Home /News /andhra-pradesh /

AP POLITICS TDP MLAS BALAKRISHNA ANS GORANTLA BUCHAI CHOWDARY NOT ATTEND PRESIDENT VOTING 2022 NGS GNT

President Polls 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయని ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు.. బాలయ్య ఎందుకు రాలేదంటే..?

రాష్ట్రపతి ఎన్నికలకు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యే దూరం

రాష్ట్రపతి ఎన్నికలకు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యే దూరం

President Polls 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపిన తెలుగు దేశం నేతలు.. ఇవాళ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ ఎన్నికకు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు.. వారిలో ఒకరు బాలయ్య కావడంతో.. రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది.

ఇంకా చదవండి ...
    Anna Raghu, News18, Amaravati

    President Polls 2022: భార‌త రాష్ట్రప‌తి అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలు రెండు ఎన్డీఏకు మద్దతు తెలిపాయి. దీంతో ఏపీలో ఉన్న 175 ఓట్లు ద్రౌపది ముర్ముకే  (Draupadi Murmu) పడాల్సి ఉంది. ఇప్పటికే ఎన్నిక కోసం దేశవ్యాప్తంగా పోలింగ్ ముగిసింది. ఢిల్లీలోని పార్ల‌మెంటులో ఎంపీలు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అయితే సోమ‌వారం మ‌ధ్యాహ్నానికే దాదాపుగా పోలింగ్ ముగిసింద‌నే చెప్పాలి. ఇక ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విషయానికి వస్తే.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party).. ఎన్డీఏ అభ్యర్థిగా తమ మద్దతు తెలిపింది. అందులో భాగంగా టీడీపీ నేతలు తమ ఓటు హక్కును ఇవాళ వినియోగించుకున్నారు. ఏపీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే.. అందులో ఇప్పటికే ముగ్గురు జగన్ కు జై కొట్టి టీడీపీ (TDP)కి దూరమయ్యారు. ఉన్నవారిలోనూ కొందరిపై అనుమానాలు ఉన్నాయి. దీంతో టీడీపీ తరపున 21 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా అందరి చూపు ఈ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) ఓటు వేస్తారా వేయరా.. ఎప్పటిలాగే సైలెంట్ గా ఉంటారా అనే ఉత్కంఠ పెరిగింది. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి (
    Vizag Steel Plant Protest) మద్దతుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. అది స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉంది. కొంత కాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన మాత్రం.. అధినేత చంద్రబాబు (Chandrababu) తో కలిసి ఓటింగ్ లో పాల్గొన్నారు. కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఓటింగ్ లో పాల్గొనలేదు..

    టీడీపీ నుంచి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి (Gorantla Butchaiah Chowdary), హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌లేదు. దీంతో వీరిద్దరు ఎందుకు ఓటు వేయలేదని అంతా ఆరా తీస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం. చాలా రోజుల క్రిత‌మే గోరంట్ల అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఇంకా ఆయ‌న అమెరికా నుంచి తిరిగి రాలేదు. ఈ కార‌ణంగానే ఆయ‌న రాష్ట్రప‌తి ఎన్నిక‌ల ఓటింగ్‌లో పాల్గొన‌లేదు. 

    ఇక బాల‌కృష్ణ కూడా ఇటీవ‌లే విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఆయన సినిమా షూటింగ్ కోసం  విదేశాల టూర్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇది చాలా ముందే అనుకున్న షెడ్యూల్ కావడంతో ఆయన తిరిగి రావడం కుదరలేదు అంటున్నారు. దీంతో ఆయ‌న కూడా ఓటింగ్‌కు హాజ‌రు కాలేక‌పోయారు. వీరిద్దరు మినహా టీడీపీ నుంచి అంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజాగా అందుతున్న సమాచాం ప్రకారం.. 169 మంది త‌మ ఓట్లు వేశారని తెలుస్తోంది.. మిగిలిన వారిలో గోరంట్ల‌, బాల‌కృష్ణ‌ల‌ను మిన‌హా మిగిలిన వారు ఎందుకు ఓటింగ్ కు దూరంగా ఉన్నారన్నది తెలియాల్సి ఉంది.

    ఇదీ చదవండి : జగన్ సర్కార్ కు మరో షాక్.. ఆ నిధులు ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలకు బదిలీ చేయాలన్న సుప్రీం

    ఉదయాన్నే ప్రారంభమైన సీఎం జగన్ తొలిగా ఓటు వేసారు. ఆయన తరువాత స్పీకర్.. మంత్రులు ఓటు వేసిన వారిలో ఉన్నారు. మరోవైపు టీడీపీ కార్యాలయంలో సమావేశమైన పార్టీ ఎమ్మెల్యేలు కలిసి అసెంబ్లీకి చేరుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు అసెంబ్లీలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత చంద్రబాబు.. మందడం దగ్గర అమరావతి రైతులతో కొద్ది సేపు మాట్లాడారు. వారంతా రాజధాని తరలింపు పైన ఆందోళన వ్యక్తం చేసారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని.. అధైర్య పడవద్దంటూ చంద్రబాబు ధైర్యం చెప్పారు. కాగా, రైతులు చంద్రబాబుకు ఆకుపచ్చ కండువా కప్పారు. రాజధాని తరలించే శక్తి ఎవరికీ లేదని చంద్రబాబు వారితో చెప్పుకొచ్చారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Nandamuri balakrishna, President Elections 2022, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు