Home /News /andhra-pradesh /

AP POLITICS TDP MLA GORANTLA BUTCHAIAH CHOWDARY KEY COMMENTS ON ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY NGS

TDP MLA: సీఎం జగన్ మనసున్న నేత అంటున్న టీడీపీ ఎమ్మెల్యే..? ఇంకా ఏమన్నారంటే?

ఏపీ సీఎం జగన్ (ఫైల్ ఫొటో)

ఏపీ సీఎం జగన్ (ఫైల్ ఫొటో)

TDP MLA: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ - ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య ఢీ అంటే ఢీ అనే వతావరణమే తప్పా.. అసలు ఒకరి పై ఒకరు పొగడ్తలు అన్నది ఏ సందర్భంలోనే వినిపించదు.. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే మాత్రం.. జగన్ మనసున్న నేత అంటూ ట్వీట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India
    TDP MLA: సాధారణంగా తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నేతలు అంటే అధికార వైసీపీ (YCP) పై నిప్పులు చెరుగుతారు. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) తీరుపై నిత్యం విమర్శలు చేస్తూనే ఉంటారు. ఏ పథకం పెట్టినా ముందుకు లోపాలను వెలుగులోకి తెస్తారు. ప్రస్తుత్తం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో టీడీపీ (TDP) - వైసీపీ (YCP) మధ్య కేవలం రాజకీయ వైరం కాదు.. శత్రుత్వమే పెరిగింది. అందులో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah choudary) అయితే ఏ మాత్రం అవకాశం సీఎం జగన్ ను, వైసీపీ ప్రభుత్వాన్ని తనదైన శైలిలో టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడంలో, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్టైలే డిఫరెంట్ గా ఉంటుంది. నిత్యం వైసీపీ ప్రభుత్వ తీరుపై, వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై, రాష్ట్రంలో ప్రజల సమస్యలపై విరుచుకు పడే ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియా లో తనకు మాత్రమే సొంతమైన స్టైల్లో .. సెటైర్లు వేస్తుంటారు.



    నిత్యం వ్యంగ్యం ఆసక్తికరమైన పోస్టులతో ఆలోచించేలా చేసే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఎప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటారు. అయితే ఇప్పుడు ఆయన ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. అది కూడా సీఎం జగన్ మనసున్న నేత అని వైసీపీ నేతలు అంటే.. అవును జగన్ మనసున్నా నేత అంటూ కామెంట్ చేశారు.ః

    ఆయన ట్వీట్ లో ఏం చెప్పారంటే..? అవును ప్రజలు కూడా అదే విషయాన్ని అంగీకరిస్తున్నారని.. కాకుంటే మన 'సున్నా' నేత అని భావిస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతి కి 'సున్నం' పూసిన మనసున్న నాయకుడు అని ప్రజలు చెప్పుకుంటున్నారు అంటూ సెటైర్లు వేశారు. దీంతో ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ వైరల్ అవుతోంది.



    సీఎం జగన్ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి సున్నాగా మారిందని, అందుకే మన సున్నా నేత అంటూ సెటైర్లు వేశారు గోరంట్ల. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న సమయంలో, రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్ల పరిస్థితి పై కూడా కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. ఇప్పటికే అనేకమార్లు రోడ్ల సమస్యలపై విరుచుకుపడిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాజాగా మరోమారు సోషల్ మీడియాలో మండిపడ్డారు.

    ఇదీ చదవండి : ఢిల్లీలో బాబు వంగి వంగి దండాలు పెట్టారంటూ ట్వీట్.. సైబర్ సెల్ కు ఫిర్యాదు.. ఎందుకంటే?

    ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆంధ్ర ప్రదేశ్ రోడ్ లు స్విమ్మింగ్ పూల్స్ గా మారాయన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. అవి రోడ్డా.. లేక నీటి కుంటనా అంటూ ప్రశ్నించారు. మీరు 'బటన్లు' నొక్కడం ఏమో కాని జనాల టైర్ల 'బటన్లు' పోతున్నాయి వైయస్ జగన్ అంటూ సెటైర్లు వేశారు . జనాల ఒళ్ళు హూణం అయిపోతుంది అంటూ గోరంట్ల తనదైన స్టైల్లో మండిపడ్డారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, TDP, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు