Home /News /andhra-pradesh /

AP POLITICS TDP MLA GANTA SRINIVASA RAO HOT COMMENTS ON CM JAGAN AND TDP WHAT HIS STRETEGY NGS VSP

Ganta Srinivasa Rao: టీడీపీలో మోగిన గంట.. అనూహ్యంగా సీఎంపై సంచలన వ్యాఖ్యలు.. ఆయన స్ట్రాటజీ ఏంటి?

గంటా శ్రీనివాసరావు (ఫైల్)

గంటా శ్రీనివాసరావు (ఫైల్)

Ganta Srinivasa Rao: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు వ్యూహం మార్చారా..? ఎమ్మెల్యేగా నెగ్గిన తరువాత తొలిసారి సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. అంతేకాదు సొంత పార్టీకి అనకూలంగా కూడా తొలిసారి వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారు తెలుసా..?

ఇంకా చదవండి ...
  Ganta Srinivasa Rao: టీడీపీ (TDP) ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa rao) వ్యూహం మార్చారా..? మొన్నటి వరకు టీడీపికి దూరంగా ఉంటూ వచ్చారు..? అంతేకాదు.. ఓవైపు వైసీపీ (YCP) నేతలు అంతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సహా ఇతర నాయకులపై విరుచుకు పడ్డారు. ఓ రేంజ్ లో తిట్ల వర్షం కురిపించారు. గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa rao) వైసీపీని ఒక్క మాట అనలేదు.. జగన్ పాలపై ఇటు విశాఖ (Visakha) వాసులు, అటు టీడీపీ సహా విపక్షాలు అన్నీ విమర్శలు చేస్తున్నా.. గంటా శ్రీనివాసరావు పల్లెత్తు మాట అనలేదు. అంతేకాదు టీడీపీ అదినేతే చంద్రబాబు స్వయంగా మీటింగ్ కు పిలిచినా హాజరు కాలేదు. దీంతో ఆయన వైసీపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. అక్కడ ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy), అప్పటి మంత్రి అవంతి శ్రీనివాసు (Avanti Srinivas) అడ్డుపడుతూ వచ్చారు. దీంతో ఆయన వైసీపీలోకి వెళ్లడం ఆలస్యం అవుతోందని వార్తలు వినిపించాయి. ఇప్పుడు విజయసాయి రెడ్డి పార్టీ వ్యవహారాలకు కాస్త దూరంగా ఉన్నారనే ప్రచారం ఉంది. అలాగే అవంతి శ్రీనివాస్ మాజీ అయ్యారు. నిజంగా గంటా వైసీపీలో చేరాలి అనుకుంటే అందుకే ఇదే సరైన సమయం.. కానీ ఇలాంటి సమయం అనూహ్యంగా ఆయన సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.

  వైసీపీలో అవకాశం లేకుంటే.. గంటా శ్రీనివాసరావు.. ఇటు బీజేపీలో లేదా.. జనసేనలో చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నారనే వార్తలు వినిపించాయి. ఆ వార్తలను సైతం ఆయన ఖండించింది లేదు. మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ అందుకు ఒప్పుకోక పోతే.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్చంలో ఆయన ఇప్పుడు తన వ్యూహం మార్చారనే ప్రచారం ఉంది. టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినప్పుడు.. ఇక పార్టీ మారాల్సిన అవసరం ఉండదని.. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారని గంటా అనుచరులు చెబుతున్నమాట..

  ఇదీ చదవండి: ఎన్నికల సమరానికి సై అంటున్న బీజేపీ.. జగన్ తో ఢీ అంటే ఢీ

  అందుకే గంటా శ్రీనివసారవు..లాంగ్ గ్యాప్ తరువాత మరోసారి రాజకీయంగా తెర మీదకు వచ్చారు. ఈ సారి ముఖ్యమంత్రి జగన్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా జరిగిన కేబినెట్ విస్తరణ లక్ష్యంగా ఆరోపణలు కురిపించారు. సీఎం జగన్ బలవంతుడు కాదని.. చాలా బలహీనుడని తాజా కేబినెట్ తో తేలింది అన్నారు. అందుకే కేబినెట్ కూర్పుపై దిష్టిబొమ్మల దగ్డం..టైర్లు కాల్చుతూ ఆందోళనలు చేయటం తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారి చూశాను అన్నారు. అసలు కొత్త కేబినెట్ లో ఎక్కడా సమతుల్యత లేదన్నారు. అలాగే ఓ సీఎం భయపడుతూ కేబినెట్ కూర్పు చేయడం కూడా ఇదే తొలిసారి అన్నారు.

  ఇదీ చదవండి: టీ కప్పులో తుఫాను చల్లారిందా? సీఎం అలర్ట్ తో అసంతృప్తులు దారికొచ్చారా? వైసీపీలో ఏం జరుగుతోంది

  అలాగే ఎన్నికలకు రెండేళ్ల ముందు బీసీలకు మంత్రి పదవులు ఇస్తే.. ఆ వర్గం నేతలు వైసీపీని నమ్ముతారు అనుకోవడం భ్రమే అన్నారు గంటా. వైసీపీ ఎన్ని కుయుక్తులు చేసినా..బీసీలు ఎప్పుడూ టీడీపీతోనే ఉంటారని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాదు గతంలో దూరమైన వర్గాలు తిరిగి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని అంశాల నుంచి డైవర్ట్ చేయటం కోసమే ఆకస్మికంగా ఎటువంటి కసరత్తు లేకుండా జిల్లాల విభజన పూర్తి చేసారని విమర్శించారు. జగన్ జిల్లాల విషయంలో తీసుకున్న నిర్ణయాల పైన సొంత పార్టీ ఎమ్మెల్యేలే నిరసనలు చేసారని గంటా చెప్పుకొచ్చారు. 26 జిల్లాలు ఏర్పాటు చేసామని గొప్పగా చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం..విశాఖ..విజయవాడ..తిరుపతి సహా 8 జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని విశ్లేషించారు.

  ఇదీ చదవండి: పున్నమి వెన్నెలల్లో సీతారాముల కళ్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

  ముఖ్యంగా ముఖ్యమైన.. పెద్ద నగరమైన విశాఖకు మంత్రి పదవి ఇవ్వకపోవటం సరి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఎన్నికలకు ఆరు నెలల ముందే పొత్తులు.. సర్దుబాట్లు అంశం పైన చర్చలు ఉంటాయని చెప్పారు. దీంతో పాటు త్వరలోనే టీడీపీలోకి భారీగా చేరికలు ఉంటాయని జోస్యం చెప్పారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Ganta srinivasa rao, TDP, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు