హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

మరోసారి ఫేస్ బుక్‌లో సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎంపీ

మరోసారి ఫేస్ బుక్‌లో సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎంపీ

విజయవాడ ఎంపీ కేశినేని నాని(ఫైల్ ఫోటో)

విజయవాడ ఎంపీ కేశినేని నాని(ఫైల్ ఫోటో)

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైనప్పటి నుంచి విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన కేశినేని నాని, ఫేస్ బుక్ వేదికగా, పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు,

టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేస్ బుక్ వేదికగా ఆయన ..మరో సంచలన పోస్టు పెట్టారు. ఎవరి దయా దక్షిణ్యాల మీద ఆధారపడే వ్యక్తిని తాను కాదన్నారు కేశినేని. "నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు. నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం. నిజాన్ని నిజమని చెబుతాను. అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను. మంచిని మంచి అనే అంటాను. చెడును చెడు అనే అంటాను. న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను. అన్యాయాన్ని అన్యాయమని మాట్లాడతాను. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మాత్రమే తెలిసిన వాడిని. నిండు సభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వాడిని నేను. నిండు సభలో మోడీని నిలదీసిన వ్యక్తిని. భయం నా రక్తంలో లేదు. రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదు. ఎవరెన్ని పెడార్థాలు తీసిన, వీపరీతార్థాలు తీసిన లెక్క చేసే వాడిని కాదు" అని ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు. దీంతో ఇప్పుడీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైనప్పటి నుంచి విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన కేశినేని నాని, ఫేస్ బుక్ వేదికగా, పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఆయన ఏపీ మంత్రి కొడాలి నానిపై కూడా ఆసక్తికర ట్వీట్ చేశారు. కోడాలి నాని తనకు మంత్రి పదవి దక్కేలా చేసిన టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమాకు జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలన్నారు. కేశినేని పెట్టిన ఈ పోస్టు టీడీపీలో పెద్ద దుమారమే రేపింది. దేవినేని ఉమాను .. కేశినేని నాని తన ఫేస్ బుక్ వ్యాఖ్యలతో ఇరుకునే పెట్టే ప్రయత్నం చేశారని ఆ పార్టీ నేతలే జోరుగా చర్చించుకున్నారు. ఇప్పుడు తాజాగా చేసిన ఫేస్ బుక్ వ్యాఖ్యలు మరి ఎలాంటి కలకలం రేపుతాయో చూడాలి.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Kesineni Nani, TDP, Vijayawada

ఉత్తమ కథలు