హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

జగన్‌ను జైలుకు పంపే ప్లాన్ ఆయనదే... టీడీపీ నేత ఆరోపణలు

జగన్‌ను జైలుకు పంపే ప్లాన్ ఆయనదే... టీడీపీ నేత ఆరోపణలు

సీఎం జగన్(ఫైల్ ఫోటో)

సీఎం జగన్(ఫైల్ ఫోటో)

వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు.

  ఆస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు సీబీఐ కోర్టు నిరాకరించడంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తనదైన శైలిలో స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఈ అంశంపై స్పందించిన బుద్దా వెంకన్న... వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డిని టార్గెట్ చేశారు. ఇంతకాలం విజయసాయిరెడ్డి ఢిల్లీలో తిప్పిన చక్రం వెనకున్న రహస్యాన్ని అర్థం చేసుకోలేకపోయామంటూ వ్యాఖ్యానించారు. మీ వాడిని లోపల వేయించి సీఎం కూర్చీని కొట్టేయాలనే ప్లాన్ ను పక్కాగా అమలు చేస్తున్నారుగా అంటూ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

  16 సంవత్సరాల శిక్షలో 16 నెలలు పోతే ఎంతో లెక్కల మాస్టారు కాబట్టి మీరే చెప్పాలంటూ ఎద్దేవా చేశారు. ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డికి, బుద్దా వెంకన్నకు మధ్య చాలాకాలం నుంచి మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, Buddha venkanna, TDP, Vijayasai reddy, Ysrcp

  ఉత్తమ కథలు