హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TDP on Kodali Nani: కొడాలి నాని అలా పోల్చిన తెలుగు తమ్ముళ్లు.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు..

TDP on Kodali Nani: కొడాలి నాని అలా పోల్చిన తెలుగు తమ్ముళ్లు.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు..

కొడాలి నానిపై నిరసన సెగలు

కొడాలి నానిపై నిరసన సెగలు

TDP on Kodali Nani: ఏపీలో మాటల యుద్ధం ఇప్పుడు తారా స్థాయికి చేరింది. బూతులు కూడా హద్దులు దాటుతున్నాయి. నారా లోకేష్ పై అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన కొడాలిపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసనలకు దిగారు. కొందరు టీడీపీ నేతలు అయితే కొడాలిని అలా పొల్చారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Gudivada, India

  TDP on Kodali Nani: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా అధికార వైసీపీ (YCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటేసింది. బూతులు కూడా పీక్ లెవెల్ కు చేరాయి.. ముఖ్యంగా మాజీ మంత్రి కొడాలి నాని (Ex Minster Kodali Nnai) తీరుపై తెలుగు తమ్ముళ్లు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. అందుకు ప్రధాన కారణం.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), నారా లోకేశ్‌ ( Nara Lokesh)పై కొడాలి నాని (Kodali nani) అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొడాలి వ్యాఖ్యలకు నిరసనగా గుడివాడలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. అయితే పలు చోట్ల తమ నిరసన దీక్షలను అడ్డుకోవడంపై.. టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కేవలం నిరసనలు చేపట్టడమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కొడాలి నానికి వ్యతిరేకంగా కేసులు పెడుతున్నారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలి అంటూ స్టేషన్ల ఎదుట కూడా బైఠాయించారు.

  పలు చోట్ల నాని దిష్టిబొమ్మతో శవయాత్రలు నిర్వహించారు. వాటిని సైతం పోలీసులు అడ్డుకున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం పోలీసులను ఛేదించి అద్దంకి బస్టాండ్ సెంటర్‌లో ఆందోళనకు దిగారు. తెలుగు మహిళలు కొడాలి నాని ఫోటోని చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు.

  అయితే తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రవి నాయుడు చేపట్టిన నిరసన వైరల్ అయ్యింది. కొడాలి నాని ఫొటోను పందికి చుట్టి వినూత్న ప్రదర్శన చేశారు. నాని జన్మ ఊర పంది జన్మ అంటూ ఫైర్‌ అయ్యారు. కొడాలి నాని ఊర పందిలా ఊరంతా తిరుగుతూ ఎది పడితే అది తింటూ చంద్రబాబును విమర్శిస్తున్నారని.. ఈ రాష్ట్రానికి పట్టిన పొల్యూషన్ కొడాలి నాని అని నిప్పులు చెరిగారు.

  చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు.. కొడాలి నాని తీరుకు వ్యతరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు అడ్డుకున్నా.. టీడీపీ నేతలు ఆందోళనల నుంచి వెనక్కు తగ్గడం లేదు. అయితే తిరుపతి టీడీపీ పార్టీ నేతలు చేసిన వినూత్నమైన నిరసన హైలైట్ అవుతోంది. మంత్రి కొడాలి నానిని పందితో పోల్చుతూ.. పందిపై తింట్ల దండకం కురిపించారు.

  ఇదీ చదవండి : దేశమంతటా గణేష్‌ నిమజ్జనాలు ముగిశాయి.. ఈ గణపయ్యను మాత్రం విసర్జన చేయలేదు.. ఎందుకో తెలుసా?

  తాజాగా.. విజయవాడలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో కొడాలి నానిని ఓడించి తీరుతామని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా సమావేశంలో మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు(Devineni Uma maheshwara rao) ఆవేశానికి లోనయ్యారు. సాధారణంగా ఎఫ్పుడూ కూల్‌గా ఉండే మంత్రి దేవినేని ఉమ.. టీడీపీ నేతల మీటింగ్‌లో రెచ్చిపోయారు. కొడాలి నాని(Kodali Nani) ఇతర వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ తొడ కొట్టారు.

  ఇదీ చదవండి : ఏపీకి పెట్టుబడుల ప్రవాహం.. దేశంలో నెంబర్ వన్ స్థానం.. కొత్త పెట్టుబడులు ఇవే.

  అక్కడే ఉన్న గుడివాడ(Gudivada) టీడీపీ ఇంఛార్జ్ రావి వెంకటేశ్వరరావును పిలిపించి మరీ తొడగొట్టించారు. దీంతో అక్కడున్న టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అలాగే వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని ప్రత్యర్థి రావి వెంకటేశ్వరరావే ఉంటారనే క్లారిటీ ఇచ్చారు దేవినేని ఉమ..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Kodali Nani, TDP

  ఉత్తమ కథలు