హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Assembly: అసెంబ్లీలో జగన్ లెక్కలపై టీడీపీ జోకులు.. నేతల సస్పెన్షన్ పై ఆగని దుమారం

AP Assembly: అసెంబ్లీలో జగన్ లెక్కలపై టీడీపీ జోకులు.. నేతల సస్పెన్షన్ పై ఆగని దుమారం

అసెంబ్లీలో సీఎం జగన్

అసెంబ్లీలో సీఎం జగన్

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రచ్చ రచ్చ అవుతున్నాయి. జంగారెడ్డి గూడెం మరణాలపై అసెంబ్లీ అట్టుడికింది. ఐదుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేసినా వాతావరణం సద్దుమణగలేదు. అయితే అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పిన లెక్కలపై టీడీపీ సెటర్లు వేస్తోంది.

ఇంకా చదవండి ...

  AP Assembly: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ హాట్ హాట్ గా సాగుతోంది. జంగారెడ్డి గూడెం మరణాలపై అసెంబ్లీ అట్టుడుకుతూనే ఉంది. ఆఖరికి ఏపీ అసెంబ్లీలో ఐదుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడితో సహా ఐదుగురిని సస్పెండ్ చేయాలని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా.. తీర్మానం పాస్ అయినట్లు స్పీకర్ వెల్లడించారు. ఈ సెషన్ అంతా సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. సస్పెన్షన్ కు గురైన వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల, పయ్యావుల, గోరంట్ల, వీరాంజనేయస్వామిలు ఉన్నారు. తమను ఎందుకు సస్పెండ్ చేస్తున్నారంటూ స్పీకర్ తో వారు వాగ్వాదానికి దిగారు. ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తితో టీడీపీ సభ్యులు ఇలా చేయడం కరెక్టు కాదని స్పీకర్ తెలిపారు. వెంటనే టీడీపీ సభ్యులను బయటకు తీసుకెళ్లాలని మార్షల్స్ కు సూచించారు. దీంతో ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిపోతున్న రాజకీయంలో తాజాగా జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకున్న కల్తీ సారా మరణాలు ట్విస్ట్ ఇచ్చాయి.

  టీడీపీ ఆరోపణలపై స్పందించిన సీఎం జగన్ ఓ లెక్క చెప్పారు. ఆయన ఏమన్నారంటే..? దేశవ్యాప్తంగా రోజుకు రెండుశాతం సహజమరణాలు చోటు చేసుకుంటుంటాయని అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో దాదాపు 50 వేల జనాభా కలిగిన జంగారెడ్డిగూడెంలోనూ 2 శాతం చొప్పున 90 సహజ మరణాల వరకూ చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. అలాంటి చోట అనుకోకుండా ఇక్కడ 18 మంది చనిపోతే విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని అసెంబ్లీలో జగన్ మండిపడ్డారు. జంగారెడ్డిగూడెంలో మరణాలపై డిప్యూటీ సీఎం, ఆరోగ్యమంత్రి ఆళ్లనాని ప్రకటన చేసిన తర్వాత కూడా విపక్ష టీడీపీ అసెంబ్లీని అడ్డుకోవడంతో చివర్లో జగన్ స్పందించారు. సహజమరణాలను కూడా టీడీపీ రాజకీయం చేస్తోందంటూ సీఎం చేసిన విమర్శలపై.. టీడీపీ సైతం కౌంటర్లు ఇస్తోంది.

  ఇదీ చదవండి : పవన్ ఎప్పుడు పార్టీలోకి వస్తారా అని ఎదురు చూపు..? చిరంజీవికి నమస్కారం పెట్టకపోవడం సమస్కారమా..? మంత్రి సెటైర్లు

  సీఎం జగన్ చేసిన ప్రకటనపై టీడీపీ సెటైర్లు కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీకి చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ జనాభా సుమారు 54880 మందని సీఎం జగన్ చెప్పారని, అందులో రోజూ సరాసరిన కనీసం 90 మంది సాధారణంగానే చనిపోతారని కూడా చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇలా సాధారణంగా రోజూ 90 మంది చనిపోతే.... జంగారెడ్డిగూడెంలో జనాభా మొత్తం సుమారు 610 రోజుల్లో చనిపోతారుగా సీఎం జగన్ గారు అంతేనా అంటూ ట్వీట్చేశారు అయ్యన్న పాత్రుడు..

  మరోవైపు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ పైనా దుమారం ఆగడం లేదు.. ప్రభుత్వానికి సమాధానం చెప్పే దమ్ము లేకపోవడంతోనే ఇలా తమను సభ నుంచి బయటకు పంపించేశారని.. అయినా సభలో ఉన్న సభ్యులంతా.. ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తారని.. ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పకపోయినా.. ప్రజలకు అయితే జగన్ సమాధానం చెప్పక తప్పదు అంటున్నారు టీడీపీ నేతలు..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, TDP, Ycp

  ఉత్తమ కథలు