుడు.. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏపీకి నష్టం అన్నారు.. ఈ ఫలితాలు చూసి సీఎం జగన్ మరింత భయపడతారని జోస్యం చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రాన్ని అడగలేని పరిస్థితిలోకి జగన్ వెళ్తారన్నారు.. బీజేపీ బలపడే కొద్దీ తనపై ఉన్న కేసులతో కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితిలో సీఎం జగన్ ఉంటారన్న ఆయన.. జగన్ పై ఉన్న కేసుల భయంతో రాష్ట్రానికి రావాల్సిన హక్కులను వైసీపీ ఎంపీలు సైతం అడగలేరని ఆరోపించారు.
ఇదీ చదవండి మత్స్యకారుల పంట పండింది.. వలకు చిక్కిన బాహుబలి చేప.. బరువు తెలిస్తే షాక్ అవుతారు
అలాగే విభజన సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులపై 28 మంది ఎంపీలున్నా వైఎస్ జగన్ ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని మండిపడ్డారు రామ్మోహన్నాయుడు.. అనేక రాష్ట్రాల్లో విజయం సాధిస్తున్న బీజేపీ.. ఏపీలో ఎందుకు బలపడట్లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.. ఏపీ ప్రజలకు బీజేపీ చేయాల్సిన న్యాయం చేయలేదు కాబట్టే ఇక్కడ 1శాతం ఓటు కూడా రావట్లేదన్న ఆయన.. సంఖ్యా బలం తక్కువ ఉన్నా టీడీపీ ఎంపీలు రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలు బలహీనపడుతున్నాయనే వాదనలో నిజం లేదన్న టీడీపీ ఎంపీ.. ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీల సాధనలో వైసీపీపై ఒత్తిడి తెచ్చి హామీలు గుర్తు చేస్తామన్నారు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రాన్ని కొరతామన్న ఆయన.. కేంద్ర నిధులు దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్న తీరును పార్లమెంట్లో లేవనెత్తుతామని వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Rammohan naidu, Srikakulam, TDP