హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

వైసీపీ నేతలే పార్టీ మారిపోతారు.. టీడీపీ ఎమ్మెల్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

వైసీపీ నేతలే పార్టీ మారిపోతారు.. టీడీపీ ఎమ్మెల్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆనం రామనారాయణరెడ్డి ఈనెల 6న మీడియాతో మాట్లాడుతూ... కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు మాఫియాలకు అడ్డాగా మారిందన్నారు

అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు చిట్ చాట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు ఇప్పుడు ఆలోచించాల్సింది టీడీపీ ఎమ్మెల్యేల గురించి కాదన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల గురించే ఆలోచించాలంటూ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి హితవు పలికారు.

అంతకుముందు మట్లాడుతూ జగన్ వల్లే టీడీపీకి ఇంకా ప్రతిపక్ష హోదా కొనసాగుతోందని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.శాసన సభ్యత్వానికి ఇబ్బంది లేదని జగన్ హామీ ఇస్తే 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీది మూడో స్థానమేనంటూ కోటంరెడ్డి జోస్యం చెప్పారు. 2024 ఎన్నికలు వైసీపీ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా పోటీ జరుగుతుందన్నారు. ఆనం కామెంట్లపై నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు కోటంరెడ్డి.  నా అభిప్రాయాలను పార్టీ వేదికల మీదే వినిపిస్తానన్నారు.

దీనిపై స్పందిస్తూ అసెంబ్లీలాబీలో మాట్లాడారు టీడీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు. అసంతృప్తితో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీ- టీడీపీల్లో చేరడానికి సిద్దంగా ఉన్నారన్నారు. ఆనం వ్యాఖ్యల వెనుకున్న అర్ధమేంటో కోటంరెడ్డి చెప్పాలన్నారు. మాఫియాలా తయారయ్యారని వైసీపీ సీనియర్ ఎమ్మెల్యేలే అంటున్నారని చురకలంటించారు.

ఆనం రామనారాయణరెడ్డి ఈనెల 6న మీడియాతో మాట్లాడుతూ... కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు మాఫియాలకు అడ్డాగా మారిందన్నారు. మాఫియాలు, కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువైపోయారని.. లిక్కర్, బెట్టింగ్, లాండ్, శాండ్, ఏ మాఫియా కావాలన్నా నెల్లూరు వస్తే దొరుతుకుందన్నారు. కొంతమంది మాఫియా గ్యాంగ్‌లు, గ్యాంగ్‌స్టర్‌లకు నెల్లూరును అప్పగించారని బయటకు చెప్పుకోలేక ప్రజలు కుమిలిపోతున్నారని వ్యాఖ్యానించారు. తాజాగా ఆనం రామనారాయణరెడ్డి సోదరుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డిని నెల్లూరు జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా నియమిస్తూ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

First published:

Tags: Anam Ramanarayana Reddy, AP Assembly, Ap cm jagan, AP Politics, Tdp

ఉత్తమ కథలు