హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nara Lokesh: ఆ ఇద్దరి లెక్క తేల్చేస్తారా..? లోకేష్ సైలెంట్ ఆపరేషన్ మొదలెట్టారా..?

Nara Lokesh: ఆ ఇద్దరి లెక్క తేల్చేస్తారా..? లోకేష్ సైలెంట్ ఆపరేషన్ మొదలెట్టారా..?

నారా లోకేష్ (ఫైల్)

నారా లోకేష్ (ఫైల్)

Nara Lokesh: రాబోయే ఎన్నిల్లో ఆ ఇద్దర్నీ టార్గెట్ చేస్తోంది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. ఇప్పటికే నారా లోకేష్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం ఉంది. తాను పోటీ చేయనున్న మంగళగిరితో పాటు.. మరో రెండు నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారని.. ఇప్పటికే ఆపరేషన్ కూడా ప్రారంభించారనే ప్రచారం తెలుగు తమ్ముళ్లలో జరుగుతోంది.

ఇంకా చదవండి ...

Nara Lokesh: గతంలో పోల్చుకుంటే తెలుగు దేశం పార్టీ (Telugu  Desam Party) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రాజకీయాల్లో చాలా దూకుడు పెంచారు. ప్రసంగాలు.. పంచ్ లు.. ఎదురుదాడి.. సవాళ్లు.. ఇలా గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తూ.. ఇప్పుడు 2024 ఎన్నికల కోసం కొత్త అస్త్రాలతో.. వ్యూహాలతో సిద్దం అవుతున్నారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి (Mangala Giri) లో ఓటమి.. పార్టీ అనూహ్యంగా 23 సీట్లకు పడిపోవటం...తొలి సారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిన తనను వైసీపీ నేతలు అవహేళన చేయటం లోకేష్‌లో కసిని పెంచాయి అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.. ఈసారి కచ్చితంగా తన ప్రభావం చూపించాలని.. లేదంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆయనకు అర్థమైంది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు (Chandrababu) కు పోటీగా నిత్యం కష్టపడుతున్నారంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు వారుసుడిగా ఏ అంశంలోనూ వెనుకబడకూడదనే ఉద్దేశంతో పూర్తిగా మారిపోయారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అందుకే ప్రసంగాల నుంచి వ్యవహార శైలి వరకు అన్నింటా మార్పు కనిపిస్తోంది. కొంత కాలంగా పార్టీ అధినేత చంద్రబాబు పూర్తిగా పార్టీని 2024 ఎన్నికలకు సమాయత్తం చేసే పనిలో నిమగ్నమైతే.. నారా లోకేష్ లో మూడే నియోజక వర్గాలపై ఫోకస్ చేస్తూనే.. అధికార వైసీపీని టార్గెట్ చేసే బాధ్యతలు తీసుకున్నారు.

ప్రభుత్వ నిర్ణయాలు.. వైసీపీ నేతల వ్యవహార శైలి పై లోకేష్ వెంట వెంటనే స్పందిస్తున్నారు. ఎక్కడ కార్యకర్తల పై దాడులు జరిగినా.. కార్యకర్తల కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. 2024 ఎన్నికల కోసం చంద్రబాబు ఇప్పటికే ఒక పక్కా స్ట్రాటజీతో సిద్దమయ్యారు. పొత్తులు-తుది నిర్ణయాల విషయంలో మాత్రం ఆచి తూచి వ్యవహరించనున్నారు. 2024 ఎన్నికల వేళ..ఏ విధంగా వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదనే బలమైన అభిప్రాయంతో ఉన్నారు.

ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో యవతను రంగంలోకి దింపాలనే లక్ష్యంతో లోకేష్ ఉన్నారు. సీనిమయర్లకు ప్రాధాన్యత ఇస్తూనే.. క్షేత్ర స్థాయిలో మాత్రం యువతకు ప్రాధాన్యత ఇచ్చేలా పార్టీ సీనియర్లను ఒప్పించే క్రమంలో వ్యూహాత్మకంగా ముందు నుంచే పావులు కదుపుతున్నారు. దీని ద్వారా వైసీపీతో సై అంటే సై అనే విధంగా పార్టీ యంత్రాంగం సిద్దంగా ఉంటుందనేది లోకేష్ వ్యూహం. అలాగే ప్రత్యేకించి ఆయన ఓ మూడు నియోజకవర్గాలపై ఫోకస్ చేసినట్టు సమాచారం.

ఇదీ చదవండి : సొంత పార్టీకే షాకిస్తున్న వైసీపీ నేతలు.. పెరుగుతున్న వ్యతిరేక స్వరం దేనికి సంకేతం

తాను 2019 ఎన్నికల్లో ఎక్కడైతే ఓడి తడబడ్డారో..అక్కడే నిలబడి వచ్చే ఎన్నికల్లో గెలిచి చూపిస్తానంటూ కార్యకర్తల సమక్షంలో లోకేష్ టీడీపీ అధినేత కు హామీ ఇచ్చారు. అంతేకాదు నిత్యం అక్కడి నేతలతోనూ.. కార్యకర్తలతోనూ ఆయన టచ్ లో ఉన్నారు. ఇక, తన ప్రసంగాల పైన గతంలో ఉన్న విమర్శలు ఇప్పుడు లేవు. లోకేష్ విమర్శల పైన వైసీపీ నేతలు స్పందించక తప్పటం లేదు. దీంతో పాటుగా.. టీడీపీ అధినేత చంద్రబాబు - తనను..తన తల్లి గురించి వ్యాఖ్యలు చేసిన వైసీపీ వాళ్లను వదిలేది లేదని స్పష్టం చేసిన లోకేష్ ఇప్పుడు దాని కోసం వ్యూహకర్తలతో కలిసి ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేస్తున్న్టటు సమాచారం. ముఖ్యంగా గుడివాడలో కొడాలి నాని.. గన్నవరంలో వల్లభనేని వంశీ పైన ఈ సారి కొత్త స్కెచ్ సిద్దం చేస్తున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది.

ఇదీ చదవండి: ఏపీ సీఎం జగన్.. త్వరలోనే దేశ ప్రధాని అవుతారు.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ఆ రెండు నియోజకవర్గాల్లో అసలు టీడీపీకి అభ్యర్ధులే లేరంటూ వైసీపీ ప్రచారం చేస్తున్న వేళ..ఊహించని విధంగా కొత్త అభ్యర్ధులను తెర మీదకు తెచ్చేందుకు రంగం సిద్దం అవుతోందని తెలుస్తోంది. పార్టీ నేతలను ఆ రెండు నియోజకవర్గాల్లో ముందు నుంచే మోహరించి.. పూర్తిగా పోలింగ్ బూత్ నుంచి ప్రజల్లో మమేకం అయ్యేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. గన్నవరంలో వంశీకి వ్యతిరేకంగా వైసీపీలో ఉన్న నేతలు సైతం ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీకి సహకరించమని చెబుతున్నారు. వీటన్నింటినీ తమకు అనకూలంగా మలచుకొనేందుకు స్కెచ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి : చాలాకాలం తరువాత జగన్ వెంట వైఎస్ విజయమ్మ.. ప్లీన‌రీ తరువాత రాజీనామా చేస్తారా?

గుడివాడ నుంచి నందమూరి కుటుంబానికి చెందిన వారినే పోటీలోకి దించే అంశం పైన పార్టీలో చర్చ వినిపిస్తోంది. అయితే, పొత్తుల అంశం పైన క్లారిటీ రాకుండా ఎక్కడా అధికారికంగా అభ్యర్దులను ప్రకటించకూడదనేది అధినేత ఆదేశాలుగా చెబుతున్నారు. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో అనేక కోణాల్లో సర్వేలు - సమాచారం ఎప్పటికప్పడు తెప్పించుకుంటూ.. సూక్ష్మ స్థాయిలో లోకేష్ ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు సమాచారం.

First published:

Tags: Andhra Pradesh, AP News, Kodali Nani, Nara Lokesh, TDP, Vallabhaneni Vamshi

ఉత్తమ కథలు