మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ముగింపు సందర్భంగా ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ఒకానొక సందర్భంలో పడిపడి నవ్వారు. చంద్రబాబు మాట్లాడుతుండగా... ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళంలో టీడీపీ చేసిన అభివృద్ధిపై మాట్లాడుతూ చంద్రబాబు.. శ్రీకాకుళం జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ చేశామన్నారు. దీంతో స్పీకర్ కల్పించుకొని ఏంటండి అని ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు కాస్త తడబడటంతో.. ఒక్కసారిగా జగన్ పడి పడి నవ్వారు. చాలాసేపు నవ్వుతూ ఉన్నారు. ఈ వీడియోను టీడీపీ ఎంపీ కేశినేని నాని పోస్టు చేస్తూ... జగన్ పై విమర్శలు గుప్పించారు. 'పిచ్చి వాడి చేతిలో రాయి జగన్ చేతిలో రాజధాని రెండిటికీ ఏమి తేడా లేదు.. ఎటు విసురుతారో ఎక్కడ పడుతుందో దేవుడికి కూడా తెలియదు' అని తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Assembly, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Kesineni Nani, TDP